EPAPER
Kirrak Couples Episode 1

Devara Review : దేవర మూవీ రివ్యూ

Devara Review : దేవర మూవీ రివ్యూ

Jr NTR’s Devara Review in Telugu : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సినిమా దేవర. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. త్రిబుల్ ఆర్ వంటి పాన్ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి ఈ సినిమా రావడం, అలానే ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఈ సినిమా చేయడంతో ఒక్కసారిగా ఈ సినిమా పైన అందరికీ క్యూరియాసిటీ పెరిగింది. దీనికి తోడు రాజమౌళి హీరోల సెంటిమెంట్ కూడా యాడ్ అయింది. కాగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం.


 

కథ:


సముద్రానికి చేరువుగా ఒక కొండ ప్రాంతంలో ఉండే ఒక నాలుగు గ్రామాలు. ఆ నాలుగు గ్రామాల్లో ఉండే నలుగురు ప్రముఖ వ్యక్తులు, సముద్ర మార్గం గుండా కొన్ని కొన్ని కంటైనర్లను అక్రమంగా తరలిస్తూ ఉంటారు. వాటిలో ఈ సమాజానికి హాని కలిగించే మారణాయుధాలు ఉన్నాయని వాళ్ళకి తెలియదు. అలా అక్రమంగా వాటిని తరలించడం వలన ఆ నాలుగు గ్రామాలకు జరిగిన విపత్తులేంటి.? అసలు కంటైనర్లను అలా అక్రమంగా తరలించవలసిన అవసరం ఏంటి.? వాళ్లు తరలిస్తున్న కంటైనర్లులో మారణాయుధాలు ఉన్నాయి అని తెలిసిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటి.? వీటిలో దేవర పాత్ర ఏంటి.? ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

విశ్లేషణ:

ముందుగా దర్శకుడు కొరటాల శివ ఈ కథను డిజైన్ చేసుకున్న విధానం, ఆ సినిమా బ్యాక్ డ్రాప్ అంతా బాగానే ఉంది కానీ అది పూర్తిస్థాయిలో ప్రేక్షకుడికి సంతృప్తి ఇవ్వలేదు. ఆచార్య సినిమా మినహాయిస్తే మామూలుగా కొరటాల శివ సినిమా అంటే సమాజానికి మెసేజ్ ఇవ్వడంతో పాటు కొన్ని హై వచ్చే సీన్స్ ఉంటాయి. మిర్చి సినిమాలో “వాళ్ల కొడుకు వచ్చాడు అని చెప్పు” అని ప్రభాస్ చెప్పినప్పుడు, శ్రీమంతుడు సినిమాలో “మీ అందరిని దత్తత తీసుకుంటున్నా” అని మహేష్ బాబు చెప్పినప్పుడు, జనతా గ్యారేజ్ లో కొన్ని సీన్స్, భరత్ అనే నేను సినిమాలో అంతఃకరణ శుద్ధితో అనే సీన్. ఇలాంటివన్నీ కూడా కొరటాల శివ రైటింగ్ లో ప్లస్ పాయింట్స్. ఇక ఈ సినిమాకి వస్తే అలాంటి సీన్స్ పెద్దగా అనిపించవు.

 

ఎన్టీఆర్ లాంటి ఒక హీరో దొరికినప్పుడు రైటింగ్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే సినిమా అంత బాగా వర్కౌట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఫస్టాఫ్ విషయానికి వస్తే కొరటాల కథను నడిపించిన విధానం, ఎన్టీఆర్ పర్ఫామెన్స్, ఇంటర్వెల్ సెటప్ ఇదంతా కూడా ఆడియన్ కి కొంతమేరకు పరవాలేదు అనిపిస్తుంది. ఇక సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే సినిమాను బాగా డ్రాగ్ చేసారని ఫీల్ రాక మానదు. మామూలుగా థియేటర్ నుంచి ఆడియన్ బయటకు వచ్చేటప్పుడు బాగా గుర్తుండేది క్లైమాక్స్, ఇక ఈ సినిమా విషయానికి వస్తే క్లైమాక్స్ కొంతమేరకు డిసప్పాయింట్ అనిపించింది. బాహుబలి క్లైమాక్స్ కూడా గుర్తొచ్చే అవకాశం ఉంది. ఇక దీనిని ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని వేచి చూడాలి.

 

కథానాయకుడు ఎన్టీఆర్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. తనకున్న పరిధిలో తన పాత్రకు 100% న్యాయం చేసాడు. ఎన్టీఆర్ నటన ప్రతిభ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఒక పాత్రలో ఎలా ఒదిగిపోవాలో ఎన్టీఆర్ కి తెలుసు. ఈ సినిమాలో జాన్వి కపూర్ చాలా అందంగా కనిపించడం మాత్రమే కాకుండా తన పర్ఫామెన్స్ తో తనకున్న పరిధిలో బాగానే ఆకట్టుకుంది. తెలుగు సినిమాలలో జాన్వికి మంచి కెరియర్ ఉంటుందని చెప్పొచ్చు.ఈ సినిమా మొత్తానికి అనిరుద్ రవిచంద్రన్ అందించిన సంగీతం మెయిన్ హైలెట్. ముఖ్యంగా కొన్ని సీన్స్ కు అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. తనకు అవకాశం ఉన్న ప్రతి చోట సీన్స్ ను తన మ్యూజిక్ తో ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు. రత్నవేలు ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. చాలా సీన్స్ రియల్ గా అనిపిస్తాయి. ప్రొడక్షన్ డిజైనర్ షాబు సిరిల్ కష్టం ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ సినిమా పార్ట్స్ పార్ట్స్ గా బాగుంటుంది కానీ, కంప్లీట్ గా మాట్లాడితే ఇట్స్ జస్ట్ ఒకే ఫిలిం.

 

ప్లస్ పాయింట్స్:

 

సినిమా ఫస్టాఫ్

ఎన్టీఆర్ పర్ఫామెన్స్

యాక్షన్ సీక్వెన్సెస్

రత్నవేలు ఫోటోగ్రఫీ

అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్

 

మైనస్ పాయింట్స్ :

 

డ్రాగ్ సెకండాఫ్

అన్ సాటిస్ఫైడ్ క్లైమాక్స్

 

మొత్తంగా : దేవరను దేవుడే కాపాడాలి, ఓం నమశ్శివాయ.

 

Rating: 2.5/5

Related News

Bhale Unnade OTT : అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mahesh Babu: మహేష్, రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ?

Devara Movie :’ దేవర ‘ హిట్ కొట్టిందా? సినిమాకు హైలెట్ అదే..?

TheyCallHimOG: ఓజీ రివ్యూ.. సుజీత్ సంభవం.. పవన్ కమ్ బ్యాక్ అదిరింది

Pushpa 2: పుష్ప 2 సెట్ లో బాహుబలి డైరెక్టర్.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో

NTR: పెద్ద ఎన్టీఆర్ డ్యాన్స్ ను దింపేశాడు మావా.. ఆయుధ పూజకు పూనకాలేరా

Big Stories

×