EPAPER

Kirrak Couples: బిగ్ టీవీలో ‘కిర్రాక్ కపుల్స్’ షో.. యాంకర్స్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Kirrak Couples: బిగ్ టీవీలో ‘కిర్రాక్ కపుల్స్’ షో.. యాంకర్స్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Kirrak Couples: ఎంతో ప్రజాదరణతో దూసుకుపోతుంది ప్రముఖ టీవీ ఛానెల్ బిగ్ టీవి. సమస్య ఎక్కడైనా, ఎలాంటి సమస్య అయినా.. ఎవరికీ భయపడకుండా సాహసం చేస్తుంది. ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాంటి బిగ్ టీవీ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి తాజాగా కొత్త షో స్టార్ట్ చేసింది. అదే ‘కిర్రాక్ కపుల్స్’. ఈ షో వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7, 2024న గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ప్రముఖ టీవీ సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొని ఆడియన్స్‌ను ఉత్సాహపరిచారు. కామెడీ పంచులతో, పలు గేమ్‌‌లతో ఈ షో సందడి సందడిగా జరిగింది. ఈ షోకు జబర్దస్త్ కమెడియన్ రామ్ ప్రసాద్, అలాగే నటి భ్రమరాంబిక తూటిక యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా కామెడీ షోతో అదరగొట్టేసిన రామ్ ప్రసాద్, సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన భ్రమరాంబిక యాంకరింగ్‌తో అదరగొట్టేశారనే చెప్పాలి. ఇప్పుడు వీరిద్దరి గురించి పూర్తిగా తెలుసుకుందాం.


రామ్ ప్రసాద్

1983 మే 3న విశాఖపట్టణంలో రామ్ ప్రసాద్ జన్మించాడు. అతడికి ఒక్క అక్క కూడా ఉన్నారు. అయితే రామ్ ప్రసాద్ నాన్న డైలీ సైకిల్‌పై వెళ్లి ఉద్యోగం చేసేవారు. అలా రామ్ ప్రసాద్‌కి ఊహతెలిసినప్పటి నుంచి తన తండ్రి పడ్డ కష్టాలు చూసి పెరిగాడు. అయితే రామ్ ప్రసాద్ చిన్నప్పటి నుంచి పంచులు వేస్తూ కామెడీ చేసేవాడు. అయితే 6వ తరగతి వరకు టాప్ స్టూడెంట్‌గా ఉన్న రామ్ ప్రసాద్ ఆ తర్వాత 7వ తరగతి నుంచి చదువును అట్టకెక్కించేశాడు. ఇక ఎలాగోలా 10వ తరగతి పాసైపోయాడు. అనంతరం పైచదువులు చదవనని మారం చేశాడు. కానీ ఇంట్లోవాళ్ల ఒత్తిడితో ఇంటర్ జాయిన్ అయ్యాడు. ఇంటర్‌లో డుమ్మాలు కొడుతూ బీచ్‌లలో తిరిగేవాడు.


ఇంటర్ చేస్తూనే మెడికల్ షాపులో సేల్స్‌ బాయ్‌గా పార్ట్‌టైం జాబ్ చేసేవాడు. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫెయిల్ కావడంతో ఫుల్ టైంగా జాబ్‌లో చేరిపోయాడు. కానీ కొన్నాళ్లకు ఆ జాబ్‌లో విరక్తి పుట్టింది. అదే సమయంలో అతడి ఫ్రెండ్స్ కూడా రామ్ ప్రసాద్‌ని చాలా మోటివేట్ చేసేవారు. ‘‘నువ్ అందరినీ బాగా నవ్విస్తున్నావ్. నీ కామెడీ పంచులు బాగున్నాయి. సినీ ఫీల్డ్‌కి వెలితే నీకు మంచి అవకాశాలు వస్తాయ్’’ అని చెప్పేవారు. కానీ సినీ ఫీల్డ్‌లోకి ఎలా వెల్లాలో తెలిసేది కాదు. అయితే ఆ తర్వాత తన మిత్రుడి ద్వారా హైదారాబాద్ వచ్చి ఒక ఎడిటర్ దగ్గర అప్రెంటిస్‌గా జాయిన్ అయ్యాడు.

అలా అక్కడ పెద్దగా డబ్బులు రాకపోయినా తినడానికి ఉండటానికి ఉండేది. అలా తన కామెడీ మార్క్‌తో చుట్టూ ఉండేవారిని అలరించేవాడు. అయితే ఓ సారి అతడికి రైటర్ దగ్గర అసిస్టెంట్‌గా అవకాశం వచ్చింది. అలా అక్కడ చేస్తూ పరిచయాలు పెంచుకున్నాడు. ఆ తర్వాత జబర్దస్త్ షో మొదలుపెట్టారు. ఆ షోకి స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే ధన్‌రాజ్ టీమ్‌లో కంటెస్టెంట్‌గా చేరాడు. దాదాపు 10 ఎపిసోడ్ వరకు చేశాడు. ఆ తర్వాత జబర్దస్త్ తీసేసి మరో షో పెట్టే క్రమంలో రామ్ ప్రసాద్, శ్రీను, సుధీర్ కలిసి ఒక టీంగా ఏర్పడ్డారు.

