EPAPER

Kangana Ranaut: కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేదు, ఒక్కదాన్నే పోరాడుతున్నాను.. కంగనా రనౌత్ ఎమోషనల్

Kangana Ranaut: కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేదు, ఒక్కదాన్నే పోరాడుతున్నాను.. కంగనా రనౌత్ ఎమోషనల్

Kangana Ranaut About Emergency Release: బాలీవుడ్ అంతా ఒకవైపు ఉంటే.. తాను మాత్రమే ఒకవైపు ఉంటానంటూ తన రూటే సెపరేట్ అంటుంది కంగనా రనౌత్. అందుకే తనను బాలీవుడ్ క్వీన్ అని కూడా పిలుచుకుంటారు. తన యాటిట్యూడ్ అసలు నచ్చనివాళ్లు ఉన్నా నచ్చినవాళ్లు కూడా చాలామందే ఉంటారు. ప్రస్తుతం కంగనా రనౌత్ చేతిలో పెద్దగా సినిమాలు ఏమీ లేవు. తను డైరెక్ట్ చేస్తూ నటించిన ‘ఎమర్జెన్సీ’ మాత్రమే షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యి చాలాకాలమే అయినా ఇంకా విడుదల కాకపోవడానికి కారణాలేంటో తన స్టైల్‌లో బయటపెట్టింది కంగనా.


ఆ సినిమాలతో పోలిక

‘‘ఇలా ఇంతకు ముందు కూడా జరిగింది. పద్మావత్, ఉడ్తా పంజాబ్ లాంటి సినిమాలు కూడా ప్రశాంతంగా రిలీజ్ అయిపోయాయి. ఆ సినిమాలు విడుదల చేస్తే ముక్కు కోసేస్తాం, గొంతు కోసేస్తాం అని బెదిరింపులు వచ్చినా ప్రభుత్వమే వాటిని రక్షణ కల్పించి విడుదల చేసింది. కానీ నా సినిమా విడుదల విషయానికి వచ్చేసరికి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి గానీ, సినీ పరిశ్రమ నుండి గానీ ఎవరూ సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు. నేను ఒక్కదాన్నే పోరాడుతున్నాను అనిపిస్తోంది. ఇలాంటి మనుషుల ప్రవర్తన చూస్తుంటే నాకు ఇంక వారిపై ఎలాంటి నమ్మకం ఉంటుంది?’’ అంటూ ‘ఎమర్జెన్సీ’ మూవీ రిలీజ్‌కు ఎవరూ సపోర్ట్ చేయడం లేదని వాపోయింది కంగనా రనౌత్.


Also Read: సైఫ్ ఆలీఖాన్ ప్రభాస్ సినిమానే లెక్క చెయ్యలేదు, దీనికంటే అవమానం ఏముంది.?

ఒంటరి అయిపోయాను

‘‘నేను కష్టపడి డబ్బులు కూడబెట్టి తెరకెక్కించిన సినిమా విడుదల అవ్వడం లేదని ఇప్పుడు బాలీవుడ్ అంతా సెలబ్రేట్ చేసుకుంటోంది. ప్రపంచంలోనే ఒంటరి అయిపోయానేమో అనిపిస్తోంది’’ అని బాధపడింది కంగనా రనౌత్. ‘ఎమర్జెన్సీ’ మూవీలో కంగనా.. ఇందిరా గాంధీ పాత్రలో నటించింది. ఇందిరా గాంధీలాగా కనిపించడం మాత్రమే కాదు.. అలా ఉండడం కోసం, మాట్లాడడం కోసం తాను ఎంతో కష్టపడింది కూడా. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చి దాదాపు రెండేళ్లు అయ్యింది. షూటింగ్ కూడా ఆలస్యమవుతూ వచ్చింది. మొత్తానికి షూటింగ్ పూర్తయినా కూడా మూవీని విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో కంగనాతో పాటు టీమ్ అంతా ఆందోళనలో ఉంది.

సెన్సార్ బోర్డ్ అడ్డు

ప్రముఖ రాజకీయ నాయకురాలు ఇందిరా గాంధీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో ‘ఎమర్జెన్సీ’ చుట్టూ పొలిటికల్ కాంట్రవర్సీలు చాలానే జరుగుతున్నాయి. అందుకే ఈ మూవీ విడుదల చేయడానికి చాలామంది రాజకీయ నాయకులు ఒప్పుకోవడం లేదు. ఈ విషయాన్ని కంగనా ఓపెన్‌గానే చెప్పేసింది. సెప్టెంబర్ 6న ‘ఎమర్జెన్సీ’ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ఈ సినిమాలో సిక్కులను నెగిటివ్‌గా చూపించారంటూ కొన్ని గ్రూప్స్.. దీని విడుదలను అడ్డుకున్నాయి. సెన్సార్ బోర్డ్ కూడా మూవీ అభ్యంతరకరంగా ఉందంటూ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. దీంతో సెన్సార్ బోర్డ్‌పై కూడా అసహనం వ్యక్తం చేసింది కంగనా రనౌత్.

Related News

Jayam Ravi: రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ కోలీవుడ్ హీరో.. అందుకే విడాకులా..?

Sharwa38 : ఛార్మింగ్ హీరో తో మాస్ డైరక్టర్, ఆ జోనర్ లో సినిమా అంటే కొంచెం రిస్కే

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Pawan Kalyan : నిర్మాతలకు పవన్ కళ్యాణ్ షాక్.. ఇలా చేస్తారని అనుకోలేదు డిప్యూటీ సీఏం సార్..

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Pushpa 2 : అక్టోబరే డెడ్ లైన్… ఇక చరణ్ తో తాడో పేడో..

Big Stories

×