EPAPER

Mad First Single: ఆ “లచ్చి” ప్లేస్ లో “లడ్డు” పెట్టి అదే పాటను మార్చి ఇచ్చేసాడు

Mad First Single: ఆ “లచ్చి” ప్లేస్ లో “లడ్డు” పెట్టి అదే పాటను మార్చి ఇచ్చేసాడు

Mad First Single: చిన్న సినిమాలు గా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి కొన్ని సినిమాలు. అలా వచ్చిన కొన్ని సినిమాల్లో అందరికీ ముందుగా గుర్తొచ్చే సినిమా జాతి రత్నాలు. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. పెద్దగా కథనంపై దృష్టి పెట్టకుండా కేవలం వినోదం మాత్రమే ప్రత్యేకంగా తీసుకొని దానిని మాత్రమే అద్భుతంగా ప్రజెంట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద నవ్వులు పువ్వులు పూయించాడు అనుదీప్. ఒక మామూలు కథకి ఇన్నోసెన్స్ తో పాటు, కామెడీ జోడించి దీనిని విజయవంతం చేశాడు. ఇదే తరహాలో కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన మ్యాడ్ సినిమా కూడా హిట్ అయింది.


సంగీత్ శోభన్, నర్నే నితిన్ వంటి యంగ్ హీరోస్ నటించిన ఈ సినిమా మొదటి షో నుంచి మంచి టాక్ సాదించుకొని యూత్ ని థియేటర్స్ కు విపరీతంగా రాబట్టింది. ఈ సినిమాలో కామెడీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ కామెడీ. అలానే ఈ దర్శకుడు కళ్యాణ్ శంకర్ కు అనుదీప్ కి మధ్య ఎప్పటినుంచో మంచి పరిచయం ఉంది. అందుకనే మ్యాడ్ సినిమాలో కూడా అక్కడక్కడ అనుదీప్ టచ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక అనుదీప్ తీసిన జాతి రత్నాలు సినిమాకి కూడా రచనా దర్శకత్వంలో పనిచేసిన అనుభవం కళ్యాణ్ శంకర్ కి ఉంది. వీరిద్దరూ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కామెడీ సినిమాలు తో తమదైన మార్కును క్రియేట్ చేశారు.

ఇక మ్యాడ్ సినిమాకి సీక్వల్ గా మ్యాడ్ 2 రానున్న సంగతి తెలిసిందే. మ్యాడ్ మ్యాక్స్ పేరుతో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా ఆల్రెడీ మొదలైపోయింది. ఈ తరుణంలో ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. లడ్డు గానికి పెళ్లి అనే ఈ ప్రోమో సాంగ్ వినగానే చాలామందిని ఆకట్టుకుంటుంది. ఇన్స్టెంట్ చాట్ బస్టర్ లో అనిపిస్తుంది. అయితే ఇదే పాటని కొన్నేళ్ళ క్రితం భీమ్స్ స్లమ్ డాగ్ హస్బెండ్ అనే సినిమాలో కొట్టాడు. సంజయ్ రావు ప్రణవి నటించిన ఆ సినిమా ప్రేక్షకులకి అంతగా తెలియలేదు. అయితే మ్యాడ్ సినిమాకి మంచి బజ్ ఉంది కాబట్టి అదే పాటను తీసుకొచ్చి దీంట్లో పెట్టాడు అనేది చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


లచ్చి గానికి పెళ్లి అని పాటలో.. లచ్చి అనే పేరు తీసేసి లడ్డు అనే పేరు పెట్టి, లడ్డు గానికి పెళ్లి అనే ప్రోమో రిలీజ్ చేశారు. అయితే భీమ్స్ వర్క్ తెలిసిన చాలామంది పాట రిలీజ్ అయిన సంవత్సరానికే అదే పాటను మరో సినిమాకి ఇచ్చేసావ్ ఏంటి అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఏదేమైనా ముందు ముందు రోజుల్లో ఈ సినిమా ఇంటర్వ్యూస్ లో భాగంగా దీనికి సమాధానం కూడా దొరికే అవకాశం ఉంది అని చెప్పాలి. ఏదేమైనా ప్రస్తుతం భీమ్స్ వరుస సినిమాలు చేసుకుంటూ కెరియర్ లో బిజీగా మారాడు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×