Ka Movie : టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ “క” (Ka Movie) ఈనెల 31న థియేటర్లలోకి రాబోతోంది. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు ఎగ్జిబిటర్లు హ్యాండ్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. మరి అదే నిజమైతే ఇప్పుడు డబ్బులు ఎలా? నిర్మాతలు నిండా మునిగినట్టేనా ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం “క” (Ka Movie) అనే సినిమాతో ఈ దీపావళికి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి తగ్గట్టుగానే జోరుగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఎగ్జిబిటర్లు హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి కారణం ఏంటంటే “క” మూవీకి కనీసం ఒక్కచోట కూడా థియేటర్లు ఫుల్ కాలేదు. సినిమా రిలీజ్ కు ఇంకా కేవలం మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమా కోసం 48 థియేటర్లను కేటాయించారు. అయితే బుక్ మై షో లో చూసుకుంటే ఒక్క థియేటర్ కూడా బుకింగ్స్ ఫుల్ అయినట్టుగా చూపించట్లేదు. దీంతో ఎగ్జిబిటర్లు హ్యాండ్ ఇచ్చారని, ఇదే కంటిన్యూ అయితే నిర్మాతలు నిండా మునిగినట్టేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నిజానికి ఈ సినిమాకు తెలుగు స్టేట్స్ లో 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కిరణ్ అబ్బవరం (Kian Abbavaram) లాంటి ఒక చిన్న హీరో సినిమాకి ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం అంటే అది చాలా పెద్ద విషయమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దీపావళి రేసులో దుల్కర్ సల్మాన్ లాంటి పాన్ ఇండియా హీరో మూవీ “లక్కీ భాస్కర్” రిలీజ్ కాబోతోంది. అసలే టాలీవుడ్లో దుల్కర్ సల్మాన్ కి కిరణ్ అబ్బవరం తో పోల్చుకుంటే భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇది చాలదు అన్నట్టు ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇలా ఓ బడా హీరోతో పోటీ పడడం అనేది కచ్చితంగా చిన్న సినిమాలకు నష్టాన్ని కలిగించే విషయమే. ఇక ఇదే ఓ పెద్ద సాహసం అనుకుంటే మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డట్టు “అమరన్” మూవీ కూడా దీపావళి బరిలో నిలిచింది. ఇక ఈ సినిమాలో శివ కార్తికేయన్ నటిస్తున్నాడు అనే టాక్ కంటే సాయి పల్లవి హీరోయిన్ అనే హైప్ ఎక్కువగా ఉంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య కిరణ్ అబ్బవరం నటించిన “క” మూవీ నలిగిపోతుంది.
ఈ ఎఫెక్ట్ కారణంగానే ప్రస్తుతం Ka Movie మూవీకి భారీగా ప్రమోషన్లు చేపట్టినప్పటికీ జనాలు కనీసం థియేటర్ల వైపు తొక్కి చూడట్లేదు. నిజానికి సినిమా చెయిన్ ను బట్టి చూసుకుంటే నిర్మాతలు సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లకు అంటే లోకల్ బయ్యర్లకి ఇస్తారు. థియేటర్లలో టికెట్స్ బుకింగ్స్ జరిగే దాన్నిబట్టి ఈ చెయిన్ లో రివర్స్ డబ్బులు చేతులు మారి నిర్మాతల జేబుల్లోకి వెళ్తాయి. కానీ ఇప్పుడు థియేటర్లలో బుకింగ్స్ నిల్ కాబట్టి నిర్మతలకు భారీ నష్టాలు తప్పేలా కనిపించట్లేదు. అదే ఈ మూవీకి 6 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగి ఉంటే నిర్మాతలు సేఫ్ అయ్యేవారేమో.