EPAPER

Rajinikanth: రజినీకాంత్ జోక్యం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Rajinikanth: రజినీకాంత్ జోక్యం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటేనే ప్రేక్షకుల్లో ఒక హడావిడి ఉంటుంది. ఆయన సినిమాకు ప్రమోషన్స్ చేసినా చేయకపోయినా ఎలా అయినా ఫ్యాన్స్‌లో అంచనాలు మాత్రం తగ్గవు. అలాంటి ఒక దర్శకుడితో కలిసి రజినీకాంత్ రెండు హిట్ సినిమాలు చేశారు. ఇక వారి కాంబినేషన్‌లో వచ్చే మూడో సినిమా కచ్చితంగా హ్యాట్రిక్ అని ఆడియన్స్‌లో గట్టి నమ్మకం ఉండడం కామన్ కదా.. కానీ అలా జరగలేదు.కేఎస్ రవికుమార్, రజినీకాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూడో చిత్రం ‘లింగ’.. డిశాస్టర్ అయ్యింది. అయితే ఆ మూవీ అలా అవ్వడానికి కారణం రజినీనే అంటూ షాకింగ్ ఆరోపణలు చేశారు దర్శకుడు రవికుమార్.


భారీగా అంచనాలు

కేఎస్ రవికుమార్, రజినీకాంత్ కాంబినేషన్‌లో ‘ముత్తు’, ‘నరసింహ’లాంటి రెండు బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చాయి. దీంతో వీరిద్దరూ మళ్లీ కలిసి ఎప్పుడెప్పుడు వర్క్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు చెక్ పెడుతూ వీరి కాంబినేషన్‌లో ‘లింగ’ మూవీని అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లు అనగానే ఇది ఒక మాస్ కమర్షియల్ మూవీ అవుతుందని ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ విడుదలయిన మొదటి రోజే నెగిటివ్ టాక్ అందుకుంది ‘లింగ’. దీంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘లింగ’.. కనీసం 30 శాతం వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. ఈ మూవీ డిశాస్టర్‌పై కేఎస్ రవికుమార్ తాజాగా స్పందించారు.


Also Read: ‘తంగలాన్’కు భారీ షాక్.. ఈ సినిమా ఓటీటీలో చూడడం కష్టమే!

ట్విస్ట్ తీసేశారు

‘లింగ’ సినిమా ఎడిటింగ్ విషయంలో రజినీకాంత్ అనసవరంగా జోక్యం చేసుకున్నారంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టారు కేఎస్ రవికుమార్. అంతే కాకుండా అసలు సినిమాకు గ్రాఫిక్స్ చేయడానికి సరిపడా టైమ్ కూడా రజినీ ఇవ్వలేదట. ‘‘లింగ సెకండ్ హాఫ్‌ను పూర్తిగా మార్చేశారు. అనుష్కతో ఒక పాటను తీసేశారు. క్లైమాక్స్‌లో వచ్చే కీలకమైన ట్విస్ట్‌ను కూడా తీసేశారు’’ అని గుర్తుచేసుకున్నారు రవికుమార్. వీటితో పాటు ‘లింగ’ సినిమాలో ఆర్టిఫిషియల్ బెలూన్‌తో ఉండే సీన్‌ను అప్పట్లో ప్రేక్షకులు తీవ్రంగా విమర్శించారు. అయితే ఆ సీన్ పెట్టకుండా ఉండాల్సింది అంటూ రవికుమార్ కూడా ఫీల్ అయ్యారు.

మాటిచ్చిన రజినీకాంత్

2014లో రజినీకాంత్ పుట్టినరోజుకు.. అంటే డిసెంబర్ 12న ఈ ‘లింగ’ను విడుదల చేయాలని నిర్మాతలు.. తనను ఒత్తిడికి గురిచేశారంటూ బయటపెట్టారు కేఎస్ రవికుమార్. అలా కంగారులో సినిమాను పూర్తి చేయాల్సి రావడంతో కూడా ఔట్‌పుట్ సరిగా రాలేదని ఆయన వాపోయారు. అయితే రజినీకాంత్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. ఆయన ఫిల్మ్ మేకింగ్‌లో జోక్యం చేసుకుంటారని ఇంతకు ముందు కూడా పలువురు డైరెక్టర్లు ఆరోపించారు. కానీ ఇప్పుడు ఆయన ప్రవర్తన చూస్తుంటే లోకేశ్ కనకరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ లాంటి యంగ్ డైరెక్టర్లను నమ్మి ముందుకెళ్తున్నట్టు అనిపిస్తోంది. ‘లింగ’ విషయానికొస్తే.. ఈ సినిమా విడుదలయ్యి డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలు రావడంతో వారికి ఆర్థిక సాయం అందింస్తానని రజినీ మాటిచ్చారు.

Related News

IIFA awards 2024: ఉత్తమ నటుడిగా యంగ్ హీరో.. మరో ఫీట్ అందుకోనున్నారా..?

Prakash Raj: చీప్ రాజకీయాలు.. తిరుపతి లడ్డూ వివాదాన్ని వదలని ప్రకాష్ రాజ్

Sudheer Babu: అప్పుడు మంచు మనోజ్, ఇప్పుడు వరుణ్ తేజ్.. యంగ్ హీరోలను టార్గెట్ చేస్తున్న సుధీర్ బాబు

Rajendra Prasad : మా అమ్మ మళ్లీ చనిపోయింది, పంపించేసి వస్తా.. రమాప్రభతో రాజేంద్ర ప్రసాద్ – కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

Singham Again Trailer: పోలీస్ రామాయణం.. రావణుడు మాత్రం హైలైట్ అంతే..

Renu Desai : వాళ్ళు ఖచ్చితంగా నరకానికే వెళ్తారు… అలాంటి పనులు చేసే వాళ్ళపై రేణు దేశాయ్ ఫైర్

×