EPAPER

Oscars 2025 : ఆస్కార్ రేసులో ఇండియన్ షార్ట్ ఫిల్మ్… కేన్స్ లోనూ బెస్ట్ మూవీగా అవార్డు

Oscars 2025 : ఆస్కార్ రేసులో ఇండియన్ షార్ట్ ఫిల్మ్… కేన్స్ లోనూ బెస్ట్ మూవీగా అవార్డు

Oscars 2025 : 2025 ఆస్కార్ కు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన ‘లాపటా లేడీస్’ 2025 ఆస్కార్ (Oscar 2025)కు ఇండియా నుంచి ఎంపికైన సంగతి తెలిసిందే. తాజాగా ఇండియా నుంచి ‘సన్ ఫ్లవర్ ద ఫస్ట్ వన్ టు నో’ (Sunflowers Were the First Ones to Know) అనే షార్ట్ ఫిలిం 2025 ఆస్కార్ కు అర్హత సాధించింది.


చిదానంద దర్శకత్వంలో రూపొందిన ‘సన్ ఫ్లవర్ ద ఫస్ట్ వన్ టు నో’ (Sunflowers Were the First Ones to Know) అనే షార్ట్ ఫిలిం ఆస్కార్ 2025 (Oscar 2025) బరిలో నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అందులో లైవ్ యాక్షన్ కేటగిరీలో ఈ షార్ట్ ఫిలిం అర్హత సాధించిందని ఆయన పేర్కొంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ‘సన్ ఫ్లవర్ ద ఫస్ట్ వన్ టు నో’ షార్ట్ ఫిలింను ఒక కన్నడ జానపద కథ ఆధారంగా తెరకెక్కించగా, కేవలం 16 నిమిషాల నిడివి ఉంటుంది.

ఇక ‘సన్ ఫ్లవర్ ద ఫస్ట్ వన్ టు నో’ (Sunflowers Were the First Ones to Know) కథ విషయానికి వస్తే వృద్దురాలికి సంబంధించిన కోడిని ఎవరో దొంగతనం చేస్తారు. దానిని కనుక్కోవడానికి ఆ వృద్ధురాలు పడే తపనను ఇందులో ఆసక్తికరంగా చూపించారు. కాగా ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పటికే కేన్స్ లో కూడా సత్తా చాటింది. కేన్స్ 2024 లో కూడా ‘సన్ ఫ్లవర్ ద ఫస్ట్ వన్ టు నో’ ఉత్తమ లఘు చిత్రంగా అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. కేన్స్ లో పలు హాలీవుడ్ షార్ట్ ఫిలింలతో పోటీ పడి మరీ ఈ షార్ట్ ఫిలిం మొదటి బహుమతిని తన ఖాతాలో వేసుకుంది.  ‘సన్ ఫ్లవర్ ద ఫస్ట్ వన్ టు నో’ షార్ట్ ఫిలిం వివిధ భాషలకు చెందిన మొత్తం 17 లఘు చిత్రాలతో పోటీపడి ప్రథమ స్థానంలో నిలవడం చెప్పుకోదగ్గ విషయం. అంతేకాదు బెంగళూరు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ‘సన్ ఫ్లవర్ ద ఫస్ట్ వన్ టు నో’ ఫస్ట్ బహుమతిని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడేమో ఆస్కార్ (Oscar 2025) బరిలో నిలిచి మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకుంది.


‘సన్ ఫ్లవర్ ద ఫస్ట్ వన్ టు నో’ (Sunflowers Were the First Ones to Know) ఈసారి ఆస్కార్ ని కూడా ఇండియాకు తీసుకొస్తుందని పలువురు మూవీ లవర్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ‘లాపటా లేడీస్’ 2025 ఆస్కార్ కు ఇండియా నుంచి ఎంపికయింది. ఈ మూవీని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్క పంపగా, ఇందులో స్పర్ష్ శ్రీవత్సవ, ప్రతిభ, నితాన్షి గోయల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ థియేటర్లలో పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Rana comments on Mr Bachchan: లాస్ట్ కి అవార్డు తీసుకునే స్టేజ్ మీద కూడా హరీష్ శంకర్ ని ట్రోల్ చేశారు

Sai Pallavi on Thandel movie: ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎటువంటి ఒత్తిడి చేయలేదు

Chiranjeevi : మెగాస్టార్ ఇంట మెగా ఫంక్షన్… గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అయిన శ్రీజ

Kasthuri Shankar: కాళ్ళ బేరానికి వచ్చిన కస్తూరి.. నోటి దూలకు గట్టి దెబ్బే..!

Sai Pallavi: సాయి పల్లవికి కొత్త ట్యాగ్ ఇచ్చిన చైతన్య.. ఇక నుంచి ఆమె పేరు ఇదే

Nivetha Pethuraj : అతని చేతిలో దారుణంగా మోసపోయిన హీరోయిన్.. అయ్యో పాపం..

Thandel: తండేల్.. ఫిబ్రవరి రిలీజ్ వెనుక ఇంత కథ ఉందా..?

Big Stories

×