EPAPER

kamal haasan birthday special : నట విశ్వరూపం.. యూనివర్సల్ హీరో కమల్ హాసన్..

kamal haasan birthday special : నట విశ్వరూపం.. యూనివర్సల్ హీరో కమల్ హాసన్..

kamal haasan birthday special : విభిన్నమైన పాత్రలో నటించి ప్రయోగాత్మకమైన చిత్రాలు చేసి లోక నాయకుడిగా పేరు తెచ్చుకున్న హీరో కమల్ హాసన్. ఆరుపదుల వయసుల దాటినా కూడా కుర్ర హీరోలకు దీటుగా నటించగలను అని విక్రమ్ చిత్రంతో ఆయన లేటెస్ట్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక భారతీయుడు -2గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. విలక్షణమైన నటనతోపాటు తాను చేసే ప్రతి క్యారెక్టర్ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తాడు. కాబట్టే ఈరోజు కమల్ హాసన్ ఈ స్టేజ్ కి చేరుకోగలిగారు.


వెండి తెరపై ఆయన విశ్వరూపం.. దశావతారంలాగా వ్యాపించి ఉంది. అందుకే స్క్రీన్ ప్లే రైటర్ గా , నిర్మాతగా, దర్శకుడిగా , యాక్టర్ గా వెండితెరపై చెరగని ముద్ర వేశాడు ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘మరోచరిత్ర’, ‘స్వాతిముత్యం’, ‘సాగర సంగమం’, ‘శుభ సంకల్పం’.. లాంటి ఎన్నో ఆణిముత్యాల వంటి చిత్రాలను కమల్ మనకు అందించాడు. కమల్ నటించిన ప్రతి ఒక్క చిత్రం మాస్టర్ పీస్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 ‘కలత్తూర్ కన్నమ్మ’ అనే సినిమాతో నటుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కమల్ హాసన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. బాల నటుడిగా ఎందరో తమిళ్ అగ్ర హీరోలతో నటించి ఆ తరువాత డాన్స్ డైరెక్టర్ కమ్ ఫైటర్ గా కూడా పనిచేశాడు. 1974 లో వచ్చిన మలయాళం మూవీ కన్యాకుమారీ కమల్ ను సక్సెస్ ఫుల్ హీరోను చేసింది.


ఇక ఆ తర్వాత తమిళ్, తెలుగు, హిందీ భాషా బేధం లేకుండా హీరోగా ఇప్పటికీ సత్తా చాటుతూనే ఉన్నారు. కమల్ యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుంది అంటే ఏదైనా క్యారెక్టర్ కమల్ చేస్తే అందులో ఆ క్యారెక్టర్ కనిపిస్తుందే తప్ప కమల్ హాసన్ అనే నటుడు ఎక్కడా కనిపించడు. ఏదైన పాత్రను మానసికంగా, శారీరకంగా బాగా స్టడీ చేసి నటించడంలో దిట్ట కాబట్టే లోక నాయకుడు అయ్యాడు.

ఒక తమిళ్ యాక్టర్ అయ్యి కూడా తెలుగులో మూడు నంది అవార్డులను అందుకున్న వ్యక్తి గా కమల్ రికార్డ్ సృష్టించాడు. ఇక హిందీలో కూడా ‘ఏక్ దూజే కే లియే’, ‘గిరఫ్తార్’ ‘రాజ్ తిలక్’ వంటి మూవీస్ లో నటించి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన నటుడు కమల్. ఇక అవార్డ్ ల విషయంలో కూడా కమల్ సూపర్.. మూడు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.

నవంబర్ 7, 1954లో తమిళనాడుకు చెందిన, రామనాథపురం జిల్లా పరమకుడిలో కమల్ జన్మించారు. అతడు బాల నటుడిగా నటించిన మొదటి మూవీ ‘కలత్తూర్ కన్నమ్మ’ కు జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటుడి అవార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.1988లో సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో వచ్చిన మూకీ మూవీ పుష్పక విమానం లో కమల్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇక నాయకుడు మూవీలో కమల్ తన నట విశ్వ రూపం చూపించాడు.ఈ మూవీలో అన్ని వయసుల పాత్రలను పోషించి యూనివర్శల్ యాక్టర్ గా గుర్తింపు పొందాడు. అందుకే టైమ్ మాగ్జైన్ ఈ మూవీ ‘ఆల్ టైం బెస్ట్’ హండ్రెడ్ మూవీల్లో ఒకటిగా గుర్తించింది. అయితే ఎన్ని సాధించిన కమల్ కెరియర్ లో మాత్రం ‘మరుదనాయగం’తీరని కోరికగా మిగిలిపోయింది. మర్మయోగిగా ప్రేక్షకుల ముందుకు రావాలి అన్న కమల్ తపన ఇంకా ప్రయత్నంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం కమల్ తమిళ్ బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

Related News

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Sekhar Bhashaa : జానీ మాస్టర్ కేసు పై సంచలన నిజాలను బయట పెట్టిన శేఖర్ భాషా..?

Prakash Raj: తిరుపతి లడ్డూ వివాదం.. పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

Tripti dimri: ఒకే గదిలో 50 మందితో.. భరించలేకపోయా – నేషనల్ క్రష్..!

Jani Master : జానీ మాస్టర్ దొరికిన హోటల్ ఎంత గ్రాండ్ గా ఉందొ చూసారా.?

Big Stories

×