EPAPER

Khaleja : సినిమా ఎవరికన్నా నచ్చకపోతే గొడవపడే వాడ్ని – విజయ్ దేవరకొండ

Khaleja : సినిమా ఎవరికన్నా నచ్చకపోతే గొడవపడే వాడ్ని – విజయ్ దేవరకొండ

Khaleja : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని డిజాస్టర్ సినిమాలకు కూడా ఎప్పటికీ ఒక కల్ట్ స్టేటస్ ఉంటుంది. అలా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఖలేజా సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమా ఎందుకు పోయిందో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. మనిషిలోనే దేవుడు ఉంటాడు అని త్రివిక్రమ్ శ్రీనివాస్ కమర్షియల్ గా చెప్పిన పాయింట్ చాలామందికి అప్పట్లో ఎక్కలేదు. ఆ పాయింట్ ఇప్పుడు ఎక్కినా కూడా పెద్దగా లాభం లేదు. ఎందుకంటే సినిమా ఫలితం ఇప్పటికిప్పుడు మనం మార్చలేము. కానీ ఇదే సినిమా రీ రిలీజ్ చేస్తే రిలీజ్ అప్పుడు కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని చాలామంది నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే ఖలేజా సినిమా చూసిన ప్రతిసారి ఇంకొంచెం ఎక్కువ అర్థమవుతుంది. అంత అద్భుతంగా ఈ సినిమాను డిజైన్ చేశాడు త్రివిక్రమ్. మహేష్ బాబు లోని పరిపూర్ణమైన నటుడిని బయటకు తీసిన సినిమా ఖలేజా. త్రివిక్రంలోని కంప్లీట్ రైటర్ ని కూడా బయటికి తీసిన సినిమా ఖలేజా. ఈ సినిమాలో రావు రమేష్ డైలాగులు ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటాల పేలాయి.


ఈ సినిమాలో సీతారామరాజు అనే పాత్రలో కనిపించాడు మహేష్. ఈ పాత్ర చాలామందికి ఇష్టం. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మహేష్ కూతురు సితారని అడిగినప్పుడు కూడా మా నాన్నగారి సినిమాల్లో నాకు ఖలేజా సినిమా చాలా ఇష్టం సీతారామరాజు అనే క్యారెక్టర్ ఇంకా ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. ఇక కలేజా సినిమాకి కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా చాలామంది సెలబ్రిటీస్ కూడా అభిమానులు ఉన్నారు. మహేష్ బాబు కామిక్ టైమింగ్, వాయిస్ మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీ ఇవన్నీ కూడా ఖలేజా సినిమాలో నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తాయి. అలానే మణిశర్మ అందించిన మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సదాశివ సన్యాసి పాట వినగానే ఇప్పటికీ చాలామందికి గూజ్ బంప్స్ వస్తాయి అని చెప్పాలి. ప్రతి సోమవారం చాలామంది వాట్స్అప్ స్టేటస్ లో ఈ పాట ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. శివుడు గురించి అంత గొప్ప పాటను రాశారు రామ జోగయ్య శాస్త్రి.

ఇకపోతే సోషల్ మీడియాలో మరోసారి ఖలేజా గురించి చర్చలు మొదలయ్యాయి. దీని కారణం విజయ్ దేవరకొండ చెప్పిన కొన్ని మాటలు. చాలా సందర్భాల్లో విజయ్ దేవరకొండ మహేష్ బాబు కి ఎంత పెద్ద అభిమాని అని చెప్పుకొచ్చాడు. మహేష్ సినిమాల్లో తనకు బాగా నచ్చిన సినిమాలు అతడు ఖలేజా అని నిన్న జరిగిన లక్కీ భాస్కర్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ తెలిపారు. అంతేకాకుండా త్రివిక్రమ్ గురించి ప్రస్తావిస్తూ ఖలేజా సినిమా నాకు చాలా ఇష్టం. ఒకవేళ ఖలేజా సినిమా ఎవడైనా నచ్చలేదు అంటే నేను వాడితో గొడవ పడే వాడిని అంటూ చెప్పుకొచ్చాడు. నా పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ లో నేను సినిమా చేయాల్సి ఉంది. అది ఇప్పటికీ జరిగింది. ఆ టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకు చెక్ ఇచ్చి నువ్వు పెద్ద స్టార్ అవుతావని చెప్పారు. ఎవరు సినిమాలు చూస్తూ పెరిగామో ఆ వ్యక్తి మనల్ని స్టార్ట్ అవుతారు అని చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది అంటూ ఇంకొన్ని మాటలు షేర్ చేసుకున్నారు.


Related News

SSMB 29 Movie release date : రిలీజ్ డేట్ అయితే ఇదే… కానీ జక్కన్న గురించి తెలిసిందేగా..

SSMB29: మహేష్ బాబు రాజమౌళి సినిమా టార్గెట్ అన్ని కోట్లా.? రాజమౌళి కంటే మహేష్ కే ఎక్కువ

Vijay Dalapathi: ఆ రికార్డు సృష్టించనున్న విజయ్.. మొత్తం ఆస్తులు విలువ ఎంతంటే..?

Nishadh Yusuf : కంగువ ఎడిటర్ ఆకస్మిక మృతి

Kiran Abbavaram’s Ka Movie : కంటెంట్ ఏమో కానీ…. కన్నీళ్ళతో బజ్ బాగానే పెరిగింది..

Ka Movie Pre Release Event : కిరణ్ చెప్పిన మూవీ ఇదేనా… అంతలా ఏం ట్రోల్ చేశారు బ్రో..

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

×