EPAPER

Chiranjeevi : పక్కొడి పనిలో వేలు పెడుతారు… చాలా కాన్ఫిడెంట్‌గా చిరుకి కౌంటర్

Chiranjeevi : పక్కొడి పనిలో వేలు పెడుతారు… చాలా కాన్ఫిడెంట్‌గా చిరుకి కౌంటర్

Chiranjeevi : రెండేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి చేసిన ఓ మూవీ వచ్చింది. అదే ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో పెద్ద డిజాస్టర్ అయింది. ఎంత పెద్ద డిజాస్టర్ అంటే, మెగాస్టార్ మొత్తం కెరీర్ లోనే ఇదే అతి పెద్ద డిజాస్టర్. ఇది మెగా ఫ్యాన్స్ ను చాలా ఇబ్బంది పెట్టింది. మొదటి సారి మెగాస్టార్ – గ్లోబల్ స్టార్ కలిసి నటించడం వల్ల ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో అంచనాలు ఉండేవి. కానీ, ఈ అంచనాలు అన్నీ బుడిదలో పోసిన పన్నీరులా అయిపోయాయి. ఫ్యాన్స్ కు ఆవేశం, కోపం అంతా ఈ డిజాస్టర్ ని తెరకెక్కించిన డైరెక్టర్ కొరటాల శివ పై చూపించారు మెగా ఫ్యాన్స్. ఓ మంచి కాంబినేషన్ ను చెడగొట్టారు అంటూ ఫైర్ అయ్యారు.


అయితే, సినిమా డిజాస్టర్ అవ్వడానికి కారణం.. మెగా స్టార్ చిరంజీవే అని ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. మంచి కథను మార్పులు చేసి, డిజాస్టర్ కంటెంట్ వచ్చేలా చేసింది చిరంజీవినే అంటూ నాన్ మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు. రామ్ చరణ్ పాత్ర గెస్ట్ రోల్ గా ఉండాల్సింది. కానీ, దాన్ని ఫుల్ లెన్త్ రోల్ చేయడానికి కారణం చిరంజీవినే అని, అలాగే కథలో కూడా చిరు వేలు పెట్టి చాలా మార్పులు చేశాడని అప్పట్లో విమర్శలు వచ్చాయి. దీని వల్ల డైరెక్టర్ కొరటాల శివకు కెరీర్ లోనే ఫస్ట్ డిజాస్టర్ పడటమే కాదు, ఆయన పరువు కూడా ఇండస్ట్రీలో పోయిందని చెప్పొచ్చు.

అయితే తాజాగా దీనిపై కొరటాల ఇన్ డైరెక్ట్ గా రెస్పాండ్ అయ్యాడు. దేవర మూవీ ప్రమోషన్స్ లో భాగంగా, యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ కలిసి జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివను ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో కొరటాల శివ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరి పని వాళ్లు చేస్తే సరిపోతుందని, అలా కాకుండా,  పక్కొడి పనిలో వేలు పెడితే ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇది నార్మల్ గానే చెప్పినా… ఆచార్య టైంలో జరిగింది గుర్తు చేసుకునే అన్నాడని అనిపిస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో చిరంజీవికి కొరటాల కౌంటర్ వేశాడు అంటూ మీమ్స్ స్టార్ట్ అయ్యాయి.


అయితే, ఆచార్య మూవీ డిజాస్టర్ అయిన నాటి నుంచి ఎప్పుడూ రెస్పాండ్ అవ్వలేదు. ఆ టైంలో కొరటాల భారీగా నష్టపోయాడాని, అందువల్ల తన పొలాలు కూడా అమ్ముకున్నాడు అంటూ కూడా వార్తలు వచ్చాయి. అలాంటి పరిస్థితిలో కూడా కొరటాల స్పందించలేదు. కానీ, ఇప్పుడు దేవర ప్రమోషన్స్ లో మాట్లాడటంతో, దేవర బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని, అందుకే ఆయన చిరు కౌంటర్ ఇచ్చేలా మాట్లాడుతున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

కాగా, రచయితగా కెరియర్ మొదలుపెట్టిన కొరటాల శివ మిర్చి సినిమాతో దర్శకుడుగా మారాడు. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రభాస్ కెరియర్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మాస్ కమర్షియల్ దర్శకుడు దొరికాడు అంటూ ప్రశంసలు అందుకున్నాడు శివ. ఆ తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో శ్రీమంతుడు అనే సినిమా చేసి 100 కోట్ల మార్కెట్లోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత చేసిన జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. కొరటాల శివ కమర్షియల్ గా సినిమాలను తలకెక్కించడం మాత్రమే కాకుండా తనలో సొసైటీకి ఉపయోగపడే సందేశాలను కూడా చెబుతూ ఉంటాడు.

Related News

Sekhar Bhashaa : జానీ మాస్టర్ కేసు పై సంచలన నిజాలను బయట పెట్టిన శేఖర్ భాషా..?

Prakash Raj: తిరుపతి లడ్డూ వివాదం.. పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

Tripti dimri: ఒకే గదిలో 50 మందితో.. భరించలేకపోయా – నేషనల్ క్రష్..!

Jani Master : జానీ మాస్టర్ దొరికిన హోటల్ ఎంత గ్రాండ్ గా ఉందొ చూసారా.?

Mahesh Babu : మహేష్ బాబు సినిమాలో ఎన్టీఆర్.. ఇదేం ట్విస్ట్ మామా.. నిజమైతే థియేటర్లు చిరిగిపోవాల్సిందే..

Chiranjeevi: ఏఎన్నార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం.. చిరు పోస్ట్ వైరల్

Srikanth Odela: దేవిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు అంటే ఈసారి ఏం ప్లాన్ చేసాడో

Big Stories

×