EPAPER

Lal Salaam Review: లాల్ సలాం రివ్యూ.. రజనీకాంత్‌ది ప్రత్యేక పాత్రనా? ఫుల్ లెంత్ పాత్రనా?

Lal Salaam Review: లాల్ సలాం రివ్యూ.. రజనీకాంత్‌ది ప్రత్యేక పాత్రనా? ఫుల్ లెంత్ పాత్రనా?

Rajinikanth’s Lal Salaam Review and Rating: సినిమా: లాల్ సలాం (తమిళ డబ్)


నటీనటులు: రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, సెంథిల్, జీవిత రాజశేఖర్ తదితరులు

కథ, ఛాయాగ్రహణం: విష్ణు రంగస్వామి


రచన: విష్ణు రంగస్వామి, ఐశ్వర్య రజనీకాంత్

సంగీతం: ఏఆర్ రెహమాన్

నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్

దర్శకత్వం: ఐశ్వర్య రజనీకాంత్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గతేడాది నటించిన ‘జైలర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఎన్నో డిజాస్టర్ల తర్వాత రజనీకాంత్‌కు ఈ మూవీ మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఈ సినిమాతో ఫుల్ హ్యాపీలో ఉన్న రజనీకాంత్ అదే సమయంలో ‘లాల్ సలాం’ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో రజనీకాంత్ కీలక పాత్రలో నటించారని మూవీయూనిట్ ప్రచారంలో పేర్కొంది. ప్రేక్షకాభిమానుల నుంచి మంచి అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం..

కథ:

1993లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కసుమూరు అనే ఒక ప్రాంతంలో హిందువులు, ముస్లింలు ఎంతో ఐకమత్యం, స్నేహ భావాజలంతో కలిసి మెలిసి అన్నదమ్ముల్లా ఉండేవారు. కానీ మొయిద్దీన్ (రజనీకాంత్) కొడుకు శంషుద్దీన్‌ (విక్రాంత్)ను గురు (విష్ణు విశాల్) కొట్టడంతో వివాదం మొదలవుతుంది. దీంతో రెండు మతాల వారి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ఈ కారణంగా గురు ఇంటిని తగలబెట్టేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? గురు, శంషుద్దీన్‌ల మధ్య గొడవకు కారణం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

సినిమా చాలా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. స్నేహభావంతో కలిసి మెలిసి ఉంటున్న రెండు మతాల మధ్య కొందరు రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం చిచ్చు పెడతారు. చివరకు రెండు మతాల వారూ కలిసిపోతారు. మొత్తంగా సినిమా కథ ఇదే.

ఇందులో రజనీకాంత్ పోషించిన మొయిద్దీన్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. రాజకీయ నాయకుల ఎత్తులు, ఊరి ప్రజల నుంచి విష్ణు విశాల్ తప్పించుకోవడానికి ప్రయత్నించడం వంటివి చూసిన తర్వాత సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతుంది. ఏం జరుగుతుంది.. ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ మొదలవుతుంది. అయితే ఆ ఆసక్తి చచ్చిపోవడానికి ఎంతో సమయం పట్టదు.

ఎందుకంటే స్టోరీ అక్కడ నుంచి అనుకున్నట్టుగా ఏమాత్రమూ ముందుకు సాగదు. అలాగే హీరోయిన్‌ లవ్ ట్రాక్, సాంగ్‌కు కథకు కూడా సంబంధమే ఉండదు. డైలాగ్స్ కూడా అంత అట్రాక్టివ్‌గా లేవు. ఫస్ట్ పార్ట్‌లో జాతర కోసం వేరే గ్రామం నుంచి తెచ్చుకున్న రథాన్ని (తేరు) జాతర మధ్యలోనే తీసుకువెళ్లిపోవడంతో ఇంటర్వల్ అవుతుంది.

ఇక సెకండాఫ్ కూడా ఎక్కువగా రథం చుట్టూనే తిరుగుతుంది. అయితే విష్ణువిశాల్ తను ప్రయోజకుడ్ని అని నిరూపించుకోవడానికి ఊరికి రథం తేవాలని అనుకుంటాడు. అన్నిటికంటే దారుణం ఏంటంటే. గొడవ తర్వాత విష్ణు విశాల్ ఊరిలోకి వచ్చేటప్పుడు జీవిత (విష్ణు విశాల్ తల్లిపాత్ర) బయటకు వచ్చి ‘నువ్వు చచ్చిపోతే నేను సంతోషిస్తాను రా’ అంటూ ఎమోషనల్ డైలాగ్ చెప్తుంది.

అయితే కొన్నాళ్లకు విష్ణు విశాల్ మంచి ప్రయోజకుడై డబ్బులు సంపాదించి రథం రెడీ చేస్తున్నప్పుడు ఆమె సంతోషిస్తున్నట్లు చూపిస్తారు. అంటే తల్లి ప్రేమను, డబ్బుతో ముడి పెట్టడం ఏంటో ఎవ్వరికీ అర్థం కాదు. అలాగే క్లైమాక్స్‌లో కూడా ఏం జరుగుతుందో ముందే ఊహించేవచ్చు.

సినిమాలో రజనీకాంత్ పాత్ర నిడివి కాస్త తక్కువ. కానీ ఇందులో విక్రాంత్ కంటే రజనీకాంత్‌కే ఎక్కువ స్క్రీన్ టైం ఉంది అని అనిపిస్తుంది. అంతేకాకుండా మూవీ చూసినపుడు రజనీది ప్రధాన పాత్రలా అనిపిస్తుంది.

అలాగే హీరోయిన్ పాత్ర కూడా ఇందులో సాధారణమే. ఆమె పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. కపిల్ దేవ్ క్యామియేకు కూడా పెద్దగా ప్రాధాన్యత లేదు. ఆయన స్థానంలో ఎలాంటి ఆర్టిస్తును తీసుకున్నా ఇంపాక్ట్‌లో తేడా ఉండేది కాదు.

అలాగే ఏఆర్ రెహమానం మ్యూజిక్ సినిమాకు మైనస్. ఒక్క పాట కూడా ఆకట్టుకోలేదు. అంతేకాకుండా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా ఏమి లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నటీనటుల ఎంపికలో ఐశ్వర్య రజనీకాంత్ పర్వాలేదనిపించుకుంది. మొత్తంగా చెప్పాలంటే రజనీకాంత్ అభిమానులు కూడా ‘లాల్ సలాం’ను చూడటం కష్టమే.

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×