EPAPER

Kalki 2898 AD: బాలీవుడ్ క్రిటిక్స్‌పై పరువు నష్టం దావా వేసిన కల్కి టీం..! కారణం ఇదే..?

Kalki 2898 AD: బాలీవుడ్ క్రిటిక్స్‌పై పరువు నష్టం దావా వేసిన కల్కి టీం..! కారణం ఇదే..?

Kalki 2898 AD: టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఓ రేంజ్‌లో ఉంది. బాలీవుడ్‌ని సైతం వెనక్కి నెట్టి ముందుకు దూసుకుపోతోంది. దీనికి కారణం బాహుబలి మూవీ. ఈ ‘బాహుబలి’తో టాలీవుడ్ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన రెస్పాన్‌తో చాలామంది నోర్లు మూతపడ్డాయి. అందులో బాలీవుడ్ ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు టాలీవుడ్ అంటే అందరికీ చిన్న చూపే. అందులోనూ బాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు మరీ తక్కువ చేసి చూసేవారు.


కానీ బాహుబలితో టాలీవుడ్‌ రేంజ్ పెరగడం.. అదే సమయంలో బాలీవుడ్ పతనం మొదలైందని చెప్పుకోవాలి. అప్పట్నుంచి టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలు ఒక్కొక్కటి భారీ స్థాయిలో హిట్ టాక్‌ను అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించాయి. కానీ బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలేవి పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. ఇక బాహుబలి 1, 2తో తెలుగు సినిమా కీర్తి పెరిగిపోయింది. దీంతో ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు బాలీవుడ్ క్రిటిక్స్ ఏదో ఒక ఫేక్ రూమర్స్‌తో ప్రభాస్ సినిమాలపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభాస్ సినిమాలను విమర్శించే పనిగా పెట్టుకున్నారు.

Also Read: కల్కిపై వెంకయ్య నాయుడు ప్రశంసలు..


ఇక ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ సినిమా పై పడ్డారు. జూన్ 27న గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఏకంగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసి ఇప్పుడు రూ.1100 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. దీంతో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. బాహుబలి తర్వాత మరో కల్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా కల్కి అనే చెప్పాలి. ఇందులో ప్రభాస్ లుక్, యాక్షన్ సీన్లు సినీ ప్రియుల్ని కట్టి పడేశాయి. అతడి యాక్షన్ సన్నివేశాలకు చాలా మంది మంత్రముగ్దులయ్యారు.

ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకోవటంతో బాలీవుడ్ క్రిటిక్స్ చెలరేగిపోయారు. ప్రభాస్ సినిమాలను దేన్ని వదలని వారు.. ఇప్పుడు కల్కిపై కూడా పడ్డారు. కల్కి సినిమా రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తే.. అవి ఫేక్ వసూళ్లని సోషల్ మీడియా వేదికైన ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ చేశారు. దీంతో తమ సినిమాపై దుష్ప్రచారం చేస్తున్నవారిపై కల్కి నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్ ఫైర్ అయింది. ఇందులో భాగంగా ఫేక్ వసూళ్లని ట్వీట్స్ చేసిన సుమిత్ కడేల్, రోహిత్ జైశ్వాల్ అనే బాలీవుడ్ క్రిటిక్స్‌పై పరువునష్టం దావా వేసింది. కలెక్షన్లు ఫేక్ అని ఎవరు చెబితే ట్వీట్స్ చేశారు ? ఫేక్ అనడానికి గల ఆధారాలేంటి? అని చెప్పాలని.. లేకుండా రూ.25 కోట్లు ఇవ్వాలని వీరికి నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. దీంతో బాలీవుడ్ మాఫియాకు దెబ్బ మీద దెబ్బ పడినట్లు అయిందని చెప్పాలి. చూడాలి మరి ఇది ఎంతవరకు వెళ్తుందో.

Related News

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Big Stories

×