EPAPER

Kanguva: సూర్యతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తున్న మెగా హీరో

Kanguva: సూర్యతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తున్న మెగా హీరో

Kanguva: తెలుగు ప్రేక్షకులు సినిమాలను కానీ సినిమా హీరోలను గాని ఎంతగా ప్రేమిస్తారు అని ప్రతిసారి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వాళ్లకు ఒక సినిమా నచ్చితే దానిని నెత్తిన పెట్టుకొని మరి బ్రహ్మరథం పడతారు. నచ్చకపోతే ఆ సినిమాను పట్టించుకోరు ఇంకా ట్రోల్ చేస్తారని కూడా చెప్పొచ్చు. చాలామంది తెలుగు ప్రేక్షకులు కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని భాషలు అర్థం కాకపోయినా కూడా సబ్ టైటిల్స్ పెట్టుకొని మరి మిగతా లాంగ్వేజ్ లో సినిమాలు చూసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అందుకని సోషల్ మీడియా వేదికల్లో చాలా తమిళ సినిమాలు, చాలా మలయాళం సినిమాలు హైలైట్ అవుతుంటాయి. రీసెంట్గా మలయాళం సినిమాలను హైదరాబాద్ థియేటర్స్ లో కూడా చూడటం జరుగుతుంది.


అయితే మన తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధిస్తున్నాయి కానీ ఒకప్పుడు తమిళ్లో రిలీజ్ అయిన దాఖలాలు కూడా చాలా తక్కువ. కానీ చాలా తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ రిలీజ్ అయ్యాయి. కమలహాసన్ రజినీకాంత్ విశాల్ విక్రమ్ సూర్య వంటి అందరూ హీరోలు సినిమాలకు ఇక్కడ తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇంక సూర్యకి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామందికి సూర్య తమిళ్ హీరో అని కూడా తెలియదు అంతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిపోయాడు సూర్య. ఇక ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో కంగువ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. తెలుగులో బాహుబలి సినిమా ఏ రేంజ్ లో ఆడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తమిళ్లో ఇది బాహుబలి రేంజ్ సినిమా అని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతున్న సందర్భంగా ఈ సినిమా గురించి పది రకాల ప్రమోషన్స్ చేస్తుంది చిత్ర యూనిట్. అయితే మెగా హీరో  అల్లు శిరీష్ కూడా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సూర్యతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తున్నారు శిరీష్. శిరీష్ సినిమాకి ఎంత వాల్యూ ఇస్తాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి సినిమా వస్తే దానిని ప్రేక్షకులు వద్దకు తీసుకువెళ్లడానికి రానా శిరీష్ వంటి హీరోలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంటూనే ఉన్నారు. త్వరలో ఈ వీడియో రిలీజ్ కానుంది. ఇంటర్వ్యూ కోసం చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఇక కంగువ విషయానికొస్తే రీసెంట్ ఇంటర్వ్యూస్ లో ఈ సినిమాకు 1000 కోట్లు వస్తుందని యాంకర్ అడిగినప్పుడు 2400 కోట్లు కూడా వచ్చే అవకాశం ఉంది అని నిర్మాత జ్ఞానవేల్ రాజా చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు చూడని విధంగా ఈ సినిమా ఉండబోతుంది అని, ఈ సినిమా కోసం ఒక సరికొత్త ప్రపంచాన్ని దర్శకుడు క్రియేట్ చేశాడు అంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు జ్ఞానవేల్. ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుంది అని రిలీజ్ తర్వాత తెలియనందుకు.


Related News

35 chinna katha kaadu: అరుదైన గౌరవం అందుకున్న 35 చిన్న కథ కాదు..!

Pragathi: ఆ నటుడు అసభ్యకరంగా తాకాడు.. ప్రగతి ఎమోషనల్ కామెంట్స్..!

Ustaad Bhagat Singh: తేరి రీమేక్ కాదు.. ఆ పోలికలు ఉండటం వల్లే మిస్ కమ్యునికేషన్

Unstoppable With NBK : అప్పుడు పవన్ కళ్యాణ్ కి ప్లే చేసిన స్ట్రాటజీ ఇప్పుడు సిబిఎన్ కు కూడా చేస్తుంది

Fauji Movie : భారీ ధరకు ‘ ఫౌజీ ‘ డిజిటల్ రైట్స్.. ఇది ప్రభాస్ రేంజ్.. !

5 Years Of Kaithi : సరిగ్గా ఐదేళ్ల క్రితం, లోకేష్ కనకరాజ్ అంటే ఏంటో తెలిసి వచ్చింది

Big Stories

×