EPAPER
Kirrak Couples Episode 1

Konda Surekha Comments On Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలతో ఇండస్ట్రీ అంతా ఇప్పుడు ఏకమైందా.?

Konda Surekha Comments On Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలతో ఇండస్ట్రీ అంతా ఇప్పుడు ఏకమైందా.?

Konda Surekha Comments On Samantha: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంచలంచెలుగా ముందుకు వెళుతున్న తరుణంలో ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాల కోసం నేడు ఆడియోన్స్ ఎదురుచూసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉండేవి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని డిబేట్లు, పెద్ద పెద్ద కటౌట్లు, కలెక్షన్లు, ఆల్ టైం రికార్డ్స్ ఇలాంటివన్నీ ఒకప్పుడు జరిగేవి. ఇక ప్రస్తుతం అందరు హీరోలు ఒకరు సినిమాలను ఒకరు పొగడటం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో అందరి హీరోల అభిమానులు సపోర్టు నాకు కావాలని ఓపెన్ గా అడగడం కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీకి సమస్య పొలిటికల్ పార్టీల వలన వస్తుంది. అయితే వీటిని ఇండస్ట్రీ ఇప్పుడు ఏ విధంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుందో చూద్దాం.


సినిమా పరిశ్రమ కి రాజకీయ రంగానికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలతో సినిమా పరిశ్రమకు మంచి సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర విషయానికొస్తే గత ప్రభుత్వంలో ఇంకా ఎక్కువగా సినిమా పరిశ్రమకు ఆ రాజకీయ పార్టీకి అనుబంధం ఉండేది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సిపి పార్టీ టికెట్ రేట్లను తగ్గించి చాలా ఇబ్బందులు పెట్టిన తరుణంలో, అనుకూలమైన టిక్కెట్ ధరలను టిఆర్ఎస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి అందించేది. చాలా సినిమా ఈవెంట్లకు కేటీఆర్ కూడా ముఖ్య అతిథిగా హాజరు అయ్యేవాళ్ళు. సినిమా ఈవెంట్లకు పర్మిషన్స్ కూడా చాలా ఈజీగా దొరికేవి. అలానే కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో చాలా మంది సినిమా వాళ్ళను ఆహ్వానించిన దాఖలాలు కూడా ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు కెసిఆర్ ని పబ్లిక్ గా “అందరూ హిస్టరీ క్రియేట్ చేస్తే మీరు జాగ్రత్తగా క్రియేట్ చేశారు” అంటూ పొగిడిన రోజులు కూడా ఉన్నాయి.

2024 ఎలక్షన్ టైం లో కూడా చాలామంది సినిమా వాళ్లు ఓపెన్ గా కేటీఆర్ కి సపోర్ట్ చేసారు. ఇక ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్.. కాంగ్రెస్ మినిస్టర్ కొండా సురేఖ కేటీఆర్ ను ఉద్దేశిస్తూ సినిమా వాళ్లపైన చేసిన వ్యాఖ్యలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాలో భాగంగా ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన విషయం తెలిసింది. అదే టాపిక్ లో భాగంగా గత ప్రభుత్వంలో కేటీఆర్ ఈ కన్వెన్షన్ ను కూల్చకుండా ఉంచడానికి సమంతాను తన వద్దకు పంపమని నాగార్జునను కోరారు. అక్కడితోనే అక్కినేని ఫ్యామిలీలో వివాదాలు మొదలై నాగచైతన్య సమంత విడిపోయారు అంటూ కామెంట్ చేశారు కొండా సురేఖ. ఆ కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి.


ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని విషయాలపై మాత్రమే కొంతమంది రియాక్ట్ అవుతారు. ప్రణీత్ హనుమంతు విషయంలో చాలామంది ట్వీట్స్ వేసిన యంగ్ హీరోస్, జానీ మాస్టర్ వివాదంలో పెద్దగా నోరు మెదపలేదు, అలానే పూనం కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై చేసిన వ్యాఖ్యల గురించి కూడా పెద్దగా ఎవరు చర్చించలేదు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చాలామంది పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అప్పుడు కూడా పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఇవన్నీ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు. అప్పుడు పెద్దగా ఎవరూ రియాక్ట్ కాలేదు.

ఇక ప్రస్తుతం మాత్రం చాలా మంది కొండా సురేఖ వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికలలో వస్తున్న ట్వీట్స్ చూస్తుంటే ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా ఏకమైంది అని చెప్పాలి. కేవలం అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాకుండా, అక్కినేని హీరో అభిమాన సంఘాలు, ఎన్టీఆర్ , నటి రోజా ఇలా చాలామంది ఒక్కసారిగా విరుచుకుపడుతున్నారు. అయితే చాలామందికి ఇండస్ట్రీ అంతా ఇప్పుడు ఏకమైందా.?
ముందు ముందు ఇటువంటి పరిణామాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు.? తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుందో అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Chiranjeevi: పాపులారిటీ కోసమే సెలబ్రిటీలను వాడుకుంటున్నారు – మెగాస్టార్ ఫైర్..!

Kangana Ranaut: మళ్లీ చిక్కుల్లో పడ్డ కంగనా.. నోటిదూల ఎక్కువే సుమీ..?

Konda Surekha : మీరు మాకు ఆదర్శం… ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా…

Pawan Kalyan: అంజనీ పవన్ దత్త పుత్రికా..ఆ అమ్మాయి ఎవరి కూతురో తెలిస్తే ఫ్యాన్స్ గుండె గుబేల్..!

Jr Ntr : నిరాధారణ ఆరోపణలు చేస్తుంటే చూస్తూ కూర్చోం.. కొండా సురేఖ వ్యాఖ్యల పై ఫైర్..

Tollywood Heroine : వరుసగా అన్నీ ఫ్లాప్ సినిమాలే.. స్టార్ హీరోతో పెళ్లి.. హీరోయిన్ ఎవరంటే?

Big Stories

×