Lokesh Kanagaraj : కేవలం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే లోకేష్ కనకరాజ్ అనే పేరు ఒక బ్రాండ్ అని చెప్పాలి. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసి “మా నగరం” సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు లోకేష్. ఇదే సినిమా తెలుగులో నగరం పేరుతో రిలీజ్ అయింది. సందీప్ కిషన్ (Sundeep Kishan) రెజీనా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించడం మాత్రమే కాకుండా దర్శకుడుగా కూడా లోకేష్ కి మంచి పేరు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాను లోకేష్ తీసిన విధానం మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. మొదటి సినిమా అయినా కూడా టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ గా ఈ సినిమాని ప్రజెంట్ చేశాడు లోకేష్. ఈ సినిమా తర్వాత చేసిన ఖైదీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక రాత్రిలో జరిగే ఈ కథ మొత్తం ఎంతో ఆసక్తికరంగా నడిపించాడు దర్శకుడు.
కమలహాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా ఒక సంచలనం. దాదాపు కమల్ కెరియర్ అయిపోయింది అనుకునే తరుణంలో విక్రమ్ (Vikram) సినిమా ఇచ్చిన సక్సెస్ మామూలుది కాదు. దాదాపు 400 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసింది. సినిమాటిక్ యూనివర్స్ తెలుగులో పరిచయం చేశాడు లోకేష్. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ కనకరాజు పై ప్రశంసలు కురిపించారు. లోకేష్ టెక్నికల్ గా సినిమాను చాలా బాగా చేస్తారు అంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విక్రం,లియో సినిమాలను ప్రస్తావిస్తూ తెలిపారు. ఇక ప్రస్తుతం లోకేష్ రజనీకాంత్ కూలి అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. లోకేష్ నుంచి చివరగా వచ్చిన సినిమా లియో. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది.
Also Read : Hanu Raghavapudi : ప్రేమ కథలు కాకుండా, లక్కీ భాస్కర్ లా పనికొచ్చే సినిమా ఎప్పుడు చేస్తావు అని అడిగారు.?
ఇక రీసెంట్ గా అమరన్ సినిమాను చూసిన లోకేష్ ను చాలామంది మీడియా వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు. రీసెంట్గా రాజకీయాల్లోకి తలపతి విజయ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొన్ననే మానాడు సభ కూడా జరిగింది. ఈ సభ గురించి లోకేష్ ను రెస్పాన్స్ అడిగినప్పుడు, తలపతి విజయ్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. అయితే లియో 2 ఖచ్చితంగా ఉంటుందా అని ప్రశ్నిస్తే, ఆ విషయం విజయ్ అన్న చెప్పాలి అంటూ సమాధానం ఇచ్చాడు లోకేష్. ఇక విజయ మాత్రం తను చివరి సినిమా చేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి పరిమితం అవ్వాలి అనుకుంటున్నాడు. విజయ్ అలా పరిమితం అవుతాడా లేదంటే తెలుగులో పవన్ కళ్యాణ్ లానే మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడా అనేది వేచి చూడాలి.