EPAPER

Kareena Kapoor: స్పిరిట్ లో కరీనా.. క్లారిటీ ఇచ్చేసిందిగా

Kareena Kapoor: స్పిరిట్ లో కరీనా.. క్లారిటీ ఇచ్చేసిందిగా

Kareena Kapoor: ఒకప్పుడు బాలీవుడ్ నటులు.. టాలీవుడ్ ను చాలా తక్కువ చేసి చూసేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. టాలీవుడ్.. పాన్ ఇండియా రేంజ్ లో ఎదిగింది. ప్రస్తుతం ఇతర భాషల ఇండస్ట్రీలోని నటులు.. టాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్.. టాలీవుడ్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇంకా చెప్పాలంటే.. బాలీవుడ్ స్టార్ హీరోస్.. ప్రస్తుతం టాలీవుడ్ విలన్స్ గా మారుతున్నారు. సైఫ్ ఆలీఖాన్, ఇమ్రాన్ హష్మీ, బాబీ డియోల్, అర్జున్ రాంపాల్.. ఇలా ఒకరి తరువాత ఒకరు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.


ఇక హీరోయిన్స్  కూడా తక్కువేం కాదు. దిశా పటానీ, శ్రద్దా కపూర్, జాన్వీ కపూర్, దీపికా పదుకొనే .. ఇలా ఒక్కొక్కరిగా టాలీవుడ్ కు వస్తున్నారు. తాజాగా వీరి లిస్ట్ లో కరీనా కపూర్ కూడా చేరుతుంది అని వార్తలు వచ్చాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో స్పిరిట్ ఒకటి. అనిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంఓ ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా డార్లింగ్ కనిపించనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసిన సందీప్ రెడ్డి వంగా.. స్పిరిట్ ను డిసెంబర్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడనివార్తలు వినిపిస్తున్నాయి.

Karthi: కార్తీ హిట్ సినిమా సత్యం సుందరం.. ఏ ఓటీటీలో చూడొచ్చు అంటే.. ?


ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి స్పిరిట్ లో అడుగుపెట్టనున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కీలక పాత్రలో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రభాస్ కు అక్కగా  కరీనా కనిపిస్తుందని, ఆ పాత్రలో నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయని వార్తలు వినిపించాయి. దీంతో కరీనాకు మంచి టాలీవుడ్ ఎంట్రీ దొరికిందని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు.  అంతేకాకుండా బాలీవుడ్ లో కరీనా రేంజ్ వేరు. కాబట్టి అక్కడ స్పిరిట్ కు మరింత హైప్ వస్తుందని అనుకున్నారు. అయితే ఫ్యాన్స్ ఆశలను కరీనా ఆడియాశాలు చేసింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పిరిట్ లో నటించడం గురించి క్లారిటీ ఇచ్చింది. స్పిరిట్ లో మీరు నటిస్తున్నారంట నిజమేనా.. ? అన్న ప్రశ్నకు కరీనా మాట్లాడుతూ.. ” నేను స్పిరిట్ లో నటించడం లేదు” అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ప్రభాస్, అల్లు అర్జున్ పై ప్రశంసలు గుప్పించింది. వారిద్దరూ ఎంతో గొప్ప నటులు అని,  పాన్ ఇండియా ఆడియెన్స్ ను వీరు తమ యాక్టింగ్ తో మెప్పిస్తున్నారని చెప్పుకొచ్చింది.

Sai Pallavi: అప్పుడు శర్వానంద్.. ఇప్పుడు శివకార్తికేయన్.. హీరోలను అలా అంటే ఫీల్ అవ్వరా.. ?

దీంతో స్పిరిట్ లో తాను నటించడం లేదని క్లారిటీ వచ్చేసింది. ఈ రూమర్స్ కు కరీనా చెక్ పెట్టింది. ఈ విషయం తెలియడంతో.. అయ్యో స్పిరిట్ లో కరీనా ఉందని హైప్ తెచ్చుకున్నాం.. ఆమె లేదంటే ఎలా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి కరీనా పాత్ర ఉందా.. ? కరీనా ప్లేస్ లో మరో స్టార్ హీరోయిన్ ను తీసుకుంటారా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఇక  ప్రస్తుతం కరీనా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ సినిమా కాకుండా త్వరలో ఆమె కూడా తెలుగులో అడుగుపడుతుందేమో చూడాలి.

Related News

Pawan Kalyan: డిప్యూటీ సీఎం కి ఇంకో రెండు సినిమాలు సెట్ చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

Abhishek Bachchan: ఆ హీరోయిన్ తో అభిషేక్ ఎఫైర్.. అందుకే ఐశ్వర్యకు విడాకులు.. ?

Akhanda 2 : అఖండ 2 ఫుల్ స్టోరీ లీక్..బోయపాటి దెబ్బకు ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే..

Anasuaya: వీడు అనసూయ మొగుడా.. అలా ఉన్నాడేంటి అని బండబూతులు తిట్టారు

Rana : ఇప్పటికీ రానా అందులో వీక్.. ఇలా షాక్ ఇచ్చాడేంటి భయ్యా..?

RRR Movie: జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సంచలనం.. 71 ఏళ్ల తర్వాత ఈ మూవీనే..

Rahul sipligunj: నా కెరియర్ లో చేసిన అతి పెద్ద తప్పు అదే.. జీవితాంతం..!

Big Stories

×