BigTV English

RRR : దేశం గర్విస్తోంది.. RRR బృందానికి ప్రశంసల వెల్లువ..

RRR : దేశం గర్విస్తోంది.. RRR బృందానికి ప్రశంసల వెల్లువ..

RRR : ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డు దక్కడంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టిట్విర్ వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదొక చారిత్రక విజయమని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై దేశం గర్విస్తోందన్నారు. సంగీత దర్శకుడు కీరవాణి , చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ‘‘ఇదొక అద్భుతమైన, చారిత్రక విజయం. ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటునాటు’ పాటకు కీరవాణి గోల్డెన్‌గ్లోబ్‌ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు నా అభినందనలు. దేశం మిమ్మిల్ని చూసి గర్విస్తోంది. సంగీతం, డ్యాన్స్.. ఈ రెండింటి సెలబ్రేషనే ‘నాటునాటు’ పాట. మన దేశమే కాదు ప్రపంచం మొత్తం ఈరోజు మీతో కలిసి డ్యాన్స్‌ చేస్తోంది. చరణ్, తారక్‌ తోపాటు అద్భుతమైన సాహిత్యం అందించిన చంద్రబోస్‌, ఉర్రూతలూగించేలా ఆలపించిన రాహుల్‌, కాలభైరవ, కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌కు కంగ్రాట్స్‌’’ అని చిరంజీవి పేర్కొన్నారు.


కంగ్రాట్స్‌ సర్‌ జీ అని ఎన్టీఆర్ అన్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకూ ఎన్నో పాటలకు డ్యాన్స్‌ చేశానని కానీ ‘నాటు నాటు’ ఎప్పటికీ నా హృదయానికి చేరువగానే ఉంటుందని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

నాటు నాటు పాట పాడిన రాహుల్‌ సిప్లిగంజ్ కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నాడు. ‘నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు రావాడం చాలా హ్యపీగా ఉందన్నాడు. అంతర్జాతీయ స్టేజ్‌పై కీరవాణి తన పేరు చెప్పడం గర్వంగా అనిపిస్తుందన్నాడు. తనకు పాడే అవకాశం కల్పించిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్, కీరవాణి , రాజమౌళి‌ ధన్యవాదాలు తెలిపాడు.


ఇదొక అద్భుతమైన మార్పు అని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అన్నారు. కీరవాణి, రాజమౌళి, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. మోహన్ బాబు, నాగార్జున,రవితేజ, అనుష్క , రాంగోపాల్ వర్మ, క్రిష్, దేవిశ్రీప్రసాద్ ఇలా చాలమందిపై సినీప్రముఖులు RRR టీమ్ కు కంగ్రాట్స్ చెప్పారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×