Big Stories

Lucky Lakshman : ‘లక్కీ లక్ష్మణ్’ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం- సోహైల్

Lucky Lakshman : బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’. ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత గోగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 30న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్బంగా ‘ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించారు. ఈవెంట్‌లో బిగ్ టికెట్‌ను డైరెక్టర్ అభి తండ్రి గంగిరెడ్డి ఆవిష్కరించి సోహైల్ తండ్రి సలీమ్‌కి అందించారు.

- Advertisement -

హీరో సోహెల్ మాట్లాడుతూ ‘‘నేను ఈ స్థాయికి రావడం తెలుగు ప్రజలు. ప్రతీ సక్సెస్ మెన్ వెనుక ఉమెన్ ఉంటుందని అంటారు. కానీ నా సక్సెస్ వెనుక మా నాన్న ఉన్నాడు. నాకు వచ్చిన డబ్బుల్లో కొంత సాయం చేయడమే నాకు తెలుసు. నాకు సినిమా తప్పా ఇంకోటి తెలీదు. మా నిర్మాత హరిత గారు ఈ సినిమాను ఓన్‌గా రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ అభి ఎంతో కష్టపడ్డారు. సినిమా కంటెంట్‌ను నమ్మి చేస్తున్నామని డైరెక్టర్ ఎప్పుడూ చెబుతూనే వచ్చారు. ఇది ఫ్యామిలీ సబ్జెక్ట్. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. సినిమాలో నటించిన రాజా రవీంద్ర, దేవీ ప్రసాద్, షానీ అన్న ఇలా అందరికీ థాంక్స్. తెలుగు ప్రజలే నా ధైర్యం. మీరే నా సినిమాను ముందుకు తీసుకెళ్లాలి. ఆండ్రూ గారి కెమెరా వర్క్ బాగుంది. హరిత గారు డేరింగ్ అండ్ డాషింగ్ నిర్మాత. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నవ్వుతారు, ఏడుస్తారు. డిసెంబర్ 30న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

- Advertisement -

డైరెక్టర్ అభి మాట్లాడుతూ ‘‘లక్కీ లక్ష్మ‌ణ్ టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ చూశారు. థియేటర్ నుంచి బయటకు వచ్చాక మంచి సినిమా చూశామని ఫీల్ అవుతారు. ఈ సినిమా చేద్దామని అనుకున్న తరువాత సోహెల్‌ను కలిశాం. ఫస్ట్ సిట్టింగ్‌లోనే కథ ఓకే చెప్పాడు. ఇకపై నా సినిమాలన్నింటికి కెమెరామెన్‌గా ఆండ్రూ సారే ఉంటారు. అనూప్ సర్‌ మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్‌. సోహైల్‌ ఫైనాన్షియల్ స్టేటస్, సోషల్ స్టేటస్ నాకు తెలుసు. కానీ ఎంత మందికి సాయం చేస్తారో మీకు తెలీదు. అవుట్ సైడ్ కాదు ఇన్ సైడ్ కూడా బ్యూటీఫుల్. నేను ఏం చేయలేను.. దేనికి పనికి రాను అనే సమయంలో హరిత నన్ను నమ్మింది’’ అన్నారు.

నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ.. ‘‘ అభికి చిన్నతనం నుంచి డైరెక్షన్ పిచ్చి ఉంది. ఎప్పుడైనా ఆపేస్తాడేమో అనుకున్నాను. డైరెక్షన్ చేయాలనే కోరిక ఉందని నాకు అర్థమైంది. చిన్నతనంలో నా కోరికలేవీ తీరలేదేమో గానీ.. అభి తన జీవితంలో ఉన్న ఒకే ఒక్క కోరికను తీర్చాలని అనుకున్నాను. అందుకే మా ప్రతీ చెమట చుక్కని డబ్బుగా మార్చి ఈ సినిమాను తీశాం. బడ్జెట్ పరంగా చిన్న సినిమానే అయినా ఇది మాకు చాలా పెద్ద సినిమా. కంటెంట్ ఉన్న మూవీస్‌ను తెలుగు ఆడియెన్స్‌ ఆదరిస్తారనే నమ్మకంతోనే ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం. ఇదంతా కూడా మా టీం వల్లే సాధ్యమైంది. ఈ సినిమాలో డైరెక్టర్‌ గారి రైటింగ్ అద్భుతంగా ఉంది. సోహైల్‌ చాలా మంచి అబ్బాయి. ఎంతో కష్టపడతాడు. కాస్త షార్ట్ టెంపర్ కూడా ఉంటుంది. లోపల ఎలా ఉంటే బయట అలా ఉంటాడు. మనిషి కదా? అన్ని ఎమోషన్స్ ఉండాలి. సోహెల్ మంచి నటుడు. సోహెల్ పక్కా హీరో పీస్. మేం చేసిన పనిని గుర్తించండి’’ అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News