EPAPER

MAD Movie Review : క్రేజీ కంటెంట్ తో తెరకెక్కిన మ్యాడ్ చిత్రం ఎలా ఉందంటే..?

MAD Movie Review : క్రేజీ కంటెంట్ తో తెరకెక్కిన మ్యాడ్ చిత్రం ఎలా ఉందంటే..?
MAD Movie Review

MAD Movie Review : కంటెంట్ కరెక్ట్ గా ఉంటే చాలు ఒక్కొక్కసారి చిన్న చిత్రాలే పెద్ద సక్సెస్ సాధిస్తాయి. ప్రస్తుతం ప్రేక్షకుల టెస్ట్ లో కూడా చాలా మార్పు వచ్చింది కాబట్టి ఎక్కువ కంటెంట్ ఉన్న చిన్న తరహా చిత్రాలు మన ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మొదటిసారిగా కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంతో పాటు చిన్న బడ్జెట్ చిత్రంగా మ్యాడ్ అనే మూవీ ని తెరకెక్కించింది. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి…పైగాఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన నిర్మాత నాగ వంశీ…జాతి రత్నాలు చిత్రం కంటే తక్కువ నవ్వితే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను అని కామెంట్ చేయడంతో ఈ చిత్రం పై ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగాయి. మరి అంత కాన్ఫిడెంట్ గా చెప్పిన మూవీ ఎలా ఉందో తెలుసా?


స్టోరీ:

మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్),దామోదర్ (సంగీత్ శోభన్)… ముగ్గురు రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు. భగవాన్ క్యాంటీన్ విషయంలో అనుకోకుండా జరిగిన బాస్కెట్ బాల్ పోటీలలో గెలిచిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ గా మారుతారు. శృతి(గౌరి)ని ప్రేమిస్తుంటే ,అశోక్ జెన్నీ (అనంతిక) ను ఇష్టపడతాడు. మరోపక్క దామోదరకు ఎవరో కూడా తెలియని ఒక అమ్మాయి లవ్ లెటర్ రాసి ప్రేమలో పడేలా చేస్తుంది. ఈ వెన్నెల రోజు హాస్టల్ కి ఫోన్ చేసి మరి దామోదర్ అలియాస్ డీడీ తో ప్రేమగా మాట్లాడుతుంది. అలా ఆమెను చూడకుండానే ప్రేమిస్తూ అతను నాలుగు సంవత్సరాలు గడిపేస్తాడు. తీరా వెన్నెలను వెతకడానికి ప్రయత్నించినప్పుడు అతనికి ఓ కొత్త నిజం బయటపడుతుంది? ఇంతకీ వెన్నెల ఎవరు? లాస్ట్ కి దామోదర్ పరిస్థితి ఏమైంది? ఈ స్టోరీ మధ్యలో లడ్డు రోల్ ఏంటి? తెలియాలి అంటే స్క్రీన్ పై సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ:

ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని యావరేజ్ గా నిలిచిన చాలావరకు మంచి సక్సెస్ సాధించాయి. కాలేజీకి వచ్చిన కొత్తల్లో పారిపోవాలి అనుకున్న జూనియర్స్ కు తర్వాత కాలేజీలో ఎటువంటి సంఘటనలు ఎదురయ్యాయి ..ఎలా పరిచయాలు పెరిగాయి అంటూ మొదలుపెట్టే కథ అద్భుతంగా సాగుతుంది. మొత్తానికి కాలేజీ వయసులో చేసిన గొడవలు ,చిల్లర పనులు, హాస్టలు, దోస్తులు గుర్తుకు రావాలి అనుకుని ఎవరికైనా ఈ చిత్రం ఒక మధుర జ్ఞాపకాన్ని తట్టి లేపక మానదు.మ్యాడ్ మూవీ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ.

సినిమాలో పేరుకు ముగ్గురు హీరోలు ఉన్న…సంగీత్ శోభన్ అందరిలోకి కాస్త డామినేటింగ్ గా కనిపిస్తాడు. ఈ మూవీలో కామెడీ టైమింగ్ సూపర్ అని చెప్పవచ్చు. మరోపక్క విష్ణు ఓయ్, రఘుబాబుల కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. ఇందులో బాగాలేదు అని చెప్పే అంశమే లేదు. క్యాస్ట్ దగ్గర నుంచి పాటల వరకు… ప్రొడక్షన్ దగ్గర నుంచి కంటెంట్ వరకు…ఎడిటింగ్ దగ్గర నుంచి సినిమాటోగ్రఫీ వరకు ప్రతి ఒక్క అంశంలో ఎంతో శ్రద్ధ తీసుకొని డీసెంట్ గా ఈ మూవీ ని తెరకెక్కించారు.

ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొదలయ్యాక కనీసం గ్యాప్ కూడా ఇవ్వకుండా వరుస పెట్టి వచ్చే కామెడీ సీన్స్, డైలాగ్స్ సినిమా హాల్ ని నవ్వులతో నింపేశాయి. ఫస్ట్ ఆఫ్ కాస్త లాగింగ్ అయిన సెకండ్ హాఫ్ దాని పూర్తిగా కవర్ చేసేసింది. మూవీలో అక్కడక్కడ చిన్నపాటి సంస్కృత పదాలు వాడారు.. సంస్కృతం అంటే గ్రంథాల్లో ఉండేది కాదండోయ్…వాడుకలో యువత వాడే సంస్కృతం. కానీ అది పెద్ద అభ్యంతరకరంగా లేదు పైగా ఎక్కువ చూసేది యువతే కావడంతో ఆ భాష వాళ్లకు అలవాటే. మొత్తానికి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్లే కడుపుబ్బ నవ్వించే చిత్రం ఇది. 

రేటింగ్: 3 / 5

టాగ్ లైన్:

ఒకప్పటి కాలేజ్ రోజులని ప్రతి ఒక్కరికి గుర్తుచేసి మనసు మూలల్లో నిద్రపోతున్న జ్ఞాపకాలను తట్టి లేపే మూవీ ఇది. ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేయాలి… కడుపుబ్బా నవ్వుకోవాలి అనుకునే ప్రతి ఒక్క గ్యాంగ్ కి ఈ మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.

మూవీ మ్యాడ్:

నటీ నటులు : నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్  

                        నితిన్,శ్రీగౌరి ప్రియా రెడ్డి, ఆనంతిక,

                        గోపిక ఉదయన్.

డైరక్టర్ : కళ్యాణ్ శంకర్

ప్రొడ్యూసర్స్. హారిక సూర్యదేవర – సాయి సౌజన్య

సంగీతం. భీమ్స్ సిసిరోలియో

విడుదల తేదీ: 6-10-2023

Related News

Aay Movie: ఆయ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్నామండీ

Game Changer: గేమ్ ఛేంజర్ అప్డేట్.. ఎర్ర కండువాతో చరణ్ అదిరిపోయాడు

Faria Abdullah: మన చిట్టిలో ఇంత టాలెంట్ ఉందా.. అదిరిపోయింది బంగారం

Viran Muttemshetty: అల్లు అర్జున్ కజిన్ హీరోగా గిల్ట్.. ఫస్ట్ లుక్ చూశారా..?

Sri Sri Sri Rajavaru: ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ విచ్చేస్తున్నారు.. నేషనల్ అవార్డ్ దర్శకుడితో నార్నే నితిన్ సినిమా

Devara Trailer: పండగ సందర్భంగా ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Nandamuri Balakrishna: బాలయ్యకు విలన్ గా స్టార్ హీరో.. జనాలను చంపేద్దామనుకుంటున్నారా.. ?

Big Stories

×