EPAPER

Maa Amma Satyavathi: ‘మా అమ్మ సత్యవతి’ షార్ట్ ఫిల్మ్ విడుదల.. క్లైమాక్స్‌లో ఎమోషనల్ మెసేజ్

Maa Amma Satyavathi: ‘మా అమ్మ సత్యవతి’ షార్ట్ ఫిల్మ్ విడుదల.. క్లైమాక్స్‌లో ఎమోషనల్ మెసేజ్

Maa Amma Satyavathi: అమ్మ గురించి, అమ్మ ప్రేమ గురించి చెప్పడానికి ఎన్నో సినిమాలు, ఎన్నో పాటలు ఉన్నాయి. అలాగే ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ కూడా అమ్మ ప్రేమ గురించి ప్రేక్షకులకు తెలియజేయడానికే తెరకెక్కాయి. తాజాగా అలాంటి ఒక షార్ట్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ‘మా అమ్మ సత్యవతి’. ఈ షార్ట్ ఫిల్మ్ మొత్తం ఒక ఎత్తు అయితే.. ఇందులో ఉండే అమ్మ పాట మరొక ఎత్తు. ఇది చూసిన ప్రేక్షకులకు తమ తల్లిని గుర్తుచేసేలా దీనిని తెరకెక్కించారు మేకర్స్. తాజాగా ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్‌లో విడుదలయ్యింది. ఈ సందర్భంగా ఇందులో లీడ్ రోల్‌లో నటించిన సతీష్ ధవళేశ్వరపు స్పందించారు.


ఫీల్ గుడ్ షార్ట్ ఫిల్మ్

ముందుగా ‘మా అమ్మ సత్యవతి’ షార్ట్ ఫిల్మ్‌ను ప్రమోట్ చేయడం కోసం ఇందులోని పాటను విడుదల చేశారు మేకర్స్. ఆ పాట వింటుంటే మంచి ఫీల్ ఉందని, తల్లి ప్రేమ గురించి అర్థవంతమైన లిరిక్స్ అందించారని చాలామంది ప్రేక్షకులు ఫీలయ్యారు. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ కూడా అంతే ఫీల్ గుడ్ ఉందని ప్రశంసిస్తున్నారు. అమ్మ ప్రేమ గురించి వర్ణించే కొన్ని సినిమాలు, పాటు ఇన్‌స్టంట్‌గా ప్రేక్షకుల మనసులో నిలిచిపోతాయి. ఇప్పుడు అదే లిస్ట్‌లోకి ‘మా అమ్మ సత్యవతి’ షార్ట్ ఫిల్మ్, అందులోని పాట యాడ్ అయ్యాయి. మయూక్ వెలగపూడి పాడిన ఈ పాట విడుదలయిన వెంటనే ఆడియన్స్ దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్‌కు కూడా అంతే.


Also Read: సాయి పల్లవిని వెలివేస్తున్న ప్రేక్షకులు, ట్విటర్‌లో ట్రెండింగ్.. ఇంతకీ ఏం జరిగిందంటే?

అందరికీ నచ్చుతుంది

‘‘నేను ప్రధాన పాత్రలో నటించిన, తల్లి పాటతో కూడిన షార్ట్ ఫిల్మ్ ‘మా అమ్మ సత్యవతి’ యూట్యూబ్‌లో విడుదల చేశాం, మీరు అందరూ చూసి మీ విలువైన అభిప్రాయాన్ని వ్యాఖ్యానించండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది, మిస్ అవ్వకండి, ఫైనల్‌గా మంచి మెసేజ్ ఉంది’’ అంటూ ‘మా అమ్మ సత్యవతి’ షార్ట్ ఫిల్మ్‌లో లీడ్ రోల్ చేసిన సతీష్ ధవిలేశ్వరపు తెలిపారు. ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. ఆయన నమ్మినట్టుగానే ఇందులో సతీష్ నటన హైలెట్‌గా నిలిచింది. క్లైమాక్స్‌లో ఆయన నటనతో ప్రేక్షకుల్లో కంటతడి పెట్టించారు.

అమ్మ ప్రేమకు పోలికలు

‘మా అమ్మ సత్యవతి’ షార్ట్ ఫిల్మ్‌కు ప్రాణంగా నిలిచిన మరొక అంశం.. మ్యూజిక్. పీఆర్ అందించిన సంగీతం షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ప్రేక్షకులకు చాలా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఆ పాటకు ఆయన అందించిన సంగీతం సరిగ్గా సెట్ అయ్యింది. ‘మా అమ్మ సత్యవతి’ పాటకు కోనల కాళి కృష్ణ లిరిక్స్ అందించారు. ముందుగా ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేసినప్పుడు లిరిక్సే హైలెట్ అయ్యాయి. అమ్మ ప్రేమను చాలావాటితో పోలుస్తూ లిరిక్స్ ఉన్నాయి. ఇక షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత దానికి, ఆ పాటకు, లిరిక్స్‌కు సరిగ్గా సరిపోయిందనే ఫీలింగ్ వస్తుంది.

Related News

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి నరకం చూపించిన డైరెక్టర్..?

Tabu: షాకింగ్.. 52 ఏళ్ల వయస్సులో ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన నాగార్జున గర్ల్ ఫ్రెండ్.. ?

Rahasya Gorak: అర్ధరాత్రి 2 గంటలకు కూడా అదే పని.. ప్లీజ్.. మా ఆయన కోసం ‘క’ చూడండి

Mokshagna Teja:హీరోయిన్ సెలక్షన్ వెనుక ఇంత కథ జరిగిందా.. బాలయ్య పగడ్బందీ ప్లాన్..!

Photo Talk: మెగా- అక్కినేని వారసులు.. ఒకే ఫ్రేమ్ లో.. చూడడానికి రెండు కళ్లు చాలడంలేదే

×