KA Movie Collections Day 2 : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తాజాగా నటించిన పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ ‘క'(KA Movie). ఈ సినిమాలో తన్వి రామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించగా.. దర్శక ద్వంయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో.. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన విడుదలైన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.
యావరేజ్ టాక్ తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం మూవీ..
మొదటి షో తో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. ఆ తర్వాత ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తనను కొంతమంది టార్గెట్ చేస్తూ అవమానిస్తున్నారు అని కిరణ్ అబ్బవరం ఎమోషనల్ అయ్యారు . ఆ కారణంగా ఆయనపై జాలి ఏర్పడి సినిమాను ఎక్కువమంది చూస్తున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి కిరణ్ అబ్బవరం కన్నీటికి ఈ సినిమా ద్వారా ఫలితం లభించిందా ..? అసలు ఈ సినిమా రెండు రోజుల్లో ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది ..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
‘క ‘ సినిమా కథ..
1977లో సాగే కథగా ఈ సినిమాను చూపించారు. ఇందులో హీరో అభినయ వాసుదేవ్ అనే పాత్రలో నటించగా.. ఈయన ఒక అనాథ. ఈయన బాల్యం మొత్తం అనాథాశ్రమంలోనే సాగుతూ ఉంటుంది. ఇక చదివి పెద్దయిన తర్వాత క్రిష్ణగిరి అనే ఒక మారుమూల ప్రాంతంలో పోస్ట్మాన్ గా ఉద్యోగం సంపాదించుకుంటాడు. అయితే ఇతడికి రహస్యంగా వేరే వాళ్ళ ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. ఆ క్రమంలోనే ఆ ఊరు పోస్ట్ ఆఫీస్ హెడ్ గా పనిచేస్తున్న రంగారావు కూతురైన సత్యభామతో పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారుతుంది. అలా చక్కగా సంతోషంగా, రొమాంటిక్ గా సాగిపోతున్న కథలోకి అనూహ్య మలుపులు చోటు చేసుకుంటాయి . ఆ ఊర్లో అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉండడంతో ఆ ఊరి ప్రజలు భయాందోళనలకు గురి అవుతారు. ఇకపోతే రహస్యంగా ఇతరుల ఉత్తరాలు చదివే అభినయకు ఒక ఉత్తరం ద్వారా అమ్మాయిల మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఒక చిన్న క్లూ బయట పడుతుంది. ఈ క్లూ ద్వారా మిస్టరీ కేసును అభినయ ఎలా చేధించాడు.? అసలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు..? అనేది ఈ సినిమా కథ.
రెండు రోజుల్లో ఎంత రాబట్టిందంటే..
మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనే విషయానికి వస్తే.. మౌత్ టాక్ పరంగా యావరేజ్ వచ్చినా.. ఆ తర్వాత కాలంలో కలెక్షన్లు పుంజుకున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ .3.8 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ లో అదిరిపోయే కలెక్షన్స్ అందుకుంది. ఇలా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ .6.18 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసినట్లు ఒక స్పెషల్ పోస్టర్ ను కూడా షేర్ చేశారు మేకర్స్. ఇక రెండవ రోజు రూ .3కోట్ల కలెక్షన్స్ అందుకుంది. కేవలం రెండు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే రూ.6.80 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది.అలాగే ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.10.25 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది ఈ సినిమా. మొత్తానికి అయితే కిరణ్ అబ్బవరం ఎమోషన్ కి ఫలితం బాగా లభించింది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.