EPAPER

Lokesh Kanagaraj : ప్రతి డైరెక్టర్ మిగతా సినిమాలను కూడా సపోర్ట్ చేయాలి

Lokesh Kanagaraj : ప్రతి డైరెక్టర్ మిగతా సినిమాలను కూడా సపోర్ట్ చేయాలి

Lokesh Kanagaraj : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు తమ ఫ్రెండ్షిప్ ను నిరూపించుకున్నారు. ముఖ్యంగా చందు మొండేటి, సుధీర్ వర్మ, శరణ్ లాంటి ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని చెప్పాలి. దర్శకుడు చందు కి సుదీర్ వర్మ కి హీరో నిఖిల్ మంచి ఫ్రెండ్ అందుకనే ఇద్దరు కూడా నిఖిల్ తో రిపీటెడ్ గా వర్క్ చేశారు. అలానే సునీల్, త్రివిక్రమ్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది రీసెంట్ టైమ్స్ లో వచ్చిన యంగ్ డైరెక్టర్స్ అంత కూడా మంచి ఫ్రెండ్స్ గా మారారు. తెలుగులో కంటే ముఖ్యంగా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలోనే ఈ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. అందుకోసమే తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఒక దర్శకుడు సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమా ఈవెంట్ కు మిగతా దర్శకులు కూడా హాజరవుతూ ఉంటారు.


Also Read : Allu Arvind: పండక్కి సినిమా రిలీజ్ చేస్తామని మేము ఎప్పుడూ చెప్పలేదు

చాలామంది హీరోల సినిమాలకి కూడా శివ కార్తికేయన్ లిరిక్స్ అందిస్తూ ఉంటాడు. చాలా ప్రాజెక్ట్స్ అనిరుద్ రవిచంద్రన్ సెట్ చేస్తూ ఉంటాడు. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో దర్శకుడు నెల్సన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్నేళ్ల క్రితం శింబు హీరోగా, హన్సిక హీరోయిన్ గా నెల్సన్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అయింది కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల వరకు కూడా మరో సినిమా చేయలేదు నెల్సన్. ఆ తర్వాత అనిరుద్ చేసిన హెల్ప్ వలన నయనతారకు సినిమా స్టోరీ చెప్పడం, ఆ స్టోరీ ఓకే అవ్వటం, అదే కొలమావు కోకిల సినిమాగా రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాకి సంబంధించిన డార్క్ కామెడీ అద్భుతంగా వర్కౌట్ అయింది.


 

ఆ సినిమా తర్వాత నెల్సన్ వరుణ్ డాక్టర్ అనే సినిమాను చేశాడు. ఈ సినిమా కూడా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బీస్ట్ సినిమా ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఇకపోతే విగ్నేష్ శివన్ కి కూడా నేను రౌడీనే అనే ప్రాజెక్ట్ సెట్ చేశాడు విజయ్ సేతుపతి. ఆ తర్వాత నయనతార కు భర్తగా మారిపోయాడు విగ్నేష్. ఇకపోతే ఈ విషయాలన్నిటి గురించి కూడా రివీల్ చేశాడు లోకేష్ కనగరాజ్. ప్రతి దర్శకుడు కూడా మిగతా దర్శకుడు చేసిన సినిమాలను చూస్తారు అని చెప్పుకొచ్చాడు. అలా చూసి ఎంకరేజ్ చేయడం వల్లే నేను మానగరం సినిమా నుంచి ఇక్కడ వరకు ఎదిగాను అని తెలిపాడు. ఇక లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు హాలీవుడ్ లో ఉండే సినీమాటిక్ కల్చర్ ని తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు. లోకేష్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అని అంటే చాలామంది క్యూరియాసిటీతో ఎదురు చూస్తారు.

Related News

Ka Movie: క మూవీ ఏ ఓటీటీలో వస్తుంది.. ఇదుగో ఆన్సర్.. ?

Akkineni Nagarjuna: కొడుకు పెళ్లి.. మరోసారి నాగ్ N కన్వెన్షన్ పై చర్చ.. ?

Animal Park: ‘యానిమల్ పార్క్’ స్టార్ట్ అయ్యేది అప్పుడే.. కీలక అప్డేట్ ఇచ్చిన నిర్మాత

Allu Arvind: పండక్కి సినిమా రిలీజ్ చేస్తామని మేము ఎప్పుడూ చెప్పలేదు

Meenakshi Chaudhary: లక్కీ బ్యూటీని అలా ఎలా చేశారు.. ఆమె కోసమే మట్కా చూసేవాళ్ల పరిస్థితి ఏంటి.. ?

Somy Ali on Sushant Death: సుశాంత్ మరణం పై సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్.. అసలేం జరిగిందంటే..?

Big Stories

×