EPAPER

KCR: ప్లేట్ మార్చిన రాకింగ్ రాకేష్.. KCR ను వెనక్కి నెట్టింది అందుకేనా..?

KCR: ప్లేట్ మార్చిన రాకింగ్ రాకేష్.. KCR ను వెనక్కి నెట్టింది అందుకేనా..?

KCR.. బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ షో ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించింది..ఈ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న చాలామంది వెండితెరపై సత్తా చాటుతున్నారు.. కొంతమంది హీరోలుగా, మరికొంతమంది డైరెక్టర్లుగా చలామణీ అవుతున్నారు. అలాంటి వారిలో రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) కూడా ఒకరు. మొదట చిన్నపిల్లలతో టీం ఏర్పాటు చేసుకొని స్కిట్స్ చేయడం ప్రారంభించిన ఈయన, ఆ తర్వాత పిల్లలు పెద్దవాళ్లు కావడంతో.. రోహిణి లాంటి వారిని తన టీమ్లో చేర్చుకొని.. స్కిట్స్ చేస్తూ మంచి పేరు దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా హీరోగా మారి కేసీఆర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


ఘనంగా కేసీఆర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్..

తాజాగా రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం” కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్)”. అనన్య కృష్ణ(Ananya Krishna) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గ్రీన్ టీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాకింగ్ రాకేష్ నిర్మిస్తున్నారు.. ఈ చిత్రానికి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ చేపట్టిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ విడుదల చేస్తూ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాకింగ్ రాకేష్ తో పాటు ఆయన భార్య జోర్దార్ సుజాత, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ (Sai Rajesh) , ప్రముఖ యాంకర్ కం నటి అనసూయ (Anasuya )ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


కేసీఆర్.. టైటిల్ , ట్యాగ్ లైన్ లో భారీ వ్యత్యాసం..

ఇదిలా ఉండగా గతంలో కేసీఆర్ అంటూ తెరపైకి తీసుకొచ్చిన ఈ సినిమా టైటిల్ ని ఇప్పుడు ట్యాగ్ లైన్ ని మాత్రమే తెరపైకి తీసుకురావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే గత ప్రభుత్వం అనగా గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన పేరు హైలెట్ అయ్యేలా కేసీఆర్ అనే పెద్ద పెద్ద అక్షరాలతో సినిమా టైటిల్ వేసుకున్నారు రాకింగ్ రాకేష్. ఆ సమయంలో ఈ సినిమా షూటింగ్ విడుదల కాలేదు. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం మారిపోయింది. బీఆర్ఎస్ ఓడిపోగా..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అందుకే పెద్ద పెద్ద అక్షరాలతో వేసిన కేసీఆర్ అనే పదాన్ని ఇప్పుడు వెనక్కి పెట్టి, ఈ సినిమా ట్యాగ్ లైన్ కేశవ చంద్ర రమావత్ ను ఇప్పుడు పెద్ద పెద్ద అక్షరాలతో చూపిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి ఉపయోగం లేదనుకున్నారో ఏమో.. కేసీఆర్ అనే పదాన్ని కూడా వెనక్కి నెట్టారు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వాలను వాడుకోవడం వీరికి బాగా తెలుసు అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మీడియా మిత్రులు గతంలో మీ సినిమా టైటిల్ ప్రకటించినప్పుడు బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఓపెనింగ్ చేశారు కదా.. ఇప్పుడు అధికారంలో లేరని మీరు పిలవలేదా అంటూ ప్రశ్నించగా.. దానికి రాకేష్ మాట్లాడుతూ రాజకీయాలకు నాకు సంబంధం లేదు. అందరూ నా సినిమాకి వస్తారు. కాకపోతే కొంతమంది పనుల వల్ల రాలేకపోయార. ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరినీ చూస్తారు అంటూ తెలిపాడు రాకేష్.

రోజాను విమర్శించిన వారికి గట్టి కౌంటర్..

ఇదిలా ఉండగా రోజాపై కూడా షాకింగ్ కామెంట్లు చేశారు రాకేష్. రాకేష్ మాట్లాడుతూ.. నాకు దగ్గరుండి పెళ్లి చేసింది రోజా గారే. నాకు కూతురు పుట్టిన తర్వాత కూడా మొదట వచ్చింది ఆమె. గడప బయటే రాజకీయాలను వదిలేసి లోపలికి వచ్చారు. రోజమ్మ నాకు అన్నం పెట్టి కష్టాల్లో ఆదుకుంది. అడగకుండా నాకు సహాయం చేసిన వ్యక్తి ఆమె. కొంతమంది ఆమె నుంచి లబ్ధి పొంది ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అది వాళ్ళ వ్యక్తిగతం అంటూ రోజాను ఇన్ డైరెక్ట్ గా విమర్శిస్తున్న వారికి కౌంటర్ ఇచ్చారు రాకింగ్ రాకేష్. ప్రస్తుతం రాకేష్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Related News

Hero Navadeep: కష్టాల్లో యంగ్ హీరో.. స్టార్ హీరో ఎంట్రీ తో..!

Mechanic Rocky Trailer: బలవంతంగా విశ్వక్ సేన్‌ను మెకానిక్‌గా మార్చిన తండ్రి.. ఇప్పుడు ఈ హీరో ఏం చేస్తాడో?

Akkineni Amala: రూ.వేల కోట్లు ఉన్నా.. ఆ సమస్య నుంచి బయటపడని అమల.!

Prabhas: ప్రభాస్ లైఫ్ స్టైల్ ఏంటో తెలుసా.. కార్ కలెక్షన్ చూస్తే మతి పోవాల్సిందే..!

Salman Khan: సల్మాన్ ఖాన్ జాతకం ఇదే.. ఆ ముప్పు పొంచి ఉందా?

Aadi Saikumar: ‘ప్రేమకావాలి’ రీ రిలీజ్‌కు ఆది ప్రమోషన్స్.. ఇదేదో కొత్త సినిమాలకు చేయొచ్చుగా!

Big Stories

×