Big Stories

RRR : ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్.. ఆ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్..

RRR : ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ వేడుకులకు సమయం దగ్గర పడుతోంది. ఈ వేదికపై ‘RRR’ లోని ‘నాటు నాటు’ సాంగ్ ను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనను జీ5 ఓటీటీ తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. 2022లో జీ5 ఓటీటీలో ఈ మూవీ విడుదలైంది. పది రోజుల్లోనే స్ట్రీమింగ్‌ లో గత రికార్డులను బ్రేక్ చేసింది.

- Advertisement -

RRR మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఇప్పుడు 95వ ఆస్కార్‌ అవార్డులకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నామినేట్ కావడంతో దక్షిణాసియా సినిమారంగం గురించి చర్చించుకునేలా చేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన స్పందన భారతీయ చిత్ర పరిశ్రమకు కొత్తదారిని చూపించింది.

- Advertisement -

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాట గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును కైవసం చేసుకుంది. మార్చి 12న జరిగే ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవ వేదికపై ప్రదర్శించడం ద్వారా సినీ అభిమానులను మరోసారి అలరించనుంది. నాటు నాటు పాటను రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ కలిసి అకాడమీ అవార్డుల వేదికపై పాడతారు.

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ప్రదర్శించే రెండో భారతీయ పాటగా నాటు నాటు రికార్డు సృష్టించబోతోంది. తొలిసారి 2009లో ఏఆర్‌ రెహమాన్‌ పాటను ఆలపించారు. ఈసారి రిహన్న, సోఫియా కార్సన్, స్టెఫానీ హు, డయాన్ వారెన్, డేవిడ్ బ్రైన్, సన్ లక్స్ లాంటి వారితోపాటు రాహుల్‌ సిప్లిగంజ్‌, కాల భైరవ ఈ వేదికపై ప్రదర్శన ఇవ్వనున్నారు. నాటు నాటు పాటను ఎం.ఎం. కీరవాణి స్వరపరిచారు. ‘RRR’ మూవీని తెలుగులో జీ5 గ్లోబల్‌ యాప్‌లో ఇంగ్లిష్‌ సబ్‌టైటిల్స్‌తో వీక్షించే అవకాశం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News