EPAPER

Kanguva Runtime: కంగువ రన్ టైం రీవిల్ చేసిన దర్శకుడు, అదే ప్లస్ అవ్వనుందా.?

Kanguva Runtime: కంగువ రన్ టైం రీవిల్ చేసిన దర్శకుడు, అదే ప్లస్ అవ్వనుందా.?

Kanguva Runtime: 2001లో ఒక మలయాళం సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా తన జర్నీ స్టార్ట్ చేశాడు శివ. ఆ తర్వాత తెలుగు, తమిళ్ లో చాలా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశాడు. అయితే గోపీచంద్ హీరోగా చేసిన శౌర్యం సినిమాతో దర్శకుడుగా మారాడు శివ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ దర్శకుడుగా మంచి పేరు శివకి దక్కింది. సౌర్యం సినిమా తర్వాత మళ్లీ గోపీచంద్ హీరోగా శంఖం అనే సినిమాను తెరకెక్కించాడు శివ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించింది. ఇకపోతే ఈ సినిమా స్టోరీ చాలామందికి బాగా కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన మిర్చి స్టోరీ దాదాపుగా ఇదే కథను పోలి ఉంటుందని కూడా చెప్పొచ్చు. అప్పట్లో శంఖం సినిమాని శివ కాపీ కొట్టాడని కొన్ని వార్తలు కూడా వినిపించాయి.


అయితే శంఖం సినిమా తర్వాత తెలుగులో సినిమాలు తీయటం మానేశాడు శివ. తమిళ్లో సినిమాలు తీయటం మొదలుపెట్టాడు.తమిళ్లో స్టార్ హీరోల్లో ఒకరైన అజిత్ తో వరుసగా సినిమాలు చేశాడు శివ. అయితే ఈ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాయి. శివ దర్శకత్వం వహించిన సినిమాల్లో కొన్ని సినిమాలు తెలుగులో కూడా రీమేక్ అయ్యాయి. లాస్ట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ తో అన్నతే అనే సినిమాను తెరకెక్కించాడు శివ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందివ్వలేదు. ఇకపోతే ప్రస్తుతం శివ సూర్య హీరోగా కంగువ అనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సూర్య, శివ చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమాను తమిళ్ బాహుబలి అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

కంగువ సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో కంటెంట్ కూడా అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా మీద అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. అలానే మొదటి 1000 కోట్లు వసూలు చేసే తమిళ్ సినిమాగా కూడా ఈ సినిమాను అంచనా వేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా రన్ టైం బయటపెట్టేసాడు దర్శకుడు శివ. ఈ సినిమాలో ఓల్డ్ పోర్షన్ రెండు గంటలు ఉంటుంది. అంటే కంగువ పాత్రలో సూర్య రెండు గంటల పాటు కనిపించనున్నాడు. ఇక న్యూ పోర్షన్ దాదాపు 25 నిమిషాలు ఉంటుంది. టైటిల్స్ నిడివి పక్కన పెడితే ఈ సినిమా దాదాపు రెండు గంటల 25 నిమిషాల పాటు ఉండబోతుంది అని తెలుస్తుంది. రీసెంట్ టైమ్స్ లో చాలా సినిమాల రన్ టైం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సినిమా రన్ టైం టు అవర్స్ 25 మినిట్స్ అంటే చాలా తక్కువ. ఇది సినిమాకు ఏ మేరకు ప్లస్ అవుతుందో త్వరలో తెలియనుంది. నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ కానుంది.


Related News

Ram Charan: నేను నా ప్రొడ్యూసర్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నా సినిమా పోస్టర్స్ మీద కలెక్షన్స్ వేయకండి

Viswam OTT : సడెన్ గా ఓటీటీలోకి గోపిచంద్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Pushpa 2 First Review: ‘పుష్ప 2’ రివ్యూ.. యాక్షన్ సీన్స్ లో అల్లు అర్జున్ అదరగొట్టాడు.. నీయవ్వ తగ్గేదేలే..

Vettaiyan Collections : బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న వేట్టయాన్ కలెక్షన్స్… ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

Anant Ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ డాక్యుమెంటరీ వచ్చేసింది.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

Nara Rohith – sirisha : నారా రోహిత్ కు కాబోయే భార్య ఆ కమెడియన్ డైరెక్షన్ లో నటించారా?

Big Stories

×