EPAPER

Moodagallu Temple Cave: కర్ణాటకలోని చిన్న పల్లెటూరులో జూ. ఎన్టీఆర్ వెళ్లిన గుడి ఇదే.. వామ్మో ఈ ఆలయానికి ఇంత స్పెషాలిటీ ఉందా..?

Moodagallu Temple Cave: కర్ణాటకలోని చిన్న పల్లెటూరులో జూ. ఎన్టీఆర్ వెళ్లిన గుడి ఇదే.. వామ్మో ఈ ఆలయానికి ఇంత స్పెషాలిటీ ఉందా..?

Jr. NTR Visits Keradi Moodagallu Keshavanatheshwara Temple cave: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పర్యటనలో ఉన్నారు. సినిమా ఈవెంట్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అనర్గళంగా కన్నడలో మాట్లాడి అక్కడికి వచ్చిన గెస్ట్ లను, ఆడియన్స్ ను ఎంతగానో అలరించారు. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతుంటే అంతా నివ్వెరపోయి అలాగే చూస్తూ ఉండిపోయారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిపై స్పందించిన ఆడియన్స్ అందుకే ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువ.. ఎంతైనా ఎన్టీఆర్ వారసుడు కదా అని ఒకరు.. జూ. ఎన్టీఆర్ టాలెంట్ వేరబ్బా అంటూ మరొకరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటకలోని ఓ మారుమూల గ్రామంలో ఉన్న ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఎన్టీఆర్ సందర్శించిన ఆ ఆలయం ప్రత్యేకత గురించి, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్టీఆర్ కు ఆ ఆలయం గురించి ఎలా తెలిసింది..? ఇలాంటి అంశాలు తెలుసుకునేందుకు నెటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు.


Jr. NTR
Jr. NTR

Also Read: పవన్ కల్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ బన్నీ ట్వీట్

అందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని కుందాపూర్ తాలూకా కెరడి గ్రామ పరిధిలో ఉన్న మూడగల్లు అనే చిన్న రిమోట్ విలేజ్ లో ఉన్నటువంటి కేశవనాథేశ్వర్ గుహ దేవాలయాన్ని జూనియర్ ఎన్టీఆర్ సందర్శించారు. గుహలోపల దాదాపు 50 అడుగుల దూరంలో నీటిలో ఉన్న శివుడిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రిషబ్ శెట్టి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఈ ఆలయాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆ ఆలయం గురించి తెలుసుకునేందుకు నెట్టింటా నెటిజన్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.


వాహ్.. గుహ లోపలో 50 అడుగుల దూరంలో.. అది కూడా నీటిలో కేశవనాథేశ్వర్ ఆలయం వెలిసిందా..?

ఈ ఆలయాన్ని కెరడి కేశవనాథేశ్వర్ ఆలయం అంటారు. కర్ణాటకలోని కుందాపూర్ నుంచి కొల్లూరు మీదుగా కెరడి చేరుకుని, అక్కడి నుంచి మూడగల్లు చేరుకుంటే ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇటు ఉడిపి నుంచి హలాడి మీదుగా కూడా కెరడి చేరుకుని, అటునుంచి మూడగల్లు వెళ్లవచ్చు. అయితే, ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయం చాలా పురాతనమైనదని చెబుతుంటారు. సహజంగా ఏర్పడినటువంటి గుహలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో ఉండే శేశవనాథేశ్వరుడిని దర్శించుకోవాలంటే గుహ లోపల దాదాపు 50 అడుగుల దూరం నీటిలో భక్తులు వెళ్లి దర్శించుకోవాల్సి ఉంటుంది. ఆ నీటిలో అనేక రకాల చేపలు ఉంటాయి. అవి ఎవరికీ ఏ హానీ చేయవని అక్కడున్న పూజారులు చెబుతుంటారు. అత్యంత మహా అద్భుతమేమంటే.. ఆ నీటిలోనే నిలబడి భగవంతుడిని దర్శించుకోవాల్సి ఉంటుందని, ఆ సమయంలో చేపలు పాదాలు ముద్దాడుతున్న అనుభవం మహా అద్భుతంగా ఉంటుందని చెబుతుంటారు.

Keshavanatheshwara Temple Cave
Keshavanatheshwara Temple Cave

Also Read: మోక్షజ్ఞ ఎంట్రీ షురూ.. త్వరలో ఫైనల్ కానున్న బాలయ్యవారసుడి మూవీ..

ఈ దేవాలయం ప్రకృతి అద్భుతానికి ప్రతీకగా ఉంటుంది. ఎటు చూసినా చుట్టూ పచ్చని చెట్లు, ఆహ్లాద వాతావరణం కనిపిస్తుంది. ఆ మూడగల్లు గ్రామంలో కొద్దిపాటి జన సంచారం మాత్రమే ఉంటుంది. ఊరు మధ్యలో ఈ ఆలయం కొలువుదీరి ఉంటుంది. కాగా, ఈ గుహ లోపల నుంచే శివుడు కాశీకి చేరుకున్నాడని భక్తుల విశ్వాసం. అంతేకాదు.. ఇక్కడ ఎంతోమంది మహర్షులు తపస్సు చేశారని చెబుతుంటారు. ఈ ఆలయానికి సమీపంలోనే మెల్య అనే సరస్సు అనుసంధానమై ఉంటుంది. ఈ సరస్సులో ఎల్ల అమావాస్య నాడు స్నానమాచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తుంటారంటా. అత్యంత మహాఅద్భుతమేమంటే.. ఎన్ని వానలు వచ్చినా, ఎంత వరదలు ఉప్పొంగినా కూడా ఆ ఆలయం చుట్టూ ఉన్న నీటి పరిమాణం ఏడాది పొడువునా ఒకేలా ఉంటుందంటా. అందుకే భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారని చెబుతుంటారు.

Moodagallu Temple
Moodagallu Temple

Related News

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Big Stories

×