Also Read: బిగ్ టీవీలో స్పెషల్ షో మొదలు.. ‘కిర్రాక్ కపుల్స్’ అంటూ బుల్లితెర జోడీలతో రామ్‌ప్రసాద్ సందడి

వీరి కాంబినేషన్‌లో మొదటి ఎపిసోడ్ 2013 సెప్టెంబర్‌లో టెలికాస్ట్ అయింది. వీరి టీంకి సుడిగాలి సుధీర్ అని పేరు పెట్టారు. ఇక అక్కడ నుంచి వీరి జర్ని ఎవరూ ఊహించనంత ఎత్తుకి ఎదిగింది. రామ్ ప్రసాద్ స్క్రిప్ట్, శ్రీను గెటప్స్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించాయి. ఇలా ఈ ముగ్గురు వారి కామెడీ పంచులతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మరి అలాంటి కామెడీ పంచులతో ఎంతో మంది హృదయాలు గెలుచుకున్న రామ్ ప్రసాద్.. ఇప్పుడు ప్రముఖ టీవీ ఛానెల్ బిగ్‌టీవీలో ‘కిర్రాక్ కపుల్స్’ షోకి యాంకర్‌గా చేయడంతో మరో అడుగు ముందుకేశాడనే చెప్పాలి. చూడాలి మరి ఈ షోను ఏ స్థాయికి తీసుకువెళతాడో.

బ్రమరాంబిక తూటిక

మోస్ట్ ఇన్ఫ్లుయెన్సెర్‌లలో రాజమండ్రి ముద్దుగుమ్మ బ్రమరాంబిక తూటిక ఒకరు. ఈమె గురించి పెద్దగా చెప్పాల్సిన పనే లేదు. డిజిటల్ ప్లాట్ ఫార్మ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు బ్రమరాంబిక . కరోనా టైంలో కొన్ని షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్ చేసి తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్నారు. ఆ టైంలో మొదలైన ఆమె కెరీర్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో దూసుకుపోతుంది. ఇన్‌ఫినిటీ మీడియా, అలాగే జబర్దస్త్‌లో కూడా చేసి అలరించారు. అయితే ఆమె ‘వర్జిన్’ అనే వెబ్ సిరీస్ చేసి అందరినీ అలరించారు. ఆ తర్వాత కూడా ఎన్నో సిరీస్‌లలో నటించారు. షార్ట్ ఫిలింస్ చేశారు.

అంతేకాకుండా పలు షోలకు కూడా యాంకరింగ్ చేశారు. వీటితో పాటు ఎంతో మంది చిన్న చిన్న సెలబ్రిటీలను సైతం ఇంటర్వ్యూ చేసి అలరించారు. అలాగే ‘1980లో రాడెక్రిష్’, ‘సీతారాం సిత్రాలు’ మూవీలు చేసి అలరించారు. ఈ మూవీలో తన అందం, అభినయంతో మరింత మంది ప్రేక్షకుల్ని అభిమానులుగా సంపాదించుకున్నారు. అలాగే ప్రస్తుతం ఆమె ‘రాధే కృష్ణ’ అనే మూవీలో చేస్తున్నారు. ఇలా హీరోయిన్‌గా చేస్తూ పలువురితో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన ప్రతిభను కనబరిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ఇక అలాంటి భ్రమరాంబిక ఇప్పుడు ఎంతో ప్రజాదరణ పొందిన ప్రముఖ టీవీ ఛానెల్ బిగ్ టీవీలో కొత్త షో ‘కిర్రాక్ కపుల్’కి యాంకర్‌గా ఉన్నారు. ఇంతటి ఫాలోయింగ్ ఉన్న భ్రమరాంబిక ఈ షోను ఏ మేరకు ముందుకు తీసుకుపోతారో చూడాలి.

Related News

Rajamouli : ఏంటి జక్కన్న.. తెలుగు హీరోలను వదిలేశావా?

Johnny Master Case : కిరాచక భార్యాభర్తలు… సాటి మహిళ కూడా కనికరించలే..

Political Celebrities: నష్ట జాతకులుగా మారిన సెలబ్రిటీస్.. మొన్న పృథ్వీ.. నేడు జానీ..!

Siddarth -Aditi Rao Hydari: మరీ ఇంత మోసమా… కాస్త ఆలోచించాల్సింది లవ్ బర్డ్స్

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Big Stories

×