EPAPER

Ma oori polimera 3: పాన్ ఇండియా రేంజ్‌లో ‘మా ఊరి పొలిమేర-3’..

Ma oori polimera 3: పాన్ ఇండియా రేంజ్‌లో ‘మా ఊరి పొలిమేర-3’..

Ma oori polimera 3: కరోనా తర్వాత ఓటీటీలకు మరింత ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో థియేటర్లకు వెళ్లేందుకు ఇష్టపడని ఆడియన్స్ ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు మంచి కంటెంట్‌తో అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా 2021లో నేరుగా ఓటీటీలోకి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం ‘మా ఊరి పొలిమేర’. అప్పట్లో ఈ సినిమా చూసేవారి వెన్నులో వణుకు పుట్టించింది. సస్పెన్స్, థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఆకట్టుకుంది.


ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘మా ఊరి పొలిమేర-2’ చిత్రం రూపొందింది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మరింత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుని వసూళ్ల వర్షం కురిపించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా వేదికగా కూడా స్ట్రీమింగ్ అవుతూ.. బుల్లితెర ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీకి కొనసాగింపుగా మరో చిత్రం‘మా ఊరి పొలిమేర-3’ రానుందంటూ పార్ట్ 2 క్లైమాక్స్‌లో చూపించారు.

అయితే ఈ సారి తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఏ లెవెల్లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. కాగా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, చిత్రం శ్రీను, అక్షతా శ్రీనివాస్, సాహితీ దాసరి, రవివర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Tags

Related News

Akhil Akkineni: అయ్యగారిలో ఇంత కసి ఉందా.. నాగర్జున వ్యాఖ్యలు వైరల్

Renu Desai: ప్లీజ్ సాయం చెయ్యండి.. హెల్ప్‌లెస్‌గా ఉన్నాను.. రేణు దేశాయ్ వేడుకోలు

Jani Master : జానీకి రిమాండ్ విధించిన కోర్టు… బెయిల్ పరిస్థితి ఏంటంటే..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : లీగల్‌గా పోరాడుతా.. లైంగిక ఆరోపణలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జానీ మాస్టర్

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bhanumathi: ఉన్నతంగా బ్రతికిన భానుమతి.. చరమాంకంలో దీనస్థితికి చేరుకోవడానికి కారణం..?

Big Stories

×