Ka Movie Bookings : ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కడ చూసినా కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గురించే చర్చ నడుస్తోంది. ఆయన హీరోగా నటించిన “క” (Ka Movie) అనే సస్పెన్స్ థ్రిల్లర్ అక్టోబర్ 31న దీపావళి కానుకగా థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో కిరణ్ అబ్బవరం చేసే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి తప్ప “క’ మూవీపై ఆ ఎఫెక్ట్ ఏమీ పెద్దగా కనిపించట్లేదు. ఫలితంగా థియేటర్లలో “క” మూవీ కూడా కనిపించట్లేదు.
పండగల సమయంలో ఒకేసారి ఎక్కువ సినిమాలు రిలీజ్ అయితే కచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఏదో ఒక సినిమాపై పడుతుంది. ఇప్పుడు దీపావళి కానుకగా రిలీజ్ కాబోతున్న సినిమాల విషయంలో కూడా ఇదే రూల్ వర్తించబోతోంది. అయితే ఆ ఎఫెక్ట్ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన “క” (Ka Movie) మూవీ పై పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ మూవీకి హైదరాబాదులో 48 థియేటర్లు కేటాయించినప్పటికీ, ఒక్కచోట కూడా ఇప్పటిదాకా థియేటర్లు ఫుల్ కాలేదు. బుక్ మై షో లో ఎక్కడ చూసినా సీట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. మూవీ రిలీజ్ కు ఇంకా ఎంతో టైం లేదు. అయినప్పటికీ కిరణ్ అబ్బవరం ప్రమోషన్ల కోసం తన వంతు చేస్తున్న ప్రయత్నాల్లో చేసే కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి తప్ప సినిమాపై ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయలేకపోతున్నాయి.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ పెయిడ్ ప్రీమియర్స్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈరోజు రాత్రి 7 గంటల టైంలో “క” (Ka Movie) మూవీకి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్లను వేయబోతున్నారు. అయితే ఇంత పోటీతో పాటు ఏమాత్రం బజ్ లేని ఈ సినిమాకు ముందుగానే పెయిడ్ ప్రీమియర్లు వేసి నిర్మాతలు బొక్క బోర్లా పడబోతున్నారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా రీసెంట్ గా “క” మూవీ ప్రమోషన్లలో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ ను మరోసారి గుర్తు చేస్తున్నారు నెటిజన్లు.
‘క’ మూవీ మీకు నచ్చకపోతే నేనే సినిమాలు చేయడం మానేస్తానంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశాడు కిరణ్ అబ్బవరం. అయితే ఇంత డేరింగ్ ఛాలెంజ్ చేసినప్పటికీ, రీసెంట్ గా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తనను కొందరు కావాలని టార్గెట్ చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేసినప్పటికీ సినిమాపై హైప్ పెంచడంలో అవి ఏమాత్రం ఉపయోగపడట్లేదు. వీటి కంటే రీసెంట్ గా రిలీజ్ అయిన “క” (Ka Movie) మూవీ ట్రైలర్ కొంతవరకు బజ్ క్రియేట్ చేయగలిగింది. మరి రిలీజ్ కి ముందే “క” టాక్ ఇలా ఉంటే రిలీజ్ అయ్యాక కిరణ్ అబ్బవరం పరిస్థితి ఏంటో…
ఒకవేళ నిజంగానే సినిమాపై ట్రోలింగ్ జరిగితే కిరణ్ అబ్బవరం చెప్పినట్టుగానే సినిమాలు చేయడం మానేస్తాడా? అనే టాక్ నడుస్తోంది ఇండస్ట్రీలో. మరి ఆయన ఈ సినిమాతో ట్రోలింగ్ కు గట్టిగా సమాధానం చెబుతాడా ? లేదంటే సైలెంట్ గా చెప్పినట్టుగానే ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటాడా అనేది చూడాలి. మొత్తానికి యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఆశలన్నీ ‘క’ (Ka Movie) మూవీపైనే పెట్టుకున్నాడు.