BigTV English

Pushpa 2 : ‘అస‌లు పుష్ప ఎక్క‌డ‌?’..ఆస‌క్తిక‌రంగా అప్‌డేట్‌

Pushpa 2 : ‘అస‌లు పుష్ప ఎక్క‌డ‌?’..ఆస‌క్తిక‌రంగా అప్‌డేట్‌

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం పుష్ప‌. అందులో పార్ట్ 1గా ‘పుష్ప ది రైజ్’ ..2021లో రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘పుష్ప 2 ది రూల్’ సినిమా రూపొందుతోంది. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా లెవ‌ల్లో రూ.300 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో పుష్ప 2 కోసం ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కుల‌కు , ట్రేడ్ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన‌రోజు వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా ఏప్రిల్ 7న పుష్ప 2 గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు. దానికి సంబంధించిన అప్‌డేట్‌ను మేక‌ర్స్ బుధ‌వారం విడుద‌ల చేశారు.


పుష్ప 2 అప్‌డేట్ టీజ‌ర్‌లో తిరుప‌తి జైలు నుంచి పుష్ప బుల్లెట్ గాయాల‌తో త్ప‌పించుకున్నాడ‌ని చెబుతున్నారు. ఓ వ్య‌క్తి బైక్‌వై వేగంగా వెళుతున్నాడు. అస‌లు పుష్ప ఎక్క‌డ అనే ప్ర‌శ్న వ‌స్తుంది. ప్ర‌జ‌లు పోలీసుల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్నారు. అప్‌డేట్ ఈ రేంజ్‌లో ఉంటే ఏప్రిల్ 7 సాయంత్రం 4 .05 నిమిషాల‌కు విడుద‌ల కాబోయే గ్లింప్స్ ఇంకెలా ఉండ‌బోతుంద‌న‌నే క్యూరియాసిటీ అంద‌రిలోనూ నెక్ట్స్ రేంజ్‌కు చేరుకుంది.

శేషాచ‌లం అడ‌వుల్లో దొరికే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ చేసే పుష్ప రాజ్ అనే కూలీ సిండికేట్ కింగ్‌లా ఎలా మారాడ‌నేది చూశాం. ఇప్పుడు త‌ను భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్‌తో ఎలా యుద్ధం చేయ‌బోతున్నాడు..త‌న సామ్రాజ్యాన్ని ఎలా శాసించ‌బోతున్నాడ‌నేది ఆస‌క్తిని పెంచుతోంది. సినిమాపై ఉన్న అంచాల‌ను దృష్టిలో పెట్టుకుని మేక‌ర్స్ పుష్ప 2ను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.


అల్లు అర్జున్‌కి జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోన్న ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ ఫ‌హ‌ద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. అన‌సూయ‌, సునీల్‌, క‌న్న‌డ న‌టుడు ధ‌నంజ‌య్ త‌దిత‌రులు ఇత‌ర ప్ర‌తినాయ‌కులుగా క‌నిపించ‌బోతున్నారు. ముత్తం శెట్టి మీడియా, మైత్రీ మూవీ మేక‌ర్స్ క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

LINK – https://www.youtube.com/watch?v=JG-u9rNLq50

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×