Lucky Bhaskar Day 3 Collections: దీపావళి కానుకగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సినిమాల సందడి ఎక్కువగానే ఉంది.. ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాల్లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘ లక్కీ భాస్కర్ ‘ ( Lucky Bhaskar )కూడా ఒకటి.. ఈ సినిమా దీపావళి రేసులో విన్నర్ అయ్యిందన్న విషయం తెలిసిందే.. ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ షేక్ అయ్యేలా కలెక్షన్స్ ను కూడా అందుకుంది. మొదటి రోజు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వచ్చాయి. పైడ్ ప్రీమియర్స్ నుంచి ‘లక్కీ భాస్కర్’ సినిమాకు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. ఇక రెండు, మూడు రోజులకు గాను అంటే జోష్ తో సినిమాకు కాసుల వర్షం కురిపించింది. ఇక ఆలస్యం ఎందుకు ఈ మూవీ మూడు రోజులకు ఎంత రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం..
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ‘ లక్కీ భాస్కర్ ‘. ఈ మూవీ దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేసింది. సినిమా పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. రెండు రోజులకు రూ. 26 కోట్ల గ్రాస్ ను రాబట్టిన విషయం తెలిసిందే.. మొదటి రోజు థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల సైతం సినిమాకు సూపర్ హిట్ అని రివ్యూ ఇచ్చేశారు. దాంతో మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లు వచ్చాయి. రెండో రోజు 14 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి.
ఇక బాక్సాఫీస్ వద్ద రికార్డు ల మోత మొగిస్తూ దూసుకుపోతున్న ఈ మూవీ మూడు రోజులకు గాను మరో 15 కోట్లు రాబట్టిందని తెలుస్తుంది. అంటే మొత్తంగా చూసుకుంటే రూ. 40 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్లు తెలుస్తుంది. మలయాళంలో 45 కోట్లకు పైగా షేర్ వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేరళలో స్టార్ స్టేటస్ ఉన్న నటుడు కావడంతో సహజంగానే దుల్కర్ మూవీని అక్కడి ప్రేక్షకులు ఆదరించారు. తెలుగు డబ్బింగ్ అయినా కూడా మలయాళం మార్కెట్ లో తొలి రోజే లక్కీ భాస్కర్ కు రూ.2.05 కోట్లు వచ్చాయి. కేరళలో కేవలం 175 స్క్రీన్లలోనే రిలీజైనా. ఫైనల్ రన్ ఎన్ని కోట్ల దగ్గర ఆగుతుందో చూడాలి. ప్రెసెంట్ ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం కనబడుతుంది.. ఈ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా… శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు..