EPAPER

Khadgam Re-Release: 22 యేళ్ళ తర్వాత రీ రిలీజ్.. శ్రీకాంత్ ఏమన్నారంటే..?

Khadgam Re-Release: 22 యేళ్ళ తర్వాత రీ రిలీజ్.. శ్రీకాంత్ ఏమన్నారంటే..?

Khadgam Re-Release.. ఇటీవల కాలంలో రిలీజ్ సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలో చాలామంది హీరోలు తమ సినిమాలు విడుదల చేయలేని సందర్భంలో తమ కెరియర్లో భారీ సక్సెస్ అందుకున్న సినిమాలను విడుదల చేస్తూ అభిమానులలో హైప్ పెంచేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎప్పుడో గత దశాబ్ద కాలం క్రితం విడుదలైన చిత్రాలను మళ్లీ రీలీజ్ చేస్తూ అభిమానులలో కొత్త సందడి క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహేష్ బాబు, పోకిరి సినిమాతో మొదలైంది ఈ రీ రిలీజ్ హంగామా.. ఈ సినిమాకు ఆడియన్స్ లో వచ్చిన రెస్పాన్స్ చూసి.. చిరంజీవి, బాలకృష్ణ , పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా ఎంతోమంది హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతూ అభిమానులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీవీలలో ప్రేక్షకులను అలరిస్తున్న ఖడ్గం చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నహాలు చేస్తోంది.


22 ఏళ్ళైనా ఎవర్ గ్రీన్ గా నిలిచిన చిత్రం..

రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో ప్రముఖ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఖడ్గం. 2002 లో విడుదలై భారీ విజయం అందుకున్న ఈ సినిమా ప్రేక్షకులలో విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుంది. లవ్, కామెడీ, సినిమా ఎమోషన్, దేశం ఎమోషన్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ తో కలిపి మల్టీ జానెర్ లో ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు కృష్ణవంశీ. ఇప్పటికీ కూడా టీవీలో రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే చాలు కచ్చితంగా ఈ సినిమా వేస్తారు. ఈ సినిమా సాంగ్స్ కూడా ఇప్పుడు విన్నా అద్భుతంగా ఉంటాయనటంలో సందేహం లేదు.


ఖడ్గం రీ రిలీజ్.. ప్రెస్ మీట్ నిర్వహించడం యూనిట్..

ఈ క్రమంలోనే ఖడ్గం సినిమాను అక్టోబర్ 18 వ తేదీన రీ రిలీస్ చేస్తున్నారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదల చేస్తుండడంతో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించగా.. ఈ ప్రెస్ మీట్ కి శివాజీ రాజా, షఫీ , కృష్ణవంశీ, శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ మాట్లాడుతూ… జనరేషన్స్ మారినా ఖడ్గం సినిమా మాత్రం చాలా గొప్పది. అసలు ఖడ్గం సినిమాలో నిర్మాత నన్ను వద్దు అన్నారు. కానీ వంశీ ధైర్యం చేసి మధును ఒప్పించి నన్ను సినిమాల్లోకి తీసుకున్నారు. నా లైఫ్ లో ఈ సినిమా ఒక మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది. ఈ సినిమా మళ్లీ విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ తెలిపారు శ్రీకాంత్. ఇక కృష్ణవంశీ కూడా మాట్లాడుతూ.. భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశంతోనే ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టాము. ఈ సినిమాకి సహకరించిన నిర్మాత మధు మురళి, నటీనటులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ కృష్ణవంశీ తెలిపారు. అలాగే శివాజీ రాజా, షఫీ తదితరులు ఈ వేదికపై మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని కూడా తెలిపారు.

Related News

Maa Nanna Super Hero Trailer: కంటే తండ్రి అయిపోరు.. ఎమోషన్‌తో ఏడిపించేసిన సుధీర్ బాబు

Hero Darshan: హీరో దర్శన్ ను పీడిస్తున్న ఆత్మ.. జైలు మార్చండి అంటూ కేకలు..!

Mallika Sherawat: ఆ హీరో అర్ధరాత్రి తలుపు కొట్టడంతో.. ఆ క్షణమే పోయాననిపించింది..!

Dasara 2024 Movies: వచ్చేవారం థియేటర్లలో విడుదల కానున్న సినిమాలివే.. ఆ మూడు రోజులు సందడే సందడి

Matka Movie Teaser: మెగా హీరో హిట్ కొట్టినట్టేనా.. టీజర్ తోనే హైప్ ..!

Siva Movie: ‘శివ’ సినిమాకు 35 ఏళ్లు.. ఇది ఒక ఫేమస్ యాక్షన్ చిత్రానికి కాపీ అని మీకు తెలుసా?

Big Stories

×