EPAPER

Laatti Review : ‘లాఠీ’ మూవీ రివ్యూ

Laatti Review : ‘లాఠీ’ మూవీ రివ్యూ

Laatti Review : న‌టీన‌టులు: విశాల్, సునైనా, ప్రభు, మునిష్కాంత్, తలైవాసల్ విజయ్, మిషా ఘోషల్ త‌దిత‌రులు
సంగీతం: యువన్ శంకర్ రాజా
ర‌చ‌న‌: పొన్ పార్థిబన్
సినిమాటోగ్రఫీ: బాలసుబ్రహ్మణ్యం, బాలకృష్ణ తోట
ఫైట్స్: పీట‌ర్ హెయిన్‌
నిర్మాతలు: ర‌మ‌ణ, నంద‌
దర్శకుడు: ఎ వినోద్ కుమార్
బ్యానర్: రానా ప్రొడక్షన్స్
విడుద‌ల‌: 22-12-2022


‘పందెంకోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న విశాల్.. విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తుంటాడు. విశాల్ సినిమా అంటే తమిళంలోనే కాదు.. తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంటుంది. డిటెక్టివ్, అభిమన్యుడు సినిమాలతో మెప్పించిన విశాల్.. తాజాగా ‘లాఠీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎప్పుడూ పవర్‌ఫుల్ రోల్స్ చేసే విశాల్ ఈసారి ఓ సాధారణ కానిస్టేబుల్ పాత్రతో వచ్చాడు. మరి ఈ ‘లాఠీ’ సినిమాతో విశాల్ ఏ మేరకు మెప్పించాడో తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం..

కథ: మురళీ కృష్ణ (విశాల్) ఓ సాధారణ కానిస్టేబుల్. భార్య కవిత(సునైనా), కుమారుడు రాజుతో కలిసి జీవిస్తుంటాడు. ముక్కు సూటిగా వ్యవహరిస్తూ లాఠీ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న మురళీకృష్ణ ఓ హత్యాచారయత్నం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని సస్పెన్షన్‌కు గురవుతాడు. మళ్లీ ఉద్యోగంలో తిరిగి జాయిన్ అవ్వడానికి ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతాడు. ఈ క్రమంలో డీఐజీ కమల్ (ప్రభు) సాయం చేస్తాడు.


డీఐజీ కూతురిని ఆ ఊళ్లోని పేరు మోసిన రౌడీ సూర కొడుకు వీర ఘోరంగా అవమానిస్తాడు. పోలీసు అయి ఉండి కూడా వీర మీద యాక్షన్ తీసుకోలేకపోతోన్నాని డీఐజీ బాధపడుతుంటాడు. అయితే మురళీ చేత వీరను కొట్టిస్తాడు డీఐజీ. ఆ తరువాత వీర తన ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు? ఆ హత్యాచార కేసును మురళీ పరిష్కరించాడా? వీర నుంచి తనని, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు మురళీ కృష్ణ ఏం చేశాడు? చివరకు ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ: పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పై అధికారులకు సమస్య వస్తే కింది స్థాయి సిబ్బంది అయిన కానిస్టేబుల్ నుంచి డిపార్ట్‌మెంట్ మొత్తం ముందుంటుంది. అయితే కింది స్థాయి అధికారి అయిన కానిస్టేబుల్‌కు సమస్య వస్తే ఎవరూ రారు. అతడిని అతడే కాపాడుకోవాలి అనే పాయింట్ మీద దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగే ఓ పోలీస్ కానిస్టేబుల్ క‌థ ఇది. కానిస్టేబుల్‌పై ప్ర‌తీకారం తీర్చుకోవ‌డం కోసం ఓ రౌడీ ముఠా ప్రయత్నం చేయడం, ఆ ముఠాను ఓ సాధార‌ణ పోలీస్ కానిస్టేబుల్ ఒక్కడే ఎదుర్కోవడం ఈ చిత్రంలో చూపించారు. ఇందులో విశాల్ మార్క్ అంశాలున్నా, సుదీర్ఘంగా సాగే యాక్షన్ సన్నివేశాలు, డ్రమటిక్‌గా అనిపించే కొన్ని స‌న్నివేశాలు నిరాసక్తిని కలిగిస్తాయి.

విశాల్ యాక్టింగ్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్‌‌‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాల్లో మధ్య మధ్యలో కొడుకు సెంటిమెంట్‌తో వచ్చే సీన్స్‌లో విశాల్ నటన కమల్ హాసన్‌ను గుర్తు చేస్తుంది. ఇక స్టోరీ, స్క్రీన్‌ప్లే రెగ్యులర్ ఫార్మాట్‌లోనే సాగ‌డం కూడా సినిమాకు మైనస్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా స‌హ‌జంగా, ఓ కానిస్టేబుల్ జీవితాన్ని క్లారిటీగా చూసిన అనుభూతి క‌లుగుతుంది. సెకెండాఫ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భ‌వ‌నంలో సాగే యాక్షన్ సీన్స్ .. దాదాపు 45 నిమిషాల‌పాటు ఉండడం ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తుంది. కొన్ని స‌న్నివేశాల్ని డిజైన్ చేసిన విధానం బాగున్నా, కొన్ని మాత్రం నాట‌కీయంగా అనిపిస్తాయి.

నటీనటుల విశ్లేషణ: సాధారణ కానిస్టేబుల్ మురళీ కృష్ణ పాత్రలో విశాల్ చక్కగా నటించాడు. ఇందులో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో విశాల్ దుమ్ములేపేశాడు. విశాల్‌ను ఇప్పటి వరకు యాక్షన్ హీరోగా చూసిన ప్రేక్షకులకు సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో విశాల్ నటన కొత్త ఫీల్‌ను కలిగిస్తుంది. ఇక ఇందులో మురళీ కృష్ణ భార్యగా కవిత పాత్రలో హీరోయిన్ సునైన నర్సుతో పాటు గృహిణిగానూ ఆకట్టుకుంది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా కనిపించినంతసేపూ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. డీఐజీ కమల్‌గా ప్రభు పాత్ర పర్వాలేదు. వీర, సూరలు కనిపించిన విలన్లు కాస్త కామెడీగా అనిపిస్తారు. అప్పుడప్పుడు క్రూరంగా కనిపిస్తారు. మిగిలిన పాత్రలు పర్వాలేదనిపిస్తాయి.

సాంకేతిక విశ్లేషణ: సాంకేతికంగా కూడా సినిమా మరింత మెరుగ్గా ఉంటే బాగుండేది. యువన్ శంకర్ రాజా అందించిన పాట‌లు పర్వాలేదు. కానీ, నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలకు సూట్ కాలేదనిపిస్తుంది. బాలసుబ్రమణ్యం, బాలకృష్ణ తోట సినిమాటోగ్రఫీ బాగుంది. పీటర్ హెయిన్స్‌ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి కీల‌కం. దర్శకుడు ఎ వినోద్ కుమార్ తాను ఎంచుకున్న కథకు కాస్త కొత్తదనాన్ని జోడించి ఉంటే బాగుండేది. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ వరకు బాగున్నా.. సెకెండాఫ్ తర్వాత క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా దర్శకుడు చేసిన క‌స‌ర‌త్తులు చాల‌లేదు. వాటిలో కొత్త‌ద‌నం కూడా క‌నిపించ‌దు.

Tags

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×