EPAPER

Kamal Haasan: నిత్య విద్యార్థినంటున్న కమల్ హాసన్.. అతను చేసిన పనికి ఇండస్ట్రీ షాక్

Kamal Haasan: నిత్య విద్యార్థినంటున్న కమల్ హాసన్.. అతను చేసిన పనికి ఇండస్ట్రీ షాక్

Kamal haasan like student learning AI technology in US: లోక నాయకుడా.. అని దశావతారంలో పాటకు అసలైన నిర్వచనం కమల్ హాసన్. భారతదేశంలో పుట్టిన అతి కొద్దిమంది నటులలో అతను ఒకడు. ఒక నటుడిగా కమల్ చేసిన ప్రయోగాలు ఏ ఒక్కరూ చేయలేదని అంటారు. విచిత్ర సోదరులు మూవీలో మరుగుజ్జు అప్పూ గా, గుణ మూవీలో డీ గ్లామర్ పాత్రలో.. దశావతారం మూవీలో పది గెటప్పులు, ఇంద్రుడు చంద్రుడు మూవీలో పొలిటికల్ లీడర్ గా, స్వాతిముత్యం మూవీలో మానసికంగా ఎదగని యువకునిగా, సాగరసంగమం మూవీలో శాస్త్రీయ నృత్య కళాకారుడిగా ఇలా మరపురాని పాత్రలు ఎన్నో చేశారు కమల్ హాసన్. రీసెంట్ గా భారతీయుడు 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కొరియోగ్రాఫర్ గా కెరీర్ ఆరంభించారు. తర్వాత నటనవైపు తన కెరీర్ ని మలుచుకున్నారు. దాదాపు 19 ఫిలింఫేర్ అవార్డులు, నాలుగు జాతీయ పురస్కారాలను అందుకున్న నటుడు. ఇటీవలే తన సినిమా కెరీర్ లో 64 సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు. ఇలా ఆరు దశాబ్దాలుగా నటుడిగా చెరగని ముద్ర వేశారు కమల్ హాసన్. దక్షిణిది, ఉత్తరాది అనే తేడా లేకుండా విదేశాలలోనూ కమల్ హాసన్ కు వీరాభిమానులు ఉన్నారు. రీసెంట్ గా కల్కి మూవీలో ప్రతినాయకుడి పాత్రలో నటించారు కమల్ హాసన్. కల్కి సీక్వెల్ మూవీలో కమల్ హాసన్ కు పూర్తి స్థాయి నిడివి ఉంటుందని అంతా భావిస్తున్నారు. ప్రభాస్ కు ధీటుగా విలన్ పాత్రలో తనదైన నటనతో కమల్ మెప్పించనున్నారు.


థగ్ లైఫ్ లో..

కమల్ హాసన్ త్వరలో మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న థగ్ లైఫ్ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీని మణిరత్నం పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందించనున్నారు. రీసెంట్ గా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మణిరత్నం కొంతకాలంగా సరైన సినిమాలు తీయడం లేదని అన్నవాళ్లకు సరైన జవాబు తన పొన్నియన్ సెల్వన్ ద్వారా ఇచ్చారు. ఇప్పుడు అదే క్రేజ్ తో మణిరత్నం థగ్ లైఫ్ మూవీని రూపొందిచబోతున్నారు. అయితే ఈ మూవీకి అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక అంశాలు ఉండబోతున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా ఈ మూవీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు.


ఏఐ టెక్నాలజీ

ఇటీవల తమిళ హీరో విజయ్ దళపతి నటించిన గోట్ మూవీలో ఏఐ టెక్నాలజీతో చనిపోయిన విజయ్ కాంత్ ను తెరపై చూపించారు. ఆ టెక్నాలజీ ప్రేక్షకులకు బాగానే నచ్చింది. మణిరత్నం ఇప్పుడు తన లేటెస్ట్ మూవీకి ఇదే కాన్సెప్ట్ ఉపయోగించనున్నారు. అయితే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసే కమల్ హాసన్ ఈ సినిమాకు రూపొందించే ఏఐ టెక్నాలజీనీ తాను కూడా స్టడీ చేయాలని నిశ్చయించుకున్నారట. అందుకోసం ఈ ఆరుపదుల వయసులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో చేరి నేర్చుకోవాలని భావిస్తున్నారు.

నిత్య విద్యార్థి

ఇందుకు సంబంధించి అమెరికాలో ఓ ప్రఖ్యాత యూనివర్సిటీలో సాధారణ స్టూడెంట్ గా చేరి పర్ఫెక్ట్ గా ఆ కోర్సును ఆమూలాగ్రం పరిశోధించనున్నారు. షార్ట్ టెర్మ్ కోర్సుగా శిక్షణ ఇస్తున్నారక్కడ. అయితే కమల్ లో నేర్చుకోవాలనే తపన, ఇంట్రెస్ట్ చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు ఈ వయసులో నటించడమే గొప్ప అనుకుంటే సాంకేతిక అంశాలను నేర్చుకోవడానికి విద్యార్థిగా యూనివర్సిటీకి వెళ్లి నేర్చుకోవడం అంటే మాటలు కాదు. కమల్ హాసన్ ఓపికకు, ఆయన అంకిత భావానికి అంతా ఫిదా అవుతున్నారు.

Related News

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Kanguva Release Date: అక్టోబర్ నుంచి నవంబర్ కి, కంగువ డేట్ మారింది అరాచకం మాత్రం మారదు

Johnny Master arrest: పోలీసులకు చిక్కిన జానీ మాస్టార్, హైదరాబాద్‌‌కు తరలింపు

Ram Charan’s RC16 : బుచ్చిబాబు మాస్ ప్లాన్… రామ్ చరణ్ కోసం తంగలాన్ టీం..

Jani Master: జానీ మాస్టర్‌కు ఎన్నేళ్లు శిక్ష పడుతుందో తెలుసా?

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

Big Stories

×