EPAPER
Kirrak Couples Episode 1

Pawan Kalyan: పవన్ తప్పు చేశావ్.. నిన్ను వదలేది లేదు అంటున్న తమిళ తంబీలు.. ?

Pawan Kalyan: పవన్ తప్పు చేశావ్.. నిన్ను వదలేది లేదు అంటున్న తమిళ తంబీలు.. ?

Pawan Kalyan: తిరుపతి లడ్డూ వివాదం రోజురోజుకు హీటెక్కుతోంది.  తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని, జంతువుల కొవ్వును నెయ్యిలో కలిపారని ఆరోపణలు వస్తున్న విషయం తెల్సిందే . ఈ వివాదంపై ఏపీ ప్రభుత్వం భగ్గుమంటుంది. ఇప్పటికే  తిరుపతి లడ్డూ వివాదంపై  సమగ్ర విచారణ జరపాలని సిట్ కు ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇంకోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. స్వామివారి విషయంలో జరిగిన అన్యాయానికి బాధ్యత వహిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించిన విషయం విదితమే.


అంతేకాకుండా ఈ వివాదం గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా పవన్ కళ్యాణ్ సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు. నిన్నటికి నిన్న సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  తమిళ్ హీరో కార్తీ  చేసిన వ్యాఖ్యలపై కూడా పవన్ సీరియస్ అయ్యారు. ఆ ఈవెంట్ లో లడ్డూ గురించి నార్మల్ గా అడిగిన ఒక ప్రశ్నకు కార్తీ.. నవ్వుతూ..” ఇప్పుడు లడ్డూ గురించి ఏం మాట్లాడొద్దు. అది చాలా సెన్సిటివ్ ఇష్యూ”  అని అన్నాడు.  ఇక కార్తీ మాటలపై పవన్ ఫైర్ అయ్యారు.

” ఈ రోజు లడ్డూపై కామెంట్స్ చేస్తున్నారు. జోక్స్ వేస్తున్నారు. నిన్న ఓ సినిమా ఈవెంట్ లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ  అని అన్నారు. దయచేసి అలా అనొద్దు.  నటులుగా మీరంటే గౌరవం.. కానీ, సనాతన ధర్మ విషయం గురించి వచ్చినప్పుడు ఒక్క మాట మాట్లాడాలన్నా వందసార్లు ఆలోచించండి” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యాఖ్యలపై కార్తీ కూడా  రియాక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ కు సారీ చెప్పాడు. ఇక్కడితో ఈ వివాదం ముగిసింది అనుకుంటే పొరపాటే.


ఇప్పుడు ఈ వివాదంలోకి తమిళ తంబీలు కూడా ఎంటర్ అయ్యారు. పవన్ కళ్యాణ్.. ఈ విషయంలో కొద్దిగా ఓవర్ గా మాట్లాడారని అంటున్నారు. కార్తీ మాట్లాడిన దాంట్లో తప్పే లేదు. నవ్వుతూ లడ్డూ విషయంలో తనను అడగొద్దని చెప్పాడు. అది కొంతమంది వెటకారంగా చెప్పాడని చెప్పి కాంట్రవర్సీగా మార్చారని కోలీవుడ్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. చేయని  తప్పుకు కార్తీ సారీ చెప్పాడు. దానివలన అతని వ్యక్తిత్వం పెరిగింది కానీ, తగ్గలేదు. చిన్న విషయాన్నీ పెద్దది చేసింది పవన్ తప్పు చేశారని అని ఏకిపారేస్తున్నారు.

అసలు ఈ వివాదం గురించి తప్పుగా మాట్లాడినవారు..  వెటకారం చేసినవారు చాలామందే ఉన్నారు. వారందరిని వదిలేసి.. వేరే ఇండస్ట్రీ నుంచి తెలుగుకు వచ్చిన ఒక హీరోపై ఆ కోపం ప్రదర్శించడం తప్పని అంటున్నారు.  కార్తీ విషయంలో కోలీవుడ్ మొత్తం ఒక్కటిగా నిలబడింది.. పవన్ పై విమర్శలు గుప్పిస్తూ మీమ్స్ వేయడం మొదలుపెడుతున్నారు.

తమిళ తంబీలు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది పవన్ కు కచ్చితంగా నెగెటివిటీని పెంచుతుందనే అంటున్నారు. ఇక తెలుగువారు మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పినదాంట్లో తప్పు లేదని, ఇలా గట్టిగా చెప్తే.. ఇలాంటి వివాదాల గురించి వెటకారంగా మాట్లాడరని అంటున్నారు.  మరి ఈ వివాదం  ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Related News

Harsha Sai: బిగ్ బాస్ బ్యూటీపై హర్షసాయి అత్యాచారం.. వాడుకొని వదిలేశాడు

Hema Committee Report: హేమ కమిటీ రిపోర్ట్‌పై సినిమా.. రంగంలోకి దిగనున్న కాంట్రవర్షియల్ డైరెక్టర్

Pawan Kalyan: కార్తీ క్షమాపణపై పవన్ కళ్యాణ్ స్పందన.. సూర్య, జ్యోతికలను ఉద్దేశిస్తూ ఏమన్నారంటే?

Sreeleela : ఓర్నీ ఇది డ్యాన్సా.. శ్రీలీల డ్యాన్స్ పై సెటైర్స్..

Harsha Sai:పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై యువతీ ఫిర్యాదు

Star Singer: అది లేకపోవడం వల్లే విడాకులు పెరుగుతున్నాయి.. సీనియర్ సింగర్ షాకింగ్ కామెంట్..!

Big Stories

×