EPAPER

Kartik Aaryan: ఏడేళ్లు కష్టపడ్డాను, రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు.. యంగ్ హీరో ఆవేదన

Kartik Aaryan: ఏడేళ్లు కష్టపడ్డాను, రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు.. యంగ్ హీరో ఆవేదన

Kartik Aaryan: బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం మాత్రమే కాదు.. ఇక్కడ నిలదొక్కుకోవడం కూడా అంత ఈజీ కాదు. ఒకవేళ ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉంటే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు వచ్చినా సపోర్ట్‌తో మరిన్ని ఆఫర్లు వచ్చిపడతాయి. కానీ సపోర్ట్ లేని వారి పరిస్థితి అలా ఉండదు. సక్సెస్ వచ్చేవరకు స్వయంగా కష్టపడుతూ ఉండాలి. ముఖ్యంగా బాలీవుడ్‌లో నెపో కిడ్స్‌కు పోటీగా బ్యాక్‌గ్రౌండ్ లేని నటీనటులు వచ్చి నిలదొక్కుకోవడం చాలా కష్టం. అయినా కూడా కొందరు తమ సొంత టాలెంట్‌ను నమ్ముకొని ఎదిగినవారు ఉన్నారు. అందులో ఒకడు కార్తిక్ ఆర్యన్. కానీ తను ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ఎలాంటి కష్టాలు ఎదుర్కున్నాడో తాజాగా బయటపెట్టాడు ఈ యంగ్ హీరో.


ప్రమోషన్స్‌లో బిజీ

తాజాగా ‘భూల్ భూలయ్యా 3’ (Bhool Bhulaiyaa 3) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తిక్ ఆర్యన్. నవంబర్ 1న విడుదలయిన ఈ సినిమా పాజిటిక్ టాక్‌తో ముందుకెళ్తోంది. అందుకే ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. ‘భూల్ భూలయ్యా 3’ను ప్రమోట్ చేయడం కోసం ఇందులో కీలక పాత్రల్లో నటించిన విద్యా బాలన్, మాధురీ దీక్షిత్‌తో కలిసి దేశమంతా చక్కర్లు కొడుతున్నాడు కార్తిక్. అలాంటి సమయంలోనే తన డెబ్యూ సినిమా తర్వాత కూడా తాను ఆర్ధికంగా ఎలాంటి కష్టాలు ఎదుర్కున్నాడో బయటపెట్టాడు. ‘ప్యార్ కా పంచనామా’ సినిమాతో కార్తిక్ ఆర్యన్‌కు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు లభించినా కూడా తన కష్టాలు కంటిన్యూ అయ్యాయని తెలిపాడు.


Also Read: బాలీవుడ్ లో సౌత్ అమ్మాయిలపై దారుణం.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

కష్టాలు పడ్డాను

‘‘ప్యార్ కా పంచనామా సినిమా తర్వాత నేను ఒక్కడినే ఒక ఇల్లు రెంట్‌కు తీసుకున్నాను. అక్కడ నేను ఒంటరిగా ఉంటూనే కష్టాలు ఎదుర్కున్నాను. నాకు అంతగా సంపాదన లేదు. నా సినిమాలు కూడా అంతగా ఆడలేదు. ఆ ఇంట్లో ఉండడం నాకు చాలా నచ్చేది కానీ అక్కడ ఉండడం వల్ల కూడా చాలా కష్టాలు పడ్డాను. ఒకానొక సందర్భంలో ఆ ఇంటి రెంట్ కూడా నేను కట్టలేకపోయాను. అందుకే వేరేవాళ్లతో ఇల్లు షేర్ చేసుకోవాలనుకున్నాను. అప్పుడే సోనూ కే టీటూ కీ స్వీటి సినిమా వచ్చింది. అప్పటికే నేను ఏడేళ్ల నుండి సినిమా చేస్తున్నా.. ఈ సినిమా మాత్రం నా జీవితాన్నే మార్చేసింది’’ అని గుర్తుచేసుకున్నాడు కార్తిక్ ఆర్యన్.

12 మందితో సావాసం

‘‘ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్‌లో ఉండేవాడిని. అందులో మొత్తం 12 మంది ఉండేవాళ్లం. అప్పుడు నేను నా వాటాగా రూ.2 వేలు రెంట్ ఇచ్చేవాడిని. ఆ తర్వాత అది రూ.4 వేలకు పెరిగింది’’ అని చెప్పుకొచ్చాడు కార్తిక్ ఆర్యన్. యూత్‌ను మెప్పించే స్క్రిప్ట్ సెలక్షన్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇక కోవిడ్ తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ వెంటనే పుంజుకోలేకపోయింది. అదే సమయంలో కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan) నటించిన ‘భూల్ భూలయ్యా 2’ ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అప్పటినుండి ఈ హీరో రేంజే మారిపోయింది.

Related News

Kasthuri Shankar: కాళ్ళ బేరానికి వచ్చిన కస్తూరి.. నోటి దూలకు గట్టి దెబ్బే..!

Sai Pallavi: సాయి పల్లవికి కొత్త ట్యాగ్ ఇచ్చిన చైతన్య.. ఇక నుంచి ఆమె పేరు ఇదే

Nivetha Pethuraj : అతని చేతిలో దారుణంగా మోసపోయిన హీరోయిన్.. అయ్యో పాపం..

Thandel: తండేల్.. ఫిబ్రవరి రిలీజ్ వెనుక ఇంత కథ ఉందా..?

Oscars 2025 : ఆస్కార్ రేసులో ఇండియన్ షార్ట్ ఫిల్మ్… కేన్స్ లోనూ బెస్ట్ మూవీగా అవార్డు

Rahasyam Idam Jagath: ఇప్పటివరకు ఎవరూ టచ్‌ చేయని కథ ‘రహస్యం ఇదం జగత్‌’: దర్శకుడు కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌

Dulquer Salmaan Remuneration : కోట్లు కొల్లగొట్టిన ఈ లక్కీ భాస్కర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×