EPAPER
Kirrak Couples Episode 1

Devara 2: తారక్ ఫ్యాన్స్‌కి దీనికంటే గుడ్ న్యూస్ ఉండదు.. పార్ట్ 2కి కొరటాల ప్లాన్ ఇదే.!

Devara 2: తారక్ ఫ్యాన్స్‌కి దీనికంటే గుడ్ న్యూస్ ఉండదు.. పార్ట్ 2కి కొరటాల ప్లాన్ ఇదే.!

Devara 2: ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దేవర’ మూవీ పాజిటివ్ టాక్‌తో, రికార్డ్ స్థాయి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. మొదటిరోజే కలెక్షన్స్ ఈ రేంజ్‌లో ఉండే రోజులు గడుస్తున్నాకొద్దీ ఈ మూవీ కలెక్షన్స్ ఇంకా ఏ రేంజ్‌లో ఉంటాయో అని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే సినిమా అంతా బాగుంది కానీ అసలు పార్ట్ 2కు స్కోప్ లేదు కదా అని చాలామంది ప్రేక్షకుల అభిప్రాయం. కానీ మరికొందరు ప్రేక్షకులు మాత్రం పార్ట్ 1 ఈ రేంజ్‌లో ఉంటే పార్ట్ 2 ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందో అని అంచనాలు పెంచేసుకుంటున్నారు. అయితే ‘దేవర 2’ కోసం కొరటాల శివ భారీ ప్లానింగ్‌తో ఉన్నట్టు అర్థమవుతోంది.


ఒక్క పార్ట్‌లో చెప్పలేం

అసలైతే 2024 సమ్మర్‌లోనే ‘దేవర’ మూవీ విడుదల కావాల్సింది. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో పాటు పలు కారణాల వల్ల అప్పుడు సినిమా పోస్ట్‌పోన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ‘దేవర’ పోస్ట్‌పోన్ అవుతుంది అనే విషయం చెప్పడానికి దర్శకుడు కొరటాల శివ స్వయంగా ఒక వీడియో విడుదల చేశారు. అందులో ‘దేవర’ షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తి అవ్వకముందే 5 గంటల ఫుటేజ్ వచ్చిందని బయటపెట్టారు. దీంతో ఈ మొత్తం కథను ఒక పార్ట్‌లో చెప్పడం కష్టం కాబట్టే ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంటుందని ప్రకటించారు. ‘దేవర’ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే వార్త అప్పట్లో ఫ్యాన్స్‌ను హ్యాపీ చేసింది.


Also Read: ‘కల్కి’ రికార్డ్ బ్రేక్.. ప్రభాస్ కంటే బెస్ట్ హీరో అని చెప్పడానికి ఈ లెక్క చాలదా.?

కొంచమే మిగిలింది

ఇక కొరటాల శివ చెప్పినదాని ప్రకారం ‘దేవర 2’ షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయ్యింది. అందులో కొంత భాగాన్ని ఎడిట్ చేసి పార్ట్ 1గా విడుదల చేశారు. పార్ట్ 2 కోసం మిగిలిన షూటింగ్ కూడా పూర్తిచేస్తే.. దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎక్కువగా సమయం పట్టదు. ‘దేవర 2’ కోసం ఎన్‌టీఆర్ కాల్ షీట్స్‌ను కాస్త అడ్జస్ట్ చేసినా కూడా ఈ సినిమా వచ్చే రెండేళ్లలో కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని ఫ్యాన్స్ అంచనాలు మొదలుపెట్టారు. కానీ పార్ట్ 2కు అసలు స్కోప్ లేదు అనే ఆలోచన చాలామంది ప్రేక్షకుల్లో బలంగా ఉండిపోయింది. వారి అంచనాలను పూర్తిగా మార్చేసే కథతో కొరటాల సిద్ధంగా ఉన్నాడా లేదా చూడాలి.

కొన్నిరోజులు చాలు

ప్రస్తుతం ఎన్‌టీఆర్ చేతిలో ‘వార్ 2’తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కూడా ఉంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌లో కొంతకాలం పాల్గొన్నాడు తారక్. మిగిలిన కాస్త షూటింగ్ కూడా పూర్తి చేసేస్తే ‘వార్ 2’ పట్ల తన బాధ్యత తీరిపోతుంది. ఆ తర్వాత వెంటనే ప్రశాంత్ నీల్‌తో సినిమా ప్రారంభిస్తాడు. ఈ మూవీ షూటింగ్ కూడా త్వరగా పూర్తి చేయగలిగితే ‘దేవర 2’కు కొన్నిరోజులు సమయం కేటాయిస్తే చాలు.. ఆ సినిమా కూడా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతుంది. మొత్తానికి ‘దేవర’కు ఫిదా అయిన ప్రేక్షకులు.. ఎన్‌టీఆర్‌ను మరోసారి ఆ పాత్రలో చూడడానికి ఎక్కువ సమయం పట్టదని అంచనా వేస్తున్నారు.

Related News

Puri Jagannadh: ఇంటికొచ్చిన ఫ్యాన్స్ తో ముంబాయి నుంచి వీడియో కాల్ మాట్లాడిన పూరి జగన్నాథ్

Game Changer: బాబోయ్ రామ్ చరణ్ శంకర్ సాంగ్ ఇలా ఉంది ఏంటి ?

Nandamuri Balakrishna: నందమూరి వారసులు వారే.. తేల్చి చెప్పిన బాలయ్య

Balakrishna: అందరికీ లిమిట్స్ ఉంటాయి.. ఐఫా వేడుకల్లో మీడియాపై బాలకృష్ణ ఫైర్

Ajith : సినిమాలకు అజిత్ గుడ్ బై..? ఆ ఒక్కటే కారణమా?

Devara: దేవర.. ఆ సెంటిమెంట్ కలిసొస్తే.. రికార్డులు బ్రేకే..?

Big Stories

×