EPAPER

Lavanya tripathi: తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠి..?

Lavanya tripathi: తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠి..?

Lavanya Tripathi.. మెగా కోడలు, హీరో వరుణ్ తేజ్ (Varun Tej) భార్య, ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ( Lavanya tripathi) తాజాగా తల్లి కాబోతోందంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. దసరా పండుగ సందర్భంగా ఈ విషయాన్ని లావణ్య తన కుటుంబ సభ్యులతో తెలియజేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అటు మెగా అభిమానులు, ఇటు సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ.. మెగా కోడలికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం లావణ్య తల్లి కాబోతోంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. ఒకవేళ ఇదే నిజమైతే మెగా ఇంట్లోకి మరో బుల్లి వారసుడు రాబోతున్నారు అంటూ అభిమానులు సంబరాలు చేసుకోవడం ఖాయం అని చెప్పడంలో సందేహం లేదు.


లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ ప్రేమ, పెళ్లి..

లావణ్య – వరుణ్ తేజ్ విషయానికి వస్తే.. మిస్టర్, అంతరిక్షం వంటి చిత్రాలలో వరుణ్ తేజ్ సరసన నటించి మెప్పించింది లావణ్య. ఆ సినిమాల సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నట్లు సమాచారం. ఎన్నో రోజులుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వినిపించినా ఈ విషయంపై ఇద్దరూ కూడా స్పందించలేదు. దీనికి తోడు లావణ్య కూడా ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవు అంటూ తోసి పుచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఎట్టకేలకు 2023 జూన్ 9వ తేదీన హైదరాబాద్లోని నాగబాబు ఇంట్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం జరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మీడియా చెప్పిందే నిజం అంటూ కామెంట్లు చేశారు. ఎట్టకేలకు గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరి వివాహం కోసం ఎదురుచూసిన అభిమానులకు శుభవార్త తెలుపుతూ.. నవంబర్ 1న ఇటలీ సీయోనాలోని బోర్గోశాన్ ఫెలిసీ రిసార్ట్ లో వీరి వివాహం జరిగింది. ఇక ఇప్పుడు తల్లి అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై మెగా కుటుంబం క్లారిటీ ఇస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.


లావణ్య కెరియర్..

లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే.. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించిన ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో పెరిగింది. ఈమె తండ్రి హైకోర్టు న్యాయవాది కాగా తల్లి రిటైర్డ్ టీచర్ .. ఈమెకు ఒక చెల్లెలు, తమ్ముడు కూడా ఉన్నారు. మార్షల్ స్కూల్లో మార్షల్ ఆర్ట్స్ పూర్తి చేసిన ఈమె ముంబైకి వెళ్లి రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో పట్టా కూడా అందుకుంది. చిన్నప్పటి నుంచి గ్లామర్ ప్రపంచంలోకి అడుగు పెట్టాలని ఎన్నో కలలు కన్న ఈమెకు, తండ్రి అడ్డుగా నిలిచారు . అయినా సరే తండ్రి కోరిక మేరకు చదువు పూర్తి చేసి ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టి, టీవీ కార్యక్రమాల ద్వారా తన ఉనికిని చాటుకుంది. 2006లో మిస్ ఉత్తరాఖండ్ కిరీటం కూడా గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ, మొదటిసారి 2012లో వచ్చిన అందాల రాక్షసి సినిమాలో మిధున క్యారెక్టర్ చేసి ఆకట్టుకుంది. ఇక సినిమాలే కాదు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి తర్వాత మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి ఆకట్టుకుంది. అంతేకాదు ఎన్నో అవార్డులు సైతం అందుకుంది లావణ్య త్రిపాఠి . ఇప్పుడు మెగా కోడలిగా బాధ్యతలు చేపట్టి, ప్రస్తుతం ఇంటికే పరిమితమైనట్లు తెలుస్తోంది.

Related News

Chiru – Nag: దసరా సెలబ్రేషన్స్ లో స్టార్ హీరోలు.. పంచకట్టులో ఆకట్టుకున్న చిరు..!

Devara: ‘దేవర’ టికెట్ రేట్లు పెరగడానికి పవన్ కళ్యాణే కారణం.. నాగవంశీ కామెంట్స్

Naga Vamsi: ఆ తప్పే గుంటూరు కారం సినిమాకి మైనస్.. నిర్మాత హాట్ కామెంట్స్..!

Harihara Veeramallu: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్.. త్వరలో ఫస్ట్ సింగిల్..!

Alia Bhatt: ‘జిగ్రా’ కలెక్షన్స్ అంతా ఫేక్, ప్రేక్షకులను ఫూల్ చేస్తున్నారు.. ఆలియా భట్‌పై హీరోయిన్ అటాక్

Aliabhatt : ఆ వింత సమస్యతో ఇబ్బంది పడుతున్న అలియాభట్..?

Big Stories

×