EPAPER
Kirrak Couples Episode 1

Kalki 2898 AD : రిలీజైన 5 నెలల తరువాత కల్కి ఖాతాలో అరుదైన ఘనత… ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో షోలు

Kalki 2898 AD : రిలీజైన 5 నెలల తరువాత కల్కి ఖాతాలో అరుదైన ఘనత… ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో షోలు

Kalki 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రిలీజైన 5 నెలల తరువాత అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కల్కి’ స్పెషల్ షోలు పడబోతున్నాయి. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.


బుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కల్కి’  

ఈ ఏడాది మే 9న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజై సంచలనం సృష్టించిన పాన్ ఇండియా మూవీ ‘కల్కి’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లు వసూలు చేసింది. ఆ తరువాత ఓటీటీలో కూడా అదరగొట్టింది ‘కల్కి’, తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రం బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇవ్వబోతోంది. ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అఫిషియల్ గా ఈ శుభవార్తని అభిమానులతో పంచుకుంది. మేకర్స్ క్యాప్షన్‌లో ‘కల్కి 2898 ఏడీ ప్రతిష్టాత్మక బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు సిద్ధంగా ఉందని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. అక్టోబర్ 8, 9 తేదీల్లో ఈ ఎపిక్ బ్లాక్ బస్టర్‌ స్పెషల్ స్క్రీనింగ్ జరనుంది’ అంటూ రాసుకొచ్చారు. దీంతో సదరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ‘కల్కి’ అదరగొట్టడం పక్కా అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజన్లు. కాగా బుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 అక్టోబర్ 2 నుండి ప్రారంభమై అక్టోబర్ 11 వరకు జరుగుతుంది.


సీక్వెల్ టైటిల్ ఇదేనా?

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించిన ‘కల్కి’ మూవీ శ్రీ మహా విష్ణువు 10వ అవతారమైన కల్కి జననం గురించి ఉంటుంది. ఇందులో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, కర్ణుడిగా, భైరవ అనే పాత్రలో ప్రభాస్ నటించారు. అలాగే కమల్ హాసన్ సర్వోన్నత శక్తి యాస్కిన్‌గా నటించాడు. ఈ విలన్ కల్కి పుట్టుకను ఆపడానికి ప్రయత్నిస్తాడు. కాగా కల్కి ఎవరు అన్న విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో పెట్టారు మేకర్స్. ఈ చిత్రంలో దిశా పటాని, పశుపతి, శోభన, అన్నా బెన్, బ్రహ్మానందం, ఎస్ఎస్ రాజమౌళి, విజయ్ దేవరకొండ, రామ్ గోపాల్ వర్మ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ అతిధి పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ స్వరాలు సమకుర్చారు .

‘కల్కి’ సీక్వెల్ విషయానికొస్తే మేకర్స్ ‘కల్కి 2’ షూటింగ్ ను 25 రోజుల పాటు ఇప్పటికే చిత్రీకరించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సమాచారం ప్రకారం ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ 2027 లో థియేటర్లలోకి వస్తుంది. అయితే గత కొంతకాలం నుంచి ‘కల్కి’ సీక్వెల్ టైటిల్ ఇదేనంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. బజ్ ప్రకారం సిక్వెల్ కు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్ ను పెట్టబోతున్నారని, సిక్వెల్ లో పురాణాల గురించి ఎక్కువగా ప్రస్తావన ఉంటుందని టాక్ నడుస్తోంది. కాగా ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, స్పిరిట్ వంటి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Related News

Kirak RP : ఆర్పీ ఫ్యామిలీపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు…

Devara: నిలబడింది తారక్ , కానీ నిలబెట్టింది అనిరుధ్

Devara 2 : దేవర పార్ట్ 2 తెరకెక్కితే ఇవి తెలియాలి

Rajamouli Sentiment : ఇంతకీ రాజమౌళి హీరో సెంటిమెంట్ బ్రేక్ అయిందా.?

Prithviraj : ఆ సినిమాకు ముందు నాకు అవకాశాలు లేవు, ప్రస్తుతం 23 సినిమాలు చేస్తున్నాను

Amaran: మేజర్ భార్యగా సాయి పల్లవి.. ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్..!

Koratala Siva: అసలు ఏమి స్కోప్ ఉందని “దేవర” పార్ట్ 2 అనౌన్స్ చేశారు

Big Stories

×