E-Paper
Advertisement

Balayya Song :మ‌ళ్లీ బాల‌య్య సాంగ్‌ని రీమేక్స్ చేసిన క‌ళ్యాణ్ రామ్‌

Balayya Song :మ‌ళ్లీ బాల‌య్య సాంగ్‌ని రీమేక్స్ చేసిన క‌ళ్యాణ్ రామ్‌
Advertisement

Balayya Song: సీనియ‌ర్ హీరోల సాంగ్స్‌ని వారి నెక్ట్స్ జ‌నరేష‌న్ హీరోస్ రీమిక్స్ చేయ‌టం కొత్తేమీ కాదు.. అందులో త‌ప్పు కూడా లేదు. ఇప్పుడు అదే బాట‌లో ఉన్నారు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయ‌న త‌న బాబాయ్ నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలో సాంగ్‌ను రీమిక్స్ చేశారు. ఇంత‌కీ ఏ సాంగ్‌ను, ఏ సినిమా కోసం రీమిక్స్ చేశార‌ని అనుకుంటున్నారా! వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం అమిగోస్‌. ఇందులో ఆయ‌న ఏకంగా మూడు పాత్ర‌ల్లో మెప్పించడానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 17న రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే టీజ‌ర్‌, ఓ సాంగ్ విడుద‌లైంది. కాగా.. ఇప్పుడు మ‌రో సాంగ్‌ను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ సిద్ధ‌మ‌య్యారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈ పాట బాల‌కృష్ణ సినిమాలోని పాట‌కు రీమిక్స్‌.. బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ధ‌ర్మ‌క్షేత్రం సినిమాలో ఎన్నో రాత్రులొస్తాయి గానీ.. అనే పాట ఎంత పెద్ద హిట్టో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ పాట‌ను ఇప్పుడు అమిగోస్ సినిమాలో రీమిక్స్ చేశారు ఆ పాట‌ను జ‌న‌వ‌రి 29న విడుద‌ల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న శాండిల్ వుడ్ బ్యూటీ ఆషికా రంగ‌నాథ్ న‌టిస్తుంది. బాలకృష్ణ సాంగ్స్‌ను రీమిక్స్ చేయ‌టం క‌ళ్యాణ్ రామ్‌కి కొత్తేమీ కాదు.. ఇంత‌కు ముందు ప‌టాస్ చిత్రంలో రౌడీ ఇన్సెప్టెక‌ర్ చిత్రంలోని హ‌రి ఓ సాంబ.. సాంగ్‌ను రీమిక్స్ చేశారు. ఇప్పుడు మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ సాంగ్‌ను రీమిక్స్ చేశారు.

Advertisement

Link – https://twitter.com/MythriOfficial/status/1618574341020749827?s=20&t=jsZ-xMvcNTnoKkq6AF64Iw

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×