Ka Movie: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా ఎట్టకేలకు సక్సెస్ అయ్యాడు. ఆయన నటించిన క సినిమా పాజిటివ్ టాక్ ను అందుకొని ప్రేక్షకులను అలరిస్తుంది. ఏడాది గ్యాప్ తీసుకొని.. మంచి కథను ఎంచుకొని, లుక్ మార్చి.. కిరణ్ చేసిన ప్రయోగం ప్రేక్షకులను మెప్పించింది. సుజిత్- సందీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. ఆయ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆమె లక్ కూడా క కు పనికొచ్చిందని చెప్పాలి.
మొదట క మూవీ కి థియేటర్స్ తక్కువ ఇచ్చారు. అయితే ఉన్నకొద్దీ క కు మౌత్ టాక్ పెరగడంతో థియేటర్లను పెంచారు. ఇక కిరణ్ సైతం ఈ సినిమా విజయం అందుకున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. ఇవన్నీ పక్కన పెడితే.. ఉదయం నుంచి క మూవీ ఓటీటీ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
Akkineni Nagarjuna: కొడుకు పెళ్లి.. మరోసారి నాగ్ N కన్వెన్షన్ పై చర్చ.. ?
ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ క మూవీ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.. ఆ ఓటీటీ ఏంటిదో గెస్ చేయండి అనే పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో మీమర్స్.. క మూవీ ఏ ఓటీటీలో వస్తుంది అనే ట్యాగ్ తో వైరల్ చేస్తున్నారు.
ఇక క మూవీ ఏ ఓటీటీలో వస్తుంది అన్న ప్రశ్నకు సమాధానం దొరికేసింది. క సినిమా డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో మంచి మంచి సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్న ఈటీవీ విన్.. క మూవీ డిజిటల్ హక్కులను సుమారు రూ.10కోట్లకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది.
థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉంది. ఆ లెక్కన చూస్తే.. నవంబర్ మూడో వారంలోనే క.. ఓటీటీలో అడుగుపెట్టొచ్చు. ఒకవేళ లాంగ్ థియేట్రికల్ రన్ కొనసాగితే కొద్దిగా లేట్ అవ్వొచ్చు. మరి ఈటీవీ విన్.. ఈ సినిమాను ఎప్పుడు స్ట్రీమింగ్ కు ఇస్తుందో చూడాలి.