EPAPER

Lucky Bhaskar,KA: దీపావళి సినిమాకు అమావాస్య సెంటిమెంట్

Lucky Bhaskar,KA: దీపావళి సినిమాకు అమావాస్య సెంటిమెంట్

Lucky Bhaskar,KA: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రతివారం సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ వారం వారం రిలీజ్ అయిన సినిమాలు కంటే కూడా పండగ సీజన్ లో రిలీజ్ అయ్యి సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. మన తెలుగు పండుగలు వస్తున్నాయంటే చాలు తెలుగు సినిమాలు ఆ డేట్స్ లో రెడీగా ఉంటాయి. అన్నిటికంటే ముందు సంక్రాంతి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా పెద్ద పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతికి పోటీ పడుతూ ఉంటాయి. సంక్రాంతి తో మొదలైన సంవత్సరం నుండి చివరి పండుగ క్రిస్మస్ వరకు ఏదో ఒక పండగ ఉంటూనే ఉంటుంది. ఆ పండుగలకు సినిమాలు వస్తూనే ఉంటాయి. చాలా పండుగలు లానే దీపావళి పండుగ కూడా చాలా ప్రత్యేకమైనది.


ఇక దీపావళి పండుగ సందర్భంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి లక్కీ భాస్కర్, క సినిమాలో రిలీజ్ కానున్నాయి. లక్కీ భాస్కర్ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నాగ వంశీ నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే అమావాస్య సందర్భంగా ఈ సినిమాను ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోస్ తో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇదివరకే నిర్మాత నాగ వంశీ చాలా సినిమాలకు ముందు రోజు ప్రీమియర్ షోస్ వేశారు. అవి కొంతమేరకు సినిమాలు ప్లస్ అయ్యాయి. మరి కొన్ని సినిమాలకు మైనస్ అయ్యే అని కూడా చెప్పొచ్చు. మ్యాడ్ మంచి సినిమాకు ప్లస్ అయితే ఆదికేశవ అంటే సినిమాకు మైనస్ అయింది. ఇక లక్కీ భాస్కర్ సినిమాకి అది చాలా ప్లస్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు టచ్ అయినటువంటి పాయింట్ దర్శకుడు వెంకి అట్లూరి టచ్ చేశాడు అని పలు ఇంటర్వ్యూస్ లో చెబితే వచ్చాడు నిర్మాత నాగ వంశీ. అలానే ఈ కథ కూడా ఫస్ట్ సిట్టింగ్ లో ఓకే అయిపోయిందని తెలిసింది. ఆ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.

లక్కీ భాస్కర్ చిత్రంతోపాటుగా కిరణ్ అబ్బవరం నటించిన క సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది. షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలు పెట్టిన అబ్బవరం తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని, రాజావారు రాణి గారు సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా చేసి కమర్షియల్ సక్సెస్ చూశాడు. ఆ సినిమాతో కేవలం నటుడు గానే కాకుండా రచయితగా కూడా తన టాలెంట్ బయట పెట్టాడు కిరణ్. ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా తర్వాత ఇప్పటివరకు కిరణ్ కి చెప్పుకోదగ్గ హిట్ ఒకటి కూడా పడలేదు. ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని చేసి వరుస డిజాస్టర్లు మూట కట్టుకున్నాడు. ఇక పద్ధతి మార్చాలని చెప్పి కొంతకాలం గ్యాప్ ఇచ్చి క సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానివ్వండి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. ఇప్పటివరకు కిరణ్ అబ్బవరం కెరియర్లో లేనంత హెవీ బడ్జెట్ ఈ సినిమాకి పెట్టారు. ఇక ఈ సినిమా కూడా ఒకరోజు ముందుగానే స్పెషల్ షోస్ వేసేటట్లు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదేమైనా ఈ దీపావళి సినిమాలకు అమావాస్య సెంటిమెంట్ ఇలా మొదలైంది.


Related News

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ లో ఆ స్పెషల్ సాంగ్ కి అన్నికోట్లా ?

Rajinikanth : ఆ రెండు కథలు పూర్తిగా నాకెందుకు చెప్పలేదు

Trivikram Srinivas : గురూజీకి కథ చెప్పడం అంత తేలికా.?

Salman Khan : లారెన్స్ బిష్ణోయ్ కి సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ ఓపెన్ ఆఫర్

Karthik Subbaraj : ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీ తీస్తున్నాడు, ఎలా వస్తుందో ఏంటో.?

Sharukh Khan: చివరి కోరిక బయటపెట్టిన షారుక్.. కంగారులో ఫ్యాన్స్..!

Suriya: హీరోయిన్ జ్యోతిక ఎన్ని రూ.వందల కోట్లకు అధిపతో తెలుసా..?

Big Stories

×