EPAPER

Rajini Kanth : పాపం నిర్మాతలు… సూపర్ స్టార్‌ని నమ్ముకున్నారు… నిండా మునిగిపోయారు..

Rajini Kanth : పాపం నిర్మాతలు… సూపర్ స్టార్‌ని నమ్ముకున్నారు… నిండా మునిగిపోయారు..

Rajini Kanth : సిక్స్ ప్యాక్ బాడీ ఉండదు. అదిరిపోయే హెయిర్ స్టైల్ ఉండదు. యంగ్ ఏజ్ కూడా కాదు. అయినా.. సూపర్ స్టార్ రజినీకాంత్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. 73 ఏళ్ల వయసులోనూ యాక్షన్ సీన్స్ చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తాడు రజినీ. అలాగే ఈ సూపర్ స్టార్ నుంచి ఓ సినిమా వస్తుంది అంటే చాలు… మన దేశంలోనే కాదు… మలేషియా లాంటి దేశాల్లో ప్రభుత్వాలే సెలవులు ప్రకటిస్తాయి. అలాంటి రేంజ్ మన రజినీకాంత్ ది. అయితే ఇప్పుడు ఓ నిర్మాణ సంస్థ ఇలాంటి సూపర్ స్టార్ రజినీని నమ్ముకుని దారుణంగా నష్టపోయింది. అది ఎవరో ఇప్పుడు చూద్ధాం…


రజినీకాంత్ కెరీర్ లో చాలా సినిమాలు చేశారు. రీసెంట్‌గా వచ్చిన మూవీ వెట్టయాన్. రజినీతో పాటు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ రానా లాంటి స్టార్స్ ఉన్నారు ఈ మూవీలో. అందుకే ఎక్కడ లేని అంచనాలు వచ్చాయి. అలాగే జై భీమ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ చేసిన T. J. జ్ఞానవేల్ దీనికి డైరెక్టర్. ఇది చాలాదా సినిమాపై హోప్స్ పెట్టుకోవడానికి. అలానే అందరూ ఈ వెట్టయాన్ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. కానీ, ఈ మూవీ ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో 300 కోట్లు పెట్టి నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ మరోసారి రజినీకాంత్ నుంచి భారీ దెబ్బ పడింది.

బ్యాక్ టూ బ్యాక్ నష్టాలు…


మరోసారా… అంటే అవును. ఇప్పటి వరకు లైకా ప్రొడక్షన్స్ తో వెట్టయాన్‌తో కలిపి రజినీకాంత్ మొత్తం నాలుగు సినిమాలు (వెట్టయాన్, లాల్ సలామ్, దర్బార్, 2.o) చేశాడు. ఇందులో 2.o మాత్రమే లాభాలను తీసుకొచ్చింది. ఇక, లాల్ సలామ్, దర్బార్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఈ రెండు సినిమాలు రజినీ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లు.

లాల్ సలాం మూవీకి లైకా వాళ్లు నిర్మాణం కోసం దాదాపు 100 కోట్లు పెట్టారు. కానీ, తిరిగి వచ్చింది కేవలం 18 కోట్లు మాత్రమే. అలాగే దర్భార్ మూవీకి లైకా ఖర్చు పెట్టింది ఏకంగా 250 కోట్లు. కానీ, ఆ మూవీకి వచ్చిన కలెక్షన్లు 200 కోట్లే. ఓటీటీ, శాటిలైట్స్ తో కొంతమేర తిరిగి వచ్చినా… నష్టాలను మాత్రం భర్తీ చేయలేకపోయాయి. ఇప్పుడు వెట్టయాన్ మూవీకి కూడా ఫుల్ రన్ ముగిసే సరికి భారీ స్థాయిలో నష్టాలు వచ్చేలా ఉన్నాయి.

భారీ రెమ్యునరేషనే దెబ్బేస్తుందా…?

రజినీకాంత్ రెమ్యునరేషన్ అనేది ఎప్పుడూ హాట్ టాపికే. సౌత్ ఇండియాలో హైయెస్ట్ పారితోషికం తీసుకుంటున్నారు అనే టాక్ కూడా ఉంది. ప్రతి సినిమాకు రజినీకాంత్ తీసుకునేది 100 కోట్లపైమాటే. అంటే నిర్మాతలకు సినిమా నిర్మించే దాని కంటే ఎక్కువ రెమ్యునరేషన్ కే ఖర్చు అవుతుంది. అంత పారితోషికంతో వస్తున్న సినిమాలు హిట్ అయి, నిర్మాతలకు నష్టాలు రాకుంటే, రెమ్యునరేషన్ గురించి చర్చ రాదు. కానీ, రజినీకాంత్ – లైకా కాంబోలో వచ్చిన నాలుగు సినిమాల్లో రెండు భారీ డిజాస్టర్లు, ఒకటి యావరేజ్. ఒక్కటి మాత్రమే హిట్ అయింది. అందుకే ఆయన రెమ్యునరేషన్ గురించి మాట్లాడాల్సి వస్తుంది.

లైకాతో మరో సినిమా… ఈ సారి తక్కువ రెమ్యునరేషన్..

వరుసగా నష్టాలు రావడంతో లైకాతో రజినీకాంత్ ఓ అగ్రిమెంట్ చేసుకున్నాడట. ఈ అగ్రిమెంట్ ప్రకారం… లైకా సెలెక్ట్ చేసిన స్టోరీతో రజినీ ఓ సినిమా చేయబోతున్నాడట. దీనికి రజినీ కాంత్ రెమ్యునరేషన్ చాలా తక్కువ తీసుకుంటాడని టాక్. ఆ సినిమాతో అయినా, లైకాకు వచ్చిన నష్టాలు కొంత వరకు అయిన రికవరీ అవుతాయని అనుకుంటున్నారట.

Related News

Costly Divorce: అత్యధిక భరణం ఇచ్చుకున్న సెలబ్రిటీస్ వీళ్లే..!

Ram Gopal Varma : బయోపిక్ చేయడానికి రెడీ అయ్యాడా… అందుకే ఈ ట్వీట్స్ చేస్తున్నాడా..?

Allu Arjun: అల్లు అర్జున్‌కు షాకిచ్చిన ఫ్యాన్, ఏకంగా 1600 కిలోమీటర్లు సైకిల్‌పై.. అభిమానాన్ని ఆపలేం సార్!

Naga Chaitanya : నాగ చైతన్య కార్ రేసింగ్ కు దూరం అవ్వడానికి కారణం వాళ్లేనా?

Mythri Movie Makers : బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థతో మైత్రి బిగ్గెస్ట్ డీల్… పెద్ద ప్లానే

Akhanda 2 Remuneration : అఖండమైన రెమ్యునరేషన్… బాలయ్య కెరీర్‌లోనే హైయెస్ట్ ఈ మూవీకే..

Amala Paul : అయ్యయ్యో అమలా పాల్ కి ఏమైంది? ఇలా మారిపోయిందేంటి!!

Big Stories

×