EPAPER
Kirrak Couples Episode 1

Jr NTR: పొలిటికల్ ఎంట్రీ పై తారక్ కామెంట్… మళ్లీ హీట్ పెంచాడు..

Jr NTR: పొలిటికల్ ఎంట్రీ పై తారక్ కామెంట్… మళ్లీ హీట్ పెంచాడు..

Jr NTR about political entry.. ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా నటించిన తాజా చిత్రం దేవర (Devara) . ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తొలిసారి తెలుగు తెరకు పరిచయమైంది. తన నటనతో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుందని చెప్పవచ్చు. సెప్టెంబర్ 27వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి రోజే భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని, మొదటి రోజే ఏకంగా రూ.172 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. రెండు రోజుల్లోనే ఏకంగా రూ .243 కోట్లు వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది. దేశంలోనే అత్యధికంగా తొలిరోజు కలెక్షన్లు రాబోతున్న చిత్రంగా మూడవ స్థానాన్ని దక్కించుకుంది దేవర. ఒకరకంగా చెప్పాలి అంటే నాన్ రాజమౌళి రికార్డ్స్ బ్రేక్ చేసింది అనడంలో సందేహం లేదు.


ప్రమోషన్స్లో జోరుగా పాల్గొంటున్న ఎన్టీఆర్..

ఇదిలా ఉండగా అటు నార్త్ లో కూడా ఈ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు చిత్ర బృందం. అందులో భాగంగానే ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తో పాటు పలువురు చిత్ర సభ్యులు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ జోరుగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్లో నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పలు ప్రశ్నలకు సమాధానం చెబుతూనే రాజకీయ ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చి మళ్ళీ హీట్ పెంచేశారు. తాజాగా ఎన్టీఆర్ ను ఉద్దేశించి యాంకర్ మాట్లాడుతూ.. మీ కుటుంబం నుంచి చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు. హీరోలు వచ్చారు. ఇక మీరు కూడా హీరోగా ఇప్పుడు స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నారు. మీ తదుపరి ప్లాన్ ఏంటి.? రాజకీయాల వైపు ఎప్పుడు అడుగులు వేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు.


పొలిటికల్ ఎంట్రీ పై ఎన్టీఆర్ క్లారిటీ..

దీనికి సున్నితనంగా సమాధానం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్. ఈయన మాట్లాడుతూ.. నాకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఇండస్ట్రీలోకి తొలి సినిమాతో అడుగుపెట్టాను. ఆ సినిమా థియేటర్లో చూసినప్పుడు అభిమానులు ఈలలు, చప్పట్లతో సందడి చేశారు. వారి ఆనందం నేను వారి ముఖంలో చూశాను. పైగా ఒక నటుడిగా నేను అభిమానులకు ఎంత వినోదాన్ని పంచగలనో అంతా చేస్తాను. ఇంతకంటే గొప్ప ఆనందం నాకు మరెక్కడా లభించదు. అందుకే రాజకీయాల వైపు వెళ్లాలని కూడా అనుకోవట్లేదు అన్నట్లుగా ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఒక్క మాటతో హీట్ పెంచేసిన ఎన్టీఆర్..

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎన్టీఆర్ కీలకంగా మారుతారు అని అందరూ అనుకునే లోపే ఇలా ఊహించని కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు ఎన్టీఆర్. మొత్తానికైతే హీరో గానే తనకు ఆనందాన్ని ఇస్తోందని కాబట్టి రాజకీయం వైపు తాను అడుగులు వేసే ప్రయత్నం చేయనన్నట్టుగా చెప్పినట్లు సమాచారం ఏది ఏమైనా ఎన్టీఆర్ రాజకీయాల వైపు వెళ్లరు అన్నట్లు వార్తలు రావడంతో టిడిపి శ్రేణుల్లో ఈ వార్త కాస్తా హీట్ ఎక్కిస్తోంది అని చెప్పవచ్చు.

Related News

FNCC President: బయటికొచ్చిన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల ఫలితాలు.. భారీ మెజారిటీతో గెలిచిన సీనియర్ నిర్మాత

Jani Master: దానివల్లే దీనిగురించి మాట్లాడలేను.. జానీ మాస్టర్ కేసుపై ఎట్టకేలకు నోరువిప్పిన మంచు విష్ణు

Devara: ఆదివారం అయినా అందుకోవడం లేదు.. తారక్‌కు ఇది తప్పదా..

Kamal Haasan: ప్యాన్ ఇండియా మల్టీ స్టారర్‌కు రూట్ క్లియర్.. కమల్ హాసన్‌తో ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా

Ram Charan: మెగా కుటుంబంలో ఆనందమే ఆనందం.. మొన్న చిరు.. నేడు చెర్రీకి అరుదైన గౌరవం

Arshad Warsi: అప్పుడలా ఇప్పుడలా.. ప్రభాస్‌ విషయంలో ప్లేట్ మార్చిన బాలీవుడ్ నటుడు

Big Stories

×