EPAPER
Kirrak Couples Episode 1

Koratala Siva: అసలు ఏమి స్కోప్ ఉందని “దేవర” పార్ట్ 2 అనౌన్స్ చేశారు

Koratala Siva: అసలు ఏమి స్కోప్ ఉందని “దేవర” పార్ట్ 2 అనౌన్స్ చేశారు

Koratala Siva: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలలో స్పెషల్ షోస్ తో మొదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా బాగా నచ్చుతుందని చెప్పాలి. ఎన్టీఆర్ లోని మాస్ కమర్షియల్ యాంగిల్ బాగానే వాడుకున్నాడు కొరటాల శివ. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ ఒక విజువల్ ట్రీట్ లో అనిపిస్తాయి. అన్నింటిని మించి అనిరుద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అయితే ఈ సినిమా ఊహించిన స్థాయిలో మాత్రం లేదు అని కొంతమంది అభిప్రాయం.


కొరటాల శివ దర్శకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిర్చి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన శివ, మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఆచార్య సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. మొదటిసారి కొరటాల శివకి ఒక డిజాస్టర్ సినిమా పడింది. ఆ ఫెయిల్యూర్ తో శివ డీలా పడిపోకుండా ఒక పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశాడు కొరటాల.

బాహుబలిని మించి బాహుబలి 2


ఏ ముహూర్తాన ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సినిమాను తెరకెక్కించాడో కానీ అప్పటినుంచి మొదలైన ఈ సీక్వెల్ ట్రెండ్ ఇప్పటికే నడుస్తూనే ఉంది. వాస్తవానికి బాహుబలి సినిమాకి సంబంధించి సీక్వెల్ అనేది అద్భుతంగా వర్కౌట్ అయింది. ఎస్.ఎస్ రాజమౌళి కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అని క్యూరియాసిటీని ఆడియన్స్ లో పెంచాడు. ఇక బాహుబలిని మించి బాహుబలి 2 సినిమా కూడా వర్కౌట్ అయింది. ఇక దేవర సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే బాహుబలి సినిమా ఛాయలు కూడా కొంత మేరకు కనిపిస్తాయి. అయితే బాహుబలి సినిమా క్రియేట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమా క్రియేట్ చేయలేకపోయింది. చాలామంది పార్ట్ 2 కి స్కోప్ లేకుండా ఎందుకు సీక్వెల్ అనౌన్స్ చేసారు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

వాస్తవానికి కొరటాల శివ సినిమాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఇదివరకే ప్రేక్షకులు చూసారు. ఒక సినిమా ఎక్కడైనా స్లో అవుతుంది అనుకున్న తరుణంలో ఆడియన్స్ కి హై తెప్పించే మూమెంట్ ఒకటి తన సినిమాల్లో పెడుతూ ఉంటాడు. ఇంతకుముందు సినిమాల్లో అదే అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి కానీ ఈ సినిమాలో ఆ స్థాయిలో ఉండే సీన్స్ ఇంకేమీ లేవు. ఇకపోతే ఈ సినిమాని ఒకే కథగా ఇంకా ఆసక్తికరంగా చేయగలిగే సామర్థ్యం కొరటాల శివకి ఉంది. కానీ ఎందుకు ఈ సినిమాకి పార్ట్ 2 అనౌన్స్ చేశారు ఎవరికి అర్థం కాని విషయం. పాన్ ఇండియా మోజులో పడి లేనిపోని ప్రయోగాలు చేస్తున్నారా.? అని కూడా కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Kirak RP : ఆర్పీ ఫ్యామిలీపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు…

Devara: నిలబడింది తారక్ , కానీ నిలబెట్టింది అనిరుధ్

Devara 2 : దేవర పార్ట్ 2 తెరకెక్కితే ఇవి తెలియాలి

Rajamouli Sentiment : ఇంతకీ రాజమౌళి హీరో సెంటిమెంట్ బ్రేక్ అయిందా.?

Prithviraj : ఆ సినిమాకు ముందు నాకు అవకాశాలు లేవు, ప్రస్తుతం 23 సినిమాలు చేస్తున్నాను

Amaran: మేజర్ భార్యగా సాయి పల్లవి.. ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్..!

Big Stories

×