Kanguva : తమిళ స్టార్ హీరో సూర్య ( Suriya ) నటించిన లేటెస్ట్ మూవీ కంగువ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మాస్ యాక్షన్ కథతో రాబోతున్న ఈ మూవీ కోసం తమిళ ఫ్యాన్స్ తో పాటుగా తెలుగు ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. మొన్న విడుదల చేసిన ట్రైలర్ కు జనాల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై ఒక బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా డైరెక్టర్ శివ ( Siva)గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త షికారు చేస్తుంది. సినిమాటోగ్రాఫర్ గా ఉన్న అతను డైరెక్టర్ అవ్వడంతో అతను తెలుగులో ఏవైనా సినిమాలకు డైరెక్టర్ గా పని చేసారా అని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఆయన తెలుగులో డైరెక్ట్ చేసిన సినిమాలేంటో ఒకసారి చూసేద్దాం.
ఇక కంగువ మూవీ నవంబర్ 14న పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ అవుతోంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో ఈ ఫాంటసీ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది.. ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహారిస్తున్న శివ తెలుగు లో కొన్ని సినిమాలు చేసాడు. డైరెక్టర్‌గా శివ కెరీర్ తెలుగు సినిమాలతోనే మొదలైంది. డైరెక్టర్ కావడానికంటే ముందు సినిమాటోగ్రాఫర్‌గా కూడా కొన్ని తెలుగు సినిమాలకు శివ పనిచేశారు. నాగార్జున నేనున్నానుతో టాలీవుడ్‌లోకి సినిమాటోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. గోపీచంద్ హీరోగా 2008 లో వచ్చిన శౌర్యం మూవీతో శివ దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత ఏడాది మరోసారి గోపీచంద్‌తోనే శంఖం మూవీని తెరకెక్కించాడు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు యాక్షన్ సన్నివేశాలతో ఉన్న మూవీలలో శౌర్యం ఓ మాదిరిగా పర్వాలేదనిపించింది. ఆ తర్వాత తెలుగులో ఈయన పెద్దగా సినిమాలు తియ్యలేదు. ఇప్పుడు కంగువ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు..
కొంతకాలం గ్యాప్ తీసుకొని గోపీచంద్ సినిమాల తర్వాత రవితేజతో దరువు సినిమా చేశాడు శివ. యముడి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ కామెడీ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రవితేజ కామెడీ టైమింగ్ బాగున్నా కాన్సెప్ట్ ఔట్‌డేటెడ్ కావడంతో హిట్ అవ్వలేక పోయింది. విక్రమార్కుడు సినిమాను తమిళంలో రిమేక్ చేశారు. అంటే ఈ డైరెక్టర్ కు తెలుగులో సినిమాలు హిట్ అవ్వలేదు. ఇక కంగువ మూవీలో సూర్య డ్యూయల్ రోల్‌లో కనిపించాడు. పోరాటయోధుడైన గిరిజన తెగ నాయకుడిగా, ఫ్రాన్సిస్ అనే ఆధునిక యువకుడిగా కనిపించాడు. దిశా పటానీ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో యానిమల్ ఫేమ్ బాబీడియోల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఇక కార్తీ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలైన అన్ని పోస్టర్స్ ఈ మూవీ పై హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. భారీ బడ్జెట్ తో పాటుగా అదిరిపోయే యాక్షన్స్ తో రాబోతున్న సినిమా కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా డైరెక్టర్ శివ కు ఎలాంటి హిట్ టాక్ ను అందిస్తుందో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా హిట్ అయితే లైన్లో చాలా సినిమాలు ఉన్నాయి. చూడాలి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో..