EPAPER

Kirrak Couples: అద్భుతం, యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న బిగ్ టీవీ ‘కిర్రాక్ కపుల్స్’ షో.. ఒక్క రోజులో ఎన్ని వ్యూసో తెలుసా?

Kirrak Couples: అద్భుతం, యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న బిగ్ టీవీ ‘కిర్రాక్ కపుల్స్’ షో.. ఒక్క రోజులో ఎన్ని వ్యూసో తెలుసా?

Kirrak Couples On Big TV: బిగ్ టీవీ అంటే కేవలం సీరియస్ న్యూస్ మాత్రమే కాదు ఎంటర్‌టైన్మెంట్ అని చెప్పడం కోసం ‘కిర్రాక్ కపుల్స్’ అనే షో ప్రారంభమయ్యింది. ఈ షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్ విడుదల అవ్వగానే ఒక్కరోజుల్లో భారీగా వ్యూస్ సాధించి ఎంటర్‌టైన్మెంట్‌కు కూడా బిగ్ టీవీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో నిరూపించింది. ఆటో రామ్ ప్రసాద్, భ్రమరాంబిక యాంకర్లుగా వ్యవహరిస్తున్న ‘కిర్రాక్ కపుల్స్’.. వినాయక చవితి సందర్భంగా ప్రారంభమయ్యింది. దానికి ముందు విడుదలయిన ప్రోమోకు మాత్రమే కాకుండా వినాయక చవితి సందర్భంగా విడుదలయిన ఫస్ట్ ఎపిసోడ్‌కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది.


ప్రతీవారం పక్కా ఎంటర్‌టైన్మెంట్

బిగ్ టీవీ యూట్యూబ్ ఛానెల్‌లో వినాయక చవితి సందర్భంగా విడుదలయిన ‘కిర్రాక్ కపుల్స్’ షోకు 24 గంటల్లోనే 100k వ్యూస్ లభించాయి. ప్రతీ గంటకు ఈ వ్యూస్ ఇంకా పెరుగుతూనే వస్తున్నాయి. ఎపిసోడ్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉందంటూ చూసిన ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. ‘కిర్రాక్ కపుల్స్’ షోకు గెస్టులుగా వచ్చిన కపుల్స్ మాత్రమే కాదు.. యాంకర్లు కూడా చాలా ఎంటర్‌టైన్ చేస్తున్నారని అంటున్నారు. అలా ప్రతీవారం ముగ్గురు కపుల్స్‌తో ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమవుతోంది ఈ షో. బిగ్ టీవీలో ‘కిర్రాక్ కపుల్స్’ ప్రతీ శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారమవుతుంది. ఆ తర్వాత ఈ షోను ఎప్పుడు కావాలంటే అప్పుడు బిగ్ టీవీ యూట్యూబ్ ఛానెల్‌లో చూడవచ్చు.


Also Read: బిగ్ టీవీలో ‘కిర్రాక్ కపుల్స్’ షో.. యాంకర్స్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

వారిద్దరూ పెయిర్

స్టాండప్ కామెడీతో కామెడియన్‌గా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు ఆటో రామ్‌ప్రసాద్. ఆ తర్వాత తనలో కేవలం కామెడియన్ మాత్రమే కాదు.. మంచి డ్యాన్సర్, హోస్ట్ కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు. ‘కిర్రాక్ కపుల్స్’ షోతో ఆ విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇది కపుల్స్ షో కాబట్టి హోస్టింగ్ చేయడం కోసం ఆటో రామ్‌ప్రసాద్‌కు కూడా ఒక పెయిర్ కావాల్సి వచ్చింది. అందుకే షార్ట్ ఫిల్మ్‌తో యూట్యూబ్‌లో ఫేమస్ అయిన భ్రమరాంబిక రంగంలోకి దిగింది. ఇప్పటివరకు భ్రమరాంబిక కూడా బుల్లితెరపై పలు టీవీ షోల్లో కనిపించింది. కానీ ‘కిర్రాక్ కపుల్స్’లో హోస్ట్‌గా తన కెరీర్‌లో కొత్త జర్నీ ప్రారంభించింది. వీరిద్దరి హోస్టింగ్ చాలా బాగుందంటూ ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.

యాంకర్‌తో గొడవ

‘కిర్రాక్ కపుల్స్’ ఫస్ట్ ఎపిసోడ్‌లో ముగ్గురు కపుల్స్ వచ్చారు. అందులో ఒకరు రియల్ కపుల్ కాగా ఇద్దరు రీల్ కపుల్స్. రియల్ కపుల్‌గా వచ్చిన ప్రియా, హృతేష్ తమ లవ్ స్టోరీ చెప్పి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. తాము ప్రేమించుకున్న రోజులను గుర్తుచేసుకున్నారు. సౌజన్య, బాజీ కలిసి చేసిన స్కిట్ కూడా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. ఇక సీరియల్ ఆర్టిస్ట్ సుమిత్ అయితే తన స్టైల్ కామెడీతో ఆకట్టుకున్నాడు. మధ్యలో యాంకర్ భ్రమరాంబికను ఏడిపించాడు కూడా. తర్వాత తనే మళ్లీ సారీ చెప్పి కలిసిపోయాడు. అలా ప్రతీవారం కొందరు రీల్ కపుల్స్, కొందరు రియల్స్ కపుల్స్‌తో ఈ షో కొనసాగుతుంది. బిగ్ టీవీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటుంది.

Related News

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Pawan Kalyan : నిర్మాతలకు పవన్ కళ్యాణ్ షాక్.. ఇలా చేస్తారని అనుకోలేదు డిప్యూటీ సీఏం సార్..

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Pushpa 2 : అక్టోబరే డెడ్ లైన్… ఇక చరణ్ తో తాడో పేడో..

Game Changer: అల్లు అర్జున్ తో పోటీ.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Tollywood: జానీ మాస్టర్ కన్నా ముందు టాలీవుడ్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా.. ?

Niharika Konidela: తమిళ తంబీల మనసు దోచేస్తున్న నిహారిక.. డ్యాన్స్, రొమాన్స్ అదరగొట్టేసిందిగా!

Big Stories

×