Dulquer Salmaan : మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan) గురించి ఎంత చెప్పినా తక్కువే.. సీతారామం వంటి ఎమోషనల్ బాండింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. ఆయన సినిమాలకు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంది. అందుకే ఇక్కడ కూడా ఆయన సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.. దాంతో తెలుగు అభిమానులు ఎక్కువగానే ఉంటారు. ఇక రీసెంట్ గా ‘ లక్కీ భాస్కర్ ‘ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు.. ఆ మూవీ దీపావళి కానుకగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటుగా కోట్లు కొల్లగొట్టేస్తుంది. రోజు రోజుకు కలెక్షన్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడు అని గూగుల్ లో చాలా మంది వెతికేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమాకు దుల్కర్ ఎంత తీసుకున్నాడు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పండుగ సీజన్ అంటే వరుస సినిమాలు మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే హంగామా వేరే లెవెల్లో ఉంటుంది. అలా ఎప్పటిలానే ఈ ఏడాదిలో కూడా పండుగలకు చాలా సినిమాలే వచ్చేసాయి.. అలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి మొదలుకొని దీపావళి వరకు ప్రతి పండుగకు సినిమాలు విడుదల అవుతూ వస్తున్నాయి. ఈ దీపావళికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు కలెక్షన్ల సునామి సృష్టిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి. అందుకు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ కూడా ఉంది.,తెలుగులో చేసిన మూడో సినిమా ఇది కాగా తనకి ఇది కూడా మంచి హిట్ అందుకునేలా చేసింది. అయితే దుల్కర్ కి మలయాళం సహా తెలుగులో కూడా మంచి మార్కెట్ వచ్చేసింది. పైగా వరుస హిట్స్ ఇస్తుండడంతో దుల్కర్ కూడా తన రెమ్యునరేషన్ ని పెంచినట్టుగా టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది..
ఈ స్టార్ హీరో ప్రస్తుతం తెలుగు మలయాళ సినిమాలకు గాను 8 నుంచి 10 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. నిజ జీవితంలో కూడా ఇదే లక్కీ భాస్కర్ ఎఫెక్ట్ తో తన రెమ్యునరేషన్ ని పెంచుకున్న వాడిగా నిలిచాడు. కాగా ఇపుడు తెలుగులోనే మరో రెండు సినిమాలు దుల్కర్ చేస్తుండగా ఇవే కాకుండా మలయాళంలో కూడా పలు సినిమాలు చేస్తున్నాడు.. లక్కీ భాస్కర్ తర్వాత ఆయన చేస్తున్న సినిమాలకు రెమ్యూనరేషన్ 10 నుంచి 15 కోట్ల వరకు తీసుకోనున్నారని టాక్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. సినిమాలు మాత్రమే కాకుండా దుల్కర్ వెబ్ సిరీస్ కూడా చేసిన సంగతి తెలిసిందే. అలా ఇపుడు దుల్కర్ ఫుల్ బిజీగా ఉన్నాడని చెప్పాలి. ఇక తన లక్కీ భాస్కర్ సినిమాని తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించగా నాగవంశీ, త్రివిక్రమ్ లు నిర్మాణం వహించారు.. ఇక ముందు కూడా తెలుగులో ఎక్కువ సినిమాలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.