EPAPER

Longest Run Time Movie : ట్రైలరే 72 నిమిషాలు, లాంగెస్ట్ రన్ టైం ఉన్న సినిమా ఏంటో తెలుసా?

Longest Run Time Movie : ట్రైలరే 72 నిమిషాలు, లాంగెస్ట్ రన్ టైం ఉన్న సినిమా ఏంటో తెలుసా?

Longest Run Time Movie : రీసెంట్ గా రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ ‘సింగం అగైన్’ ట్రైలర్ లాంగెస్ట్ రన్ టైం ఉన్న ట్రైలర్ గా సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు 5 నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలరే ఇప్పటిదాకా హిందీలో వచ్చిన అత్యంత సుదీర్ఘమైన రన్ టైం ఉన్న ట్రైలర్ అంటే మరి ఒక సినిమా ట్రైలర్ ఏకంగా మూడు సినిమాల నిడివి అంత ఉంటే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా!? కానీ దాదాపు 720 గంటల ఓ సినిమా ట్రైలర్ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇదే ప్రపంచంలోనే అత్యంత లాంగెస్ట్ రన్ టైం ఉన్న ట్రైలర్. అలాగే సినిమా కూడా. ఈ ట్రైలర్ ను చూడాలంటే ఏకంగా ఓ నెలకు పైగా థియేటర్లలో కూర్చుని చూడాల్సి ఉంటుంది. మరి ఈ రేంజ్ రన్ టైం ఉన్న సినిమా ఏంటి? అసలు అది తెరపైకి వచ్చిందా? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


లాంగెస్ట్ రన్ టైమ్ ఉన్న మూవీ ఇదే…

సాధారణంగా ఒక సినిమా రన్ టైం రెండున్నర గంటలు ఉంటే చాలా ఎక్కువ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు నేటి ప్రేక్షకులు. ఒకవేళ మూడు గంటలు అంతకంటే కొన్ని క్షణాలు ఎక్కువగా ఉన్నా సరే అదొక సాగదీత సినిమా అన్న టాక్ ముందే వచ్చేస్తుంది. రిలీజ్ అయ్యాక ఫలితం ఎలా ఉన్నా సరే ఈ రన్ టైం అనేది సినిమాపై ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా రన్ టైం ఏకంగా 720 గంటలు ఉండడం విశేషం. ఇక ట్రైలర్ అయితే ఏకంగా ఏడు గంటలు ఉంటుంది. కానీ అదృష్టం ఏంటంటే ఈ సినిమా థియేటర్లలోకి రాలేదు.


ఇక అసలు విషయంలోకి వెళ్తే.. 

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ‘ఆంబియన్స్’ (Ambiance). దాదాపు 30 రోజుల నిడివి ఉన్న ఈ సినిమాకు స్వీడిష్ డైరెక్టర్ అండర్స్ విబర్గ్ దర్శకత్వం వహించారు. 2020 డిసెంబర్ 21న థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను స్వయంగా డైరెక్టర్ ఒరిజినల్ కాపీని ధ్వంసం చేయడం అన్నది ప్రేక్షకుల అదృష్టంగా భావించాలి. ఆ ధ్వంసమైన కాపీనే సినిమాకు సంబంధించిన ఏకైక కాపీ కావడం మరో మంచి విషయం. ఇలా ప్రపంచంలోనే లాంగెస్ట్ రన్ టైం కలిగిన సినిమాగా రికార్డును క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ కాకుండా పోయింది. అండర్స్ విబర్గ్ 2014లో ఈ ప్రయోగాత్మక సినిమాకు సంబంధించి ఏకంగా 72 నిమిషాలు ఉన్న ట్రైలర్ ను, 2016లో 439 నిమిషాలు అంటే 7 గంటల 19 నిమిషాలు ఉన్న మరో ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. నిజానికి పాత, క్లాసిక్ సినిమాల రీ క్రియేషన్ నిరసిస్తూ ఆయన ఈ సినిమాను తెరకెక్కించినట్టుగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే ఆ సినిమాను తానే స్వయంగా చేతులారా ధ్వంసం చేసినట్టు 2021 జనవరి 3న తన ఎక్స్ అకౌంట్ ద్వారా చెప్పి షాప్ ఇచ్చాడు. ఇక ఈ డైరెక్టర్ అల్లాటప్ప డైరెక్టర్ కాదు తన కెరీర్ లో ఇప్పటిదాకా 300 కు పైగా సినిమాలు తీశారు. కానీ ఈ ‘ఆంబియన్స్’ సినిమా ఆయన కెరీర్లో చిట్టచివరి సినిమా.

Related News

Balakrishna: సూపర్ హీరోగా మారనున్న బాలయ్య.. రేపే అనౌన్స్మెంట్..!

Nara Rohit Marriage: పెళ్లి కుదిర్చింది ఎవరో తెలుసా.? ఈమె అని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు!

Dil Raju : పాన్ ఇండియా టైటిల్ కష్టాలు… ‘గేమ్ ఛేంజర్’ టైటిల్ వెనక ఇంత కథ ఉందా?

Alia Bhatt: అలియా సంపాదన ముందు వారంతా జుజూబీ.. ఎన్ని కోట్లంటే..?

Prasanth Varma: అప్పుడు ‘హనుమాన్’, ఇప్పుడు ‘మహాకాళి’.. మాట నిలబెట్టుకున్న యంగ్ డైరెక్టర్

Tollywood: ఒక మూవీతో భారీ క్రేజ్.. కట్ చేస్తే.. కెరియర్ నాశనం..!

Big Stories

×