EPAPER

Lucky Bhasker pre release: 30 రూపాయలతో రోడ్డు మీదకు వచ్చేసాం – త్రివిక్రమ్

Lucky Bhasker pre release: 30 రూపాయలతో రోడ్డు మీదకు వచ్చేసాం – త్రివిక్రమ్

Lucky Bhasker pre release:  ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. స్వయంవరం సినిమాతో రచయితగా కెరియర్ మొదలు పెట్టిన త్రివిక్రమ్ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. పోస్టర్ పైన త్రివిక్రమ్ పేరు చూసి సినిమాకి వెళ్ళిన ఆడియన్స్ కూడా ఉన్నారని చెప్పాలి. మాటలను చాలా ఈజీగా అర్థమయ్యే స్థాయిలో రాశారు త్రివిక్రమ్. అలానే రైటింగ్ లో కూడా ఒక స్టాండర్డ్ ను క్రియేట్ చేశారు. లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మంచి స్నేహితుడు సునీల్. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సునీల్ నటుడు అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఏ ఆఫీస్ కి వెళ్ళినా కూడా నా రూమ్ లో మంచి రైటర్ ఉన్నాడు అంటూ చెబుతూ ఉండేవాడు. కానీ ఆ విషయాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. స్వయంవరం సినిమా రిలీజ్ అయిన తర్వాత త్రివిక్రమ్ కోసం చాలా ఆఫీసులు నుంచి నిర్మాతలు వచ్చారు. ఆ తరుణంలో సునీల్ సార్ లోపల బిజీగా ఉన్నారని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక సునీల్ కు గుర్తింపు తీసుకొచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం త్రివిక్రమ్ రాసిన క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పాలి.


మామూలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి విలన్ వేశాలు వేద్దామని వచ్చాడు సునీల్. కానీ అటువంటి సునీల్ ను టాప్ కమెడియన్ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సునీల్ త్రివిక్రమ్ కలిసి ఉన్న రోజులను వాళ్ళ మధ్య జరిగిన ఇన్సిడెంట్ ను ఎన్నోసార్లు కొన్ని ఇంటర్వ్యూస్ లో తెలిపాడు సునీల్. అయితే ఆ ఇన్సిడెంట్ అన్నింటిలో లకిడికపూల్ లో రూమ్ ఖాళీ చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. దీనిని పలు సందర్భాల్లో సునీల్ మాత్రమే చెప్పాడు. కానీ ఏ రోజు త్రివిక్రం దీని గురించి మాట్లాడలేదు. ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ సినిమా ఈవెంట్లో ఈ ఇన్సిడెంట్ ను గుర్తు చేసుకున్నారు త్రివిక్రమ్.

అసలు జరిగిన విషయం ఏమిటంటే వీరిద్దరూ కలిసి లకిడికపూల్ లో ఒక రూమ్ లో ఉండేవాళ్ళు. ఆ టైంలో వీరిద్దరినీ రూమ్ ఖాళీ చేయమని ఓనర్ ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే రూమ్ ఖాళీ చేసే టైం కి వీరిద్దరి దగ్గర సరిగ్గా 30 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ 30 రూపాయలతో మిగతా రెండు రోజులు ఎలా బతకాలి అని సునీల్ ప్లాన్ చేశాడు. రేపు పొద్దున టిఫిన్ చేద్దాం, మధ్యాహ్నం దిల్ పసంద్ తిందాం అంటూ రెండు రోజులకు సరిపడేటట్లు ప్లాన్ చేశాడు. వెంటనే త్రివిక్రమ్ 30 రూపాయలు ఒకసారి ఇవ్వు అంటూ ఎదురుగా ఉన్న షాప్ లోకి వెళ్లి అప్పుడే కొత్తగా వచ్చిన కోక్ టిన్ 28/- రూపాయలు పెట్టి కొనేశారు. ఆ కోక్ లో కొంత త్రివిక్రమ్ తాగి మిగతా కొంత సునీల్ కు ఇచ్చాడు. మన దగ్గర 30 రూపాయలు ఉండడం బట్టి రెండు రోజులకు నువ్వు ప్లాన్ చేశావు. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు ఇక ఏం చేయాలి అనేది ఇప్పుడు ఆలోచించు అంటూ త్రివిక్రమ్ చెప్పాడు. ఈ ఇన్సిడెంట్ విన్న ప్రతిసారి కొంత నవ్వొస్తుంది ఇంకొంత ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. మొత్తానికి ఇన్సిడెంట్ గురించి ఫస్ట్ టైం త్రివిక్రమ్ రియాక్ట్ అయ్యాడు.


Tags

Related News

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి నరకం చూపించిన డైరెక్టర్..?

Tabu: షాకింగ్.. 52 ఏళ్ల వయస్సులో ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన నాగార్జున గర్ల్ ఫ్రెండ్.. ?

Rahasya Gorak: అర్ధరాత్రి 2 గంటలకు కూడా అదే పని.. ప్లీజ్.. మా ఆయన కోసం ‘క’ చూడండి

Mokshagna Teja:హీరోయిన్ సెలక్షన్ వెనుక ఇంత కథ జరిగిందా.. బాలయ్య పగడ్బందీ ప్లాన్..!

Photo Talk: మెగా- అక్కినేని వారసులు.. ఒకే ఫ్రేమ్ లో.. చూడడానికి రెండు కళ్లు చాలడంలేదే

×