EPAPER
Kirrak Couples Episode 1

Kalki 2898AD: మళ్లీ వివాదంలో చిక్కుకున్న కల్కి.. గరికపాటి చురకలు..!

Kalki 2898AD: మళ్లీ వివాదంలో చిక్కుకున్న కల్కి.. గరికపాటి చురకలు..!

Kalki 2898AD.. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ) కెరియర్ లో బాహుబలి (Bahubali ) సినిమా తర్వాత హైయెస్ట్ కలెక్షన్స్ వసూల్ చేసిన చిత్రంగా కల్కి 2898AD (Kalki 2898AD)చిత్రం నిలిచింది .రూ.700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూల్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు ప్రభాస్ సెట్ చేసిన ఈ రికార్డు ఇప్పట్లో ఏ హీరో కూడా అందుకునేలా కనిపించడం లేదు అనడంలో సందేహం లేదు. తన అద్భుతమైన నటనతో పెర్ఫార్మెన్స్ తో మరొకసారి తనను తాను నిరూపించుకున్నారు ప్రభాస్. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాలతో మంచి ఇమేజ్ దక్కించుకున్న ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నారు. ఇక సీనియర్ నిర్మాత అశ్వినీ దత్, ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఆయన కూతుర్లు స్వప్నా దత్ , ప్రియాంక దత్ కలిసి నిర్మించారు.


కల్కి మూవీ కథపై గరికపాటి ఆగ్రహం..

Kalki 2898AD: Kalki caught in controversy again.. Garikapati Churakulu..!
Kalki 2898AD: Kalki caught in controversy again.. Garikapati Churakulu..!

బాక్సాఫీస్ హిట్ మూవీగా రికార్డ్ సృష్టించిన ఈ సినిమాపై ఇప్పుడు ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు (Garikapati Narasimharao) ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాభారత నేపథ్యంలో ప్రభాస్ హీరోగా కమల్ హాసన్ , అమితాబ్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రంలో కర్ణుడు , అశ్వద్ధామ పాత్రలను తప్పుగా చూపించారు అని, మహాభారతం లోని పవిత్రమైన ఘట్టాన్ని వక్రీకరించారు అంటూ ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా భారతంలో ఉన్నది వేరు.. సినిమాలో తీసింది వేరు.. ముఖ్యంగా ఈ సినిమాతో ఇప్పటికిప్పుడు కర్ణుడు, అశ్వద్ధామ హీరోలు అయిపోయారు. భీముడు , కృష్ణుడు విలన్లు అయ్యారు. “ఆలస్యం అయ్యిందా..? ఆచార్యపుత్ర” అనే ఒక డైలాగ్ రాశారు కదా.. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తే ఏది పడితే అది రాసే వాళ్ళు ఉన్నారు.. అసలు భారతం లో కర్ణుడు ఎప్పుడూ కూడా అశ్వద్ధామను కాపాడలేదు. అశ్వద్ధామే కర్ణుడిని కాపాడతాడు. ఆయన మహావీరుడు అంటూ కల్కి చిత్ర కథను తప్పుపట్టారు అంటూ గరికపాటి తెలియజేశారు.


నెటిజన్స్ కూడా కామెంట్స్..

మొత్తానికి అయితే మహాభారతంలో ఒక ఘట్టాన్ని తప్పుగా వక్రీకరించి చూపించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది విన్న నెటిజన్స్ కూడా తమ అభిప్రాయాలను ఈ విధంగా కామెంట్ చేశారు. రాబోయే తరాలకు మహాభారతం యొక్క విలువ తెలియాలి అని, అయితే ఇలాంటి సినిమాల వల్ల ఆ ఎఫెక్ట్ పిల్లల భవిష్యత్తుపై , వారి ఆలోచన విధానం పై పడుతుంది అంటూ కూడా తెలిపినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా ఒక ఫిక్షన్ అని స్పష్టం చేశారు. కల్కి సినిమా మూడు వేరువేరు ప్రపంచాల మధ్య తిరిగే కథ అని గతంలోని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ప్రపంచంలో తొలి నగరంగా కాశీ ఉద్భవించింది. అయితే కలియుగం అంతమయ్యే సమయంలో కూడా చివరి నగరంగా కాశీ నే చూపించారు. మొత్తానికైతే గరికపాటి చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Related News

Viswam : గోపీచంద్ ఫ్యాన్స్ కు షాక్… విశ్వం స్టోరీ లీక్, హీరో రోల్ ఇదే?

Oscar 2025 : అఫిషియల్ గా ఆస్కార్ బరిలోకి అడుగు పెట్టిన “లాపతా లేడిస్”

Rajinikanth Coolie: తెలుగులో భారీ బిజినెస్.. థియేట్రికల్ రైట్స్ వారి సొంతం..!

Jani Master Issue : జానీ మాస్టర్ ఇష్యూ.. అల్లు అర్జున్ స్పందనపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత రవిశంకర్

Viswam : గోపీచంద్ కు 6 కోట్లా… మార్కెట్‌కి మించి రిస్క్ చేస్తున్నారా?

SSMB29 : మహేష్ బాబు మామూలుగా లేడు, లుక్కు చూస్తే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోతాయి

Big Stories

